పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మద్దతు కోసమే రెడ్ కండువా కట్టావా? బిగ్ బాస్ రన్నర్ గౌతమ్ రిప్లై ఇదే 

First Published | Dec 17, 2024, 1:57 PM IST

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మద్దతుతో టైటిల్ కొట్టాలనే ఉద్దేశంతో గౌతమ్ ఆయన మేనరిజమ్స్ ఇమిటేట్ చేయడం, ఎర్ర కండువా కట్టుకోవడం చేశాడనే విమర్శలు తలెత్తాయి. తాజాగా ఈ ఆరోపణలకు గౌతమ్ స్పష్టత ఇచ్చాడు. 
 

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మద్దతు ఉంటే టైటిల్ కొట్టడం చాలా ఈజీ అని కంటెస్టెంట్స్ నమ్ముతారు. సీజన్ వన్ లో శివ బాలాజీ, సీజన్ 2లో కౌశిక్ టైటిల్ కొట్టడం వెనుక పవన్ కళ్యాణ్ అభిమానుల సపోర్ట్ గట్టిగా ఉందనే వాదన ఉంది. ఈ క్రమంలో పలువురు కంటెస్టెంట్స్ పవన్ కళ్యాణ్ అభిమానులమని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. మానస్ వారిలో ఒకరు. 
 

ఇక సీజన్ 8లో గౌతమ్ కృష్ణ ఇదే పద్ధతి ఫాలో అయ్యాడు. నామినేషన్స్ డే నాడు కచ్చితంగా తలకు గౌతమ్ ఎర్ర కండువా కప్పుకునేవాడు. అలాగే పంచె కట్టులో దర్శనం ఇచ్చేవాడు. హౌస్లో కూడా తరచుగా గౌతమ్ రెడ్ కండువా తన కాస్ట్యూమ్స్ లో ఉండేలా చూసుకునేవాడు. పవన్ మేనరిజమ్స్ అనుకరించువాడు. ఈ క్రమంలో గౌతమ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. 

Tap to resize

ఆటతో కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానులను ఓన్ చేసుకుని టైటిల్ సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాడు. పవన్ ఫ్యాన్స్ ని బుట్టలో వేసుకుని ఓట్లు రాబట్టాలని నటిస్తున్నాడంటూ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. బిగ్ బాస్ సీజన్ 8కి గాను వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ టైటిల్ రేసులో నిలిచాడు. నిఖిల్ తో పోటీపడి రన్నర్ పొజిషన్ తో సరిపెట్టుకున్నాడు. 


డిసెంబర్ 15న గ్రాండ్ ఫినాలే ముగిసింది. నిఖిల్ టైటిల్ విన్నర్ అయ్యాడు. నబీల్, ప్రేరణ, అవినాష్.. తర్వాత స్థానాల్లో నిలిచారు. రన్నర్ గౌతమ్ ని ఓ మీడియా సంస్థ.. ఎర్ర కండువా కట్టుకుని, పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ ఇమిటేట్ చేస్తూ ఆయన ఫ్యాన్స్ ని ఓన్ చేసుకుని, టైటిల్ గెలవాలని స్కెచ్ వేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి మీ వివరణ ఏంటని అడగ్గా.. 

నేను పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్ ని. మీరు గత రెండు మూడేళ్ళుగా నా సోషల్ మీడియా హ్యాండిల్స్ చూసినా అర్థం అవుతుంది. ఇక ఎర్ర కండువా అనేది పవన్ కళ్యాణ్ అభిమానులను ఆకర్షించాడనికి కట్టుకోలేదు. ఎర్ర కండువా కామన్ మ్యాన్ వాయిస్. ప్రతి సామాన్యుడి వాయిస్ నేను ప్రెజెంట్ చేయడం కోసం ఎర్ర కండువా కట్టుకున్నాను, అంటూ వివరణ ఇచ్చాడు. 

గౌతమ్ సీజన్ 7లో సైతం కంటెస్ట్ చేశాడు. అయితే ఫైనల్ కి వెళ్లలేకపోయాడు. సీక్రెట్ రూమ్ కి వెళ్లిన గౌతమ్, రీ ఎంట్రీ ఇచ్చాడు. 13వ వారం గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. ఫైనల్ కి వెళ్లాలన్న తన కల నెరవేరలేదు. సీజన్ 8లో ఏకంగా టైటిల్ రేసులో నిలిచాడు. గౌతమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కావడం వలన టైటిల్ కోల్పోయాడు.  

Latest Videos

click me!