
బాలు, మీనా నిద్రపోతూ ఉంటారు. సడెన్ గా మీనాకు మెళకువ వస్తుంది. లేచి బాధగా కూర్చొంటే.. బాలు ఏమైందని అడుగుతాడు.‘ రోహిణీ నా టైమ్ బాలేదని స్వామిజీ చెప్పాడని చెప్పింది కదా.. అదే ఆలోచిస్తున్నాను’ అని మీనా అంటుంది. ‘ నువ్వు ఆ పార్లరమ్మ మాటలు వింటున్నావా? తను మా అమ్మ ముందు తనను తాను ఎక్కువ చేసుకోవాలని, నిన్ను తక్కువ చేయాలని అలా అంది.. నువ్వు పట్టించుకోకు’ అని బాలు చెబుతాడు. ‘ తను అన్నదని కాదు కానీ, నాకు ఈ మధ్య అలానే అనిపిస్తోంది.. మనకు కూడా చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి కదా’ అని మీనా అంటుంది. ‘ మొగుడు పెళ్లాళ్ల మధ్య గొడవలు రావడం సహజమే కదా’ అని బాలు నచ్చచెబుతాడు. అయినా.. మీనా రేపు ఏమౌతుందా అని భయపడుతుంటే.. బాలు.. ధైర్యం చెబుతాడు. నీకు తెలిసి కూడా నువ్వు ఏ తప్పు చేయవు.. ఇతరులను బాధ పెట్టవు కాబట్టి.. నీకు ఎలాంటి కష్టాలు రావు అని నచ్చచెప్పి పడుకోపెడతాడు.
రవి, శ్రుతి కూడా నిద్రపోతూ ఉంటే.. రవికి ఫోన్ వస్తుంది. వాళ్ల మేడమ్ నీతూ ఫోన్ చేస్తుంది. తనకు కొత్త డిష్ ఐడియా వచ్చిందని.. దాని గురించి డిస్కస్ చేయాలని ఫోన్ లో ఆ రెసిపీ గురించి చెబుతుంది. వీళ్ల ఫోన్ కాల్ శ్రుతికి డిస్టర్బ్ అవ్వడంతో.. బయటకు వెళ్లమని ఒక తన్ను తన్నుతుంది. ఇక.. బయటకు వచ్చి మాట్లాడటం మొదలుపెడతాడు. ఆ ఫోన్ కాల్ బాలు, మీనాకు ఇబ్బందిగా మారడంతో.. మళ్లీ పైకి వెళతాడు. వెనక్కి తిరిగి చూస్తే.. శ్రుతి పక్కనే ఉంటుంది.భర్తకు ఎవరైనా అమ్మాయి ఫోన్ చేస్తే.. నాకు నిద్ర పట్టదు అనేసి.. తిట్టి.. రవిని తీసుకొని వెళ్తుంది.
సీన్ కట్ చేస్తే.. ఉదయాన్నే మీనా వంట చేస్తూ ఉంటుంది. ఇంట్లో ముగ్గురు ఆడవాళ్లు ఉన్నా కూడా.. నువ్వే ఎందుకు వంట చేయాలని బాలు సీరియస్ అవుతాడు. దీంతో.. మీనా.. బాలుకి నచ్చ చెబుతుంది.దీంతో.. వంట చేసి రెస్ట్ తీసుకోమని చెబుతాడు.లేదని.. పూల వ్యాపారానికి వెళ్లాలి అని చెబుతుంది.వద్దు అని రెస్ట్ తీసుకోమని బాలు చెబితే.. మీనా వినదు. బయటకు వెళ్లడానికి బాలునే స్వయంగా తీసుకువెళతాను అని చెబుతాడు. అప్పుడే శ్రుతి వచ్చి కాఫీ అడుగుతుంది. కాఫీ తాగడం వచ్చు కానీ.. పెట్టుకోవడం రాదా అని బాలు అడుగుతాడు. ఆ మాటకు మీనా కోప్పడుతుంది. నేను పెట్టిస్తాను కదా.. మీరు వెళ్లి మీ పని చేసుకోండి అని పంపిస్తుంది.
ఇక.. రవి రెస్టారెంట్ లో బిజీగా ఉన్నప్పుడు శ్రుతి ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ ఎత్తకుండా.. రవి కట్ చేస్తాడు. దీంతో.. శ్రుతి మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంటుంది. రవి మళ్లీ కట్ చేస్తాడు. దీంతో.. శ్రుతి లోపలికి వెళ్లి చూస్తుంది. వాళ్ల మేడమ్ తో మాట్లాడుతూ కనపడతాడు. మళ్లీ ఫోన్ చేస్తుంది.. శ్రుతి చూస్తుండగానే రవి ఫోన్ కట్ చేస్తాడు. అంతే.. శ్రుతికి విపరీతంగా కోపం వచ్చి.. బయటకు వచ్చేస్తుంది. అది చూసిన రవి.. వాళ్ల మేడమ్ ని పర్మిషన్ అడిగి.. శ్రుతి వెనకాలే పరుగులు తీస్తాడు. కోపంగా ఉన్న శ్రుతికి రవి.. సారీలు చెబుతూనే ఉంటాడు. కానీ.. శ్రుతి వినిపించుకోదు. నీ బాస్ తో పని చేసుకో అని విసుక్కుంటుంది. దీంతో.. రవి... గుంజీలు తీసి మరీ క్షమాపణలు చెబుతాడు. డేట్ కి తీసుకువెళ్తాను అని బతిమిలాడటంతో.. శ్రుతి కూడా కరిగిపోతుంది.
మీనా తమ్ముడు శివ.. తన ఫ్రెండ్ తో కలిసి టీ తాగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి గుణ వస్తాడు. శివ టీ తాగిన బిల్లు కట్టడానికి గుణ అనుచరుడు వస్తాడు. కావాలని మళ్లీ.. శివను గుణ తనవైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తాడు. కానీ.. శివ పట్టించుకోడు. అక్కడి నుంచి వెళ్లిపోతాడు.ఎలాగైనా శివపై పగ తీర్చుకోవాలని గుణ అనుకుంటాడు. వెంటనే రోహిణీకి ఫోన్ చేసి.. బాలు దగ్గర ఉన్న వీడియో దొరికిందా అని అడుగుతాడు. అయితే.. బాలు చాలా మురుదు అని.. వీడియో తీసుకోవడానికి టైమ్ పడుతుందని రోహిణీ చెబుతుంది. తొందరగా పని కానివ్వమని గుణ వార్నింగ్ ఇస్తాడు. లేకపోతే.. దినేష్ కి వార్నింగ్ ఇవ్వను అని గుణ మరోసారి బెదిరిస్తాడు. సరే అని రోహిణీ ఒప్పుకుంటుంది.
ఇక, మీనాని.. బాలు స్వయంగా పూలు ఇవ్వడానికి తీసుకువెళతాడు. పూలు ఇచ్చి వెళ్తుంటే.. గుణకి బాలు, మీనా కనపడతారు. వాళ్ల స్కూటీని తన కారుతో గుద్దడానికి గుణ ప్రయత్నిస్తాడు. వాళ్ల వెనకే ఛేజ్ చేసుకుంటూ వెళతాడు.
మరోవైపు.. శ్రుతి కోపం పోగొట్టేందుకు రవి తన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. తనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చి.. శ్రుతి అందంగా ఉన్నావ్ అంటూ పొగుడుతూ ఉంటాడు. ఇంకోసారి ఫోన్ కట్ చేస్తే ఊరుకోనని..బిజీగా ఉంటే మెసేజ్ చేయమని చెబుతుంది. సరే అని రవి ఒప్పుకుంటాడు. తర్వాత ఫుడ్ విషయంలో.. బాస్ పేరు గుర్తు తెచ్చుకుంటాడు. అంతే.. మళ్లీ శ్రుతికి కోపం ముంచుకొస్తుంది. ముఖం మీద నీళ్లు కొట్టేసి.. శ్రుతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రవి మళ్లీ.. వెనకాలే పరుగులు తీస్తాడు. మరోవైపు బాలు, మీనా వెళ్తున్న బండిని.. గుణ తన కారుతో ఢీ కొట్టాలని చూస్తాడు. అది కాస్త బాలు పసిగడతాడు. కరెక్ట్ గా ఢీ కొట్టే సమయంలో.. బాలు, మీనా బండి మీద నుంచి దూకేస్తారు. దీంతో.. దెబ్బలు తగలకుండా బయటపడతారు. కానీ.. వాళ్ల బండి వెళ్లి.. రోడ్డు మీద ఉన్న ఇద్దరు ముసలివాళ్లకు తగులుతుంది. వాళ్లకు దెబ్బలు తగలడంతో.. బాలు, మీనా ప్రథమ చికిత్స చేస్తారు. తర్వాత.. వాళ్ల కష్టం విని.. బాలు, మీనా కరిగిపోతారు. పిల్లలు తమను వదిలేశారని తెలిసి బాధపడతారు. వాళ్లకు సహాయం చేస్తామని ముందుకు వచ్చి.. బాలు కొన్ని డబ్బులు ఇస్తాడు. వాళ్లు వద్దు అని చెప్పినా వినకుండా ఇస్తారు. తర్వాత.. మీనా తన దగ్గర ఉన్న పూలు తెచ్చి.. ముసలమ్మ తలలో పెడుతుంది. అప్పుడప్పుడు వచ్చి కలుస్తాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు.
ఇక, మౌనికను సంజూ బయటకు తీసుకువెళతాడు. ఎక్కడికి తీసుకువెళ్లాడా అని సంజూ తల్లి కంగారు పడుతుంది. ఈ లోగా.. సంజూ, మౌనిక వచ్చేస్తారు. ఎక్కడికి వెళ్లారు అని అడిగితే.. ఆయన హాస్పిటల్ కి తీసుకువెళ్లారని మౌనిక చెబుతుంది. హాస్పిటల్ కి ఎందుకు అంటే.. పిల్లలు పుడతారో లేదో తెలుసుకోవడానికి అని సంజూ చెబుతాడు. కాపురం చేస్తే తెలుస్తుందని వాళ్ల అమ్మ అంటే.. నీలకంఠం తిడతాడు. ముందే.. టెస్ట్ చేస్తే.. అసలు విషయం తెలుస్తుందని అంటాడు. ఆ మాటలు విని మౌనిక బాధపడుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.