BrahmaMudi serial 30th december: అప్పూ పై నిందలు.. రుద్రాణి తుప్పు వదిలించిన కళ్యాన్..!

Published : Dec 30, 2023, 08:39 AM IST

ఏం నాటకాలు ఆడుతున్నావ్, ఆ కూతురి కడుపు అడ్డం పెట్టుకొని, ఈ కూతురిని మా ఇంటి కోడలిని చేయాలని చూశావ్’అని అంటుంది.  

PREV
17
BrahmaMudi serial 30th december: అప్పూ పై నిందలు.. రుద్రాణి తుప్పు వదిలించిన కళ్యాన్..!
Brahmamudi

BrahmaMudi serial 30th december:ట్రూత్ సిరప్ మత్తులో అప్పూ వెళ్లి కళ్యాణ్, అనామికలతో డ్యాన్స్ వేసిన విషయం తెలిసిందే. డ్యాన్స్ మధ్యలో అనామికను నెట్టేసి కళ్యాణ్ ని హత్తుకొని ఐ లవ్ యూ కళ్యాణ్ అని చెప్పేస్తుంది. అందరూ షాకై నిల్చుంటారు. సరిగ్గా అప్పుడే..అనామిక తల్లి ఆవేశంగా స్టేజీ మీదకు వచ్చి అప్పూని పక్కకు లాగేస్తుంది. రచ్చ చేయడం మొదలుపెడుతుంది. ఏమన్నావ్ ఇప్పుడు అని అడుగుతుంది. నీ మనసులో ఇలాంటి ఉద్దేశం పెట్టుకున్నావా అని అనామిక తండ్రి కూడా అడుగుతాడు.‘ నా కూతురితో పెళ్లి జరుగుతుంటే తట్టుకోలేక.. పెళ్లి ఆపాలని ఐలవ్ యూ చెప్పావా’ అని అడుగుతుంది. 

27
Brahmamudi

కావ్య వచ్చి ఏం మాట్లాడుతున్నారు అని సీరియస్ అవుతుంది. అందరూ విన్నారు కదా ఏం చెప్పిందో నీ చెల్లి అని అనామిక తల్లి సీరియస్ అవ్వగా,, మధ్యలో రుద్రాణి జోక్యం చేసుకుంటుంది. కనకం కడుపు నిండా ముగ్గురు కూతుళ్లను కని.. దుగ్గిరాల కుటుంబంపై పడేసిందని, ఇద్దరు ఆల్రెడీ ఇంటి కోడళ్లు అయ్యారు, ఇప్పుడు మూడో కూతురిని కూడా పంపడానికి ప్లాన్ చేస్తోందని అంటుంది. అనామిక తల్లి.. తన కూతురిని తిడుతుంది. పిచ్చి మొహంది నమ్మేసింది.. ఇప్పుడు ఇలా జరిగిందని అరుస్తుంది.

37
Brahmamudi

అప్పూ తండ్రి మూర్తి.. తమ కూతురికి అలాంటి ఉద్దేశం ఏమీ లేదని, జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు.  కనకం కూడా.. తమ అప్పూకి హద్దులు తెలుసుని, తమ ఇంటి పరిస్థితులు కూడా తెలుసు అని, ఇలాంటి విషయాల్లో అస్సలు తొందరపడదని, కేవలం స్నేహం మాత్రమే చేసిందని, తప్పుగా అనుకోవద్దని చెబుతుంది. రుద్రాణి మాత్రం ఊరుకోదు. ‘ ఏం నాటకాలు ఆడుతున్నావ్, ఆ కూతురి కడుపు అడ్డం పెట్టుకొని, ఈ కూతురిని మా ఇంటి కోడలిని చేయాలని చూశావ్’అని అంటుంది.

47
Brahmamudi

ఎప్పుడు తమ ఫ్యామిలీని ఏమన్నా ఊరుకొని ఉండే స్వప్న కూడా ఈ సారి సీరియస్ అవుతుంది. మా ఫ్యామిలీపై నిందలు వేయద్దు అని అరుస్తుంది.  తర్వాత కావ్య కూడా  మా కుటుంబాన్ని అందరి ముందు తక్కువ చేస్తే ఊరుకోం అని  అంటుంది. అనామిక తల్లి మాత్రం వినకుండా రాద్దాంతం చేయాలని చూస్తుంది.  అందరి ముందు నీ చెల్లి మాకు కాబోయే అల్లుడికి ఐలవ్ యూ చెప్పిందని అంటుంది. అదంతా విన్న కళ్యాన్ గట్టిగా..స్టాప్ ఇట్ అని అరుస్తాడు.

57
Brahmamudi

‘అందరూ ఏం మాట్లాడుతున్నారు..? ఎవరి గురించి ఏమంటున్నారు..? అసలు మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారు? అత్త...పైకి మోడ్రన్ గా డ్రెస్ వేసుకోవడం కాదు, సోషల్ గా ఆలోచించాలి. ఓ ఆడపిల్ల గురించి ఇలా తక్కువ చేసి మాట్లాడుకోకూడదు. నేను, అప్పూ ఇప్పటి నుంచి కాదు రాజ్ అన్నయ్య పెళ్లి అప్పటి నుంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం. తన మనసులో కానీ, నా మనసులో కానీ ఎలాంటి దురాలోచనలు లేవు. అయినా ఐలవ్ యూ అనే మాట ప్రేమించుకునేవారు మాత్రమే కాదు.. ఫ్రెండ్ ఫ్రెండ్ కి కూడా చెబుతారు. మనుషులు.. నచ్చిన మనుషులతో చెబుతున్నారు. అంత మాత్రాన అది ప్రేమ అయిపోతుందా? చాలు.. మీరు ఇంతకు మించి ఎదగలేరని అర్థమైంది. నా ఫ్రెండ్ ని, వాళ్ల ఫ్యామిలీని, తన అక్కలను అవమానించింది చాలు. మీరు ఇంత కన్నా ఎదగలేరని అర్థమైపోయింది. అనామిక నీకు అప్పూ గురించి తెలీదా? మన ఇద్దరినీ కలిపింది తనేనని నీకు తెలీదా? నేను నీకు క్లోజ్ అవ్వడానికి తాను ఎంత చేసిందో నీకు తెలీదా? ప్రేమిస్తే.. ఇవన్నీ చేసేదా’ అని అందరికీ సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు.

67
Brahmamudi

మధ్యలో ఇందిరాదేవి జోక్యం చేసుకొని ‘ కళ్యాణ్ ఆవేశపడకు. కొందరి సంస్కారం కొంత పరిధి మేరకే ఉంటుంది. ఆ పరిధి దాటితే ఇలాంటి నిందలే వస్తాయి. ఒక అబ్బాయి, అమ్మాయి స్నేహం చేస్తే వారి మధ్య ప్రేమ మాత్రమే వస్తుందని, ఇలాంటి ఆధునిక యుగంలో కూడా మనుషులు ఆలోచిస్తున్నారని అర్థమౌతోంది’ అని చాలా చక్కగా చెబుతుంది.

77
Brahmamudi

తర్వాత సుభాష్, ప్రకాశంలు సైతం అప్పూ ఫ్యామిలీకి అండగా మాట్లాడతారు. తన కొడుకు నిజంగా అప్పూని ప్రేమిస్తే, ఆ విషయం ఇంట్లో చెబుతాడని, మనసులో ఒకరిని పెట్టుకొని, మరొకరిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అని ప్రకాశం  అంటాడు. ‘ ఆ ఇద్దరి స్నేహాన్ని ఎప్పటికీ అపార్థం చేసుకోవద్దు. అది మీకే మంచిది కాదు’ అని ధాన్యలక్ష్మి అంటుంది.

తర్వాత అప్పూకి కళ్యాణ్ సారీ చెబుతాడు. తాను చేసిన పని వల్లే ఇదంతా జరిగిందని పద్దూ ఫీలౌతుంది. తర్వాత.. ఈ గొడవంతా పక్కన పెట్టమని, మళ్లీ సంగీత్ షురూ చేస్తారు. అను, ఆర్యలు అద్భుతంగా డ్యాన్స్ చేస్తారు. తర్వాత రాజ్ కావ్యలు,ఆ తర్వాత విక్కీ పద్దూలు కూడా డ్యాన్స్  ఇరగదీస్తారు. కావ్యకి పెద్దగా డ్యాన్స్ రాదు కాబట్టి.. మొత్తం డ్యాన్స్ రాజ్ వేయగా, అతనికి బాగానే సపోర్ట్ చేసింది. తర్వాత... ఫ్యామిలీ సాంగ్ కి అందరూ డ్యాన్స్ వేస్తారు. ఆ తర్వాత పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తారు.

click me!

Recommended Stories