Guppedantha Manasu Serial 25th December:గాయాలతో రిషి, మార్చురీలో వసుధార

Published : Dec 25, 2023, 07:21 AM IST

తర్వాత కారు పంక్చర్ అయ్యిందని ఆ వ్యక్తి చూస్తాడు. తానే  స్టెఫినీ మారుస్తానని మార్చేస్తాడు. అయితే, తమపై ఆ శైలేంద్రే ఎటాక్ చేయించాడని వసు..అనుపమతో అంటుంది.  

PREV
17
Guppedantha Manasu Serial 25th December:గాయాలతో రిషి, మార్చురీలో వసుధార
Guppedantha Manasu

Guppedantha Manasu Serial : రిషి కోసం వసు ఎండీ పదవి కూడా వదులుకోవడానికి కూడా సిద్ధపడుతుంది. కానీ, చివరి నిమిషంలో అనుపమ ఆధారం చూపించడంతో వసు ఆగిపోతుంది. అంతేకాదు.. శైలేంద్రకు తన పొగరు రుచి చూపిస్తుంది. 24గంటల్లో తన భర్త తన కళ్ల ముందు ఉండాలి అని కండిషన్ పెడుతుంది. ఆ అవమాన భారంతో బాధపడుతున్న శైలేంద్ర.. రిషి తప్పించుకోవడం, వసు బెదిరించడంతో కోపంతో ఊగిపోతాడు. దీంతో, వసును చంపించాలని ప్లాన్ చేస్తాడు. అందుకోసం రౌడీలను కూడా పంపిస్తాడు. శైలేంద్ర పంపిన రౌడీలు వసు, అనుపమను రౌండప్ చేస్తారు. నేటి ఎపిసోడ్ లో ఏం జరిగందో చూద్దాం..

ఓ వ్యక్తి వచ్చి వసు, అనుపమలను కాపాడతాడు. రౌడీలను తుక్కు తుక్కుగా కొడతాడు. అతను తమను కాపాడినందుకు వసు, అనుపమలు థ్యాంక్స్ చెబుతారు. అయితే, కాపాడినందుకు రూ.100 కావాలి అంటాడు. అయితే, కాస్త షాకైనా తర్వాత తేరుకొని అనుపమ రూ.500 ఇవ్వబోతుంది. కానీ ఆ వ్యక్తి తనకు రూ.500 వద్దు అని, రూ.100 చాలు అని, అంతకంటే ఎక్కువ డబ్బులు అవసరం లేదని ఈరోజుకి ఇవి చాలు అంటాడు. తర్వాత కారు పంక్చర్ అయ్యిందని ఆ వ్యక్తి చూస్తాడు. తానే  స్టెఫినీ మారుస్తానని మార్చేస్తాడు. అయితే, తమపై ఆ శైలేంద్రే ఎటాక్ చేయించాడని వసు..అనుపమతో అంటుంది.

27
Guppedantha Manasu

తర్వాత శైలేంద్రకు ఫోన్ చేస్తుంది.  ‘ ఏంటీ ఈపాటికి చనిపోవాలి కదా, ఇంకా బతికే ఉంది ఏంటి అనుకుంటున్నావా?’ అని అడుగుతంది. ‘ నేను అలా ఎందుకు అనుకుంటాను’ అని శైలేంద్ర అడుగుతాడు. ‘ మా మీద ఎటాక్ చేయించావ్ కదా’ అని వసు అంటే.. ఏమీ తెలియనట్లు.. ఎటాకా.. మీరు బాగానే ఉన్నారా అని అడుగుతాడు. అయితే, వసు తన దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దని వార్నింగ్ ఇస్తుంది. 

37
Guppedantha Manasu

ఇంత జరిగాక కూడా నీకు కొంచెం కూడా భయం లేదు అందుకే, మా మీద ఎటాక్ చేయించావ్ అని అడుగుతుంది. కానీ, శైలేంద్ర మాత్రం ఆ ఎటాక్ కీ నాకు ఎలాంటి సంబంధం లేదని, ఎంత మంది ఎటాక్ చేశారు? ఎలా ఎటాక్ చేశారు? ఎలా బయటపడ్డారు అని అడుగుతాడు. ‘ ఈ భూమ్మీద నీలాంటి రాక్షసులతో పాటు కొద్దిగా మానవత్వం ఉన్నవారు కూడా ఉంటారు, అలాంటి వ్యక్తి కాపాడారు అని ఈ ఎటాక్ నుంచి ఎలా బయటపడ్డానా అని కూపీ లాగుతున్నావా? ఈ ఎటాక్ నువ్వే చేయించావని నాకు తెలుసు.’ అని వసు అనగా, ‘ ఆ ఎటాక్ కీ నాకు ఎలాంటి సంబంధం లేదు, నమ్మవేంటి’ అని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. వసు మాత్రం నమ్మదు.‘ వీడియో చూపించిన తర్వాత కూడా నువ్వు ఎటాక్ లు చేయిస్తున్నావంటే నేను ఇంక ఊరుకోను. ఆ వీడియో ముకుల్ కి పంపడానికి నాకు నిమిషం పట్టదు. అదే జరిగితే. నువ్వు జైల్లో ఊచలు లెక్కపెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు చిప్పకూడు తినాల్సి వస్తుంది, రెండు రోజులు టైమ్ ఇచ్చాను కదా, ఆ లోగా రిషి సర్ ని తీసుకురాకపోతే, నీకు అదే గతి పడుతుంది. రిషి సర్ కి చీమ కుట్టినా నేను ఊరుకోను. నా సంగతి తెలుసుకదా, మొన్న చెంపదెబ్బతో సరిపెట్టాను. ఈసారి అలా ఊరుకోను’ అని వసు మాస్ వార్నింగ్ ఇస్తుంది.

47
Guppedantha Manasu

మరోవైపు శైలేంద్ర.. ఎటాక్ ఎలా మిస్ అయ్యిందా, వీళ్లను ఎవరు కాపాడారా అని ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు.. వసు కి రిషి ఫోన్ నుంచి కాల్ వస్తుంది. రిషి నుంచి ఫోన్ అనుకొని ఆనందంగా లిఫ్ట్ చేస్తుంది. కానీ, అది ఓహాస్పిటల్ అటెండర్ నుంచి వస్తుంది.  ఓ వ్యక్తి దగ్గర ఈ ఫోన్ ఉందని, అందుకే మీ నెంబర్ కి ఫోన్ చేశానని రమ్మని ఆ అటెండర్ చెప్పడంతో వసు, అనుపమలు షాకౌతారు. వెంటనే  మహేంద్రకు ఫోన్ చేసి విషయం చెబుతారు. అటు నుంచి మహేంద్ర.. ఇటు నుంచి వసు, అనుపమలు ప్రీతి హాస్పిటల్ కి బయలు దేరతారు.
వసు, అనుపమలను కాపాడిన వ్యక్తే స్వయంగా కారు లో వాళ్లను హాస్పిటల్ కి తీసుకువెళతారు.

57
Guppedantha Manasu

అక్కడ పోలీసులు ఉంటారు. రిషి ఫోన్ ని ఓ కవర్ లో సీజ్ చేసి ఈ ఫోన్ ఎవరిదో మీకు తెలుసా అని అడుగుతారు. అది రిషి ఫోన్  అని మహేంద్ర, నా భర్త ఫోన్ అని వసు అంటుంది. అయితే, ఆ ఫోన్ తమకు ఓ డెడ్ బాడీ దగ్గర దొరికిందని ఆ పోలీసులు చెబుతారు. అది విని మహేంద్ర,వసులు షాకౌతారు. ఆ డెడ్ బాడీ మీరు గుర్తించాలని పోలీసులు చెబుతారు. అది తన రిషి సర్ ది కాదు అని చూడకముందే ఏడ్చేస్తుంది. నేను చూడనంటే చూడను అంటుంది. అనుపమ ధైర్యం చెప్పే ప్రయత్నిస్తుంది కానీ, వసు వినిపించుకోదు. తాను చూడలేను అని ఏడుస్తుంది.

67
Guppedantha Manasu

పోలీసులు, హాస్పిటల్ అటెండర్ లు.. మార్చురీలోకి తీసుకువెళతారు.వాళ్లతోపాటు వసుని కాపాడిన వ్యక్తి కూడా చూడటానికి లోపలికి రావడం గమనార్హం. లోపలికి వెళ్లిన తర్వాత కూడా వసు ఆ డెడ్ బాడీని చూడటానికి ఇష్టపడదు. కానీ అనుపమ చూస్తుంది. అది రిషిది కాదు అని వాళ్లు ఊపిరి పీల్చుకుంటారు. అది తమ రిషిది కాదు అని ఆనందపడతారు. కానీ, అటెండర్ వెంటనే షాకిస్తాడు. ఆ ఫోన్ దొరికింది ఈ డెడ్ బాడీ దగ్గర కాదు అని, మరో డెడ్ బాడీ చూపిస్తాడు. దానిమీద మొత్తం రక్తం మరకలు ఉంటాయి.తీరా ఓపెన్ చేస్తే, అది కూడా రిషిది కాదు. మహేంద్ర వాళ్లు సంతోషిస్తారు. అసలు అతను ఎవరో కూడా తమకు తెలీదు అని చెబుతారు.  మరి ఆ ఫోన్.. ఇతని దగ్గరకు ఎలా వచ్చింది అని పోలీసులు అడుగుతారు. మరోవైపు ఆ డెడ్ బాడీని వసుని కాపాడిన వ్యక్తి, మహేంద్ర.. ఇద్దరూ ఎవరూ చూడకుండా ఫోన్ లో ఫోటో తీసుకుంటారు. తర్వాత.. వాళ్లు ఆనందంగా బయటకు వస్తారు.

77
Guppedantha Manasu

మరోవైపు ఓ వృద్ధ దంపతులు ఆకు పసరు నూరుతూ ఉంటారు. వాళ్లు.. రిషికి ఆకు వైద్యం చేస్తూ ఉంటారు.  రిషి స్పృహలో ఉండడు. ఒక్కసారిగా వసుధార అంటూ పిలుస్తాడు. అక్కడితో ఎపిసోడ్ ముగిసింది.

click me!

Recommended Stories