ఆఫర్స్ కోసం కమిట్మెంట్స్, ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను... బ్రహ్మముడి అప్పు రియల్ లైఫ్ కన్నీటి మయం!

Published : Feb 19, 2024, 06:09 PM ISTUpdated : Feb 19, 2024, 06:12 PM IST

తెలుగులో పాప్యులర్ సీరియల్ నటి నైమిషా రాయ్ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు. తల్లిదండ్రులతో తిరస్కరించబడిన నైమిషా రాయ్, క్యాస్టింగ్ కౌచ్ ఎదురుకుందట. ఆకలి తీర్చుకోవడానికి బ్లడ్ డొనేట్ చేసిందట. తాజా ఇంటర్వ్యూలో ఆమె తాను పడ్డ ఇబ్బందులు వివరించింది.   

PREV
16
ఆఫర్స్ కోసం కమిట్మెంట్స్, ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను... బ్రహ్మముడి అప్పు రియల్ లైఫ్ కన్నీటి మయం!
Nainisha Rai

స్టార్ మా లో ప్రసారం అవుతున్న పాప్యులర్ సీరియల్స్ లో బ్రహ్మముడి ఒకటి. ఈ సీరియల్ లో హీరోయిన్ చెల్లెలు అప్పు పాత్రలో మెప్పిస్తుంది నైనిషా రాయ్. ఈ బెంగాలీ చిన్నది పలు సీరియల్స్ లో భిన్నమైన రోల్స్ చేసింది. వంటలక్క సీరియల్ లో ఆమె నెగిటివ్ రోల్ చేసింది. 
 

26
Nainisha Rai

కొంచెం ఇష్టం కొంచెం కష్టం, భాగ్య రేఖ, ఇంటిగుట్టు, హంసగీతం సీరియల్స్ లో కీలక పాత్రలు చేసింది. ఈటీవీలో ప్రసారమైన శ్రీమంతుడు సీరియల్ లో లీడ్ రోల్ చేసింది. ఒకటి రెండు చిత్రాల్లో కూడా ఆమె నటించారు. 

 

36
Nainisha Rai

అయితే నటిగా ఎదిగే క్రమంలో ఆమె అనేక కష్టాలు పడ్డారట. నైనిషా తండ్రి లెక్చరర్ కాగా, యాక్ట్రెస్ అవుతానంటే ఒప్పుకోలేదట. దాంతో ఆమె పేరెంట్స్ ఆమెను బహిష్కరించారట. కొన్ని సందర్భాల్లో తినడానికి తిండి లేక ఇబ్బంది పడిందట. కడుపు నింపుకోవడానికి బ్లడ్ డొనేషన్ చేసిందట. 

46
Nainisha Rai

నటిగా ఆఫర్ అడిగితే నా కేంటి? అనేవారట. క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు అనేకం చూసిందట. ఒకరు ఆఫర్ ఇచ్చాక కమిట్మెంట్ అడగటం స్టార్ట్ చేశారట. ఇక షూటింగ్ మొదలవుతుంది అనగా... బలవంతం చేశారట. కొట్టి తప్పించుకుని వచ్చేసిందట. 

56
Brahmamudi

ఆఫర్స్ రాక తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటే... పేరెంట్స్ ఆదరించరు. చనిపోవడం మంచిదని పలుమార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేసిందట. ఆత్మవిశ్వాసంతో కష్ట నష్టాలు ఎదుర్కొని ఈ స్థాయిలో ఉన్నానని నైనిషా రాయ్ చెప్పుకొచ్చింది. 

 

66
Brahmamudi

బ్రహ్మముడి సీరియల్ లో హీరోయిన్ కావ్య చెల్లులు అప్పు పాత్రకు ఆమె బాగా కుదిరింది. మగరాయుడులా ప్రవర్తించే స్ట్రాంగ్ గర్ల్ గా నైనిషా రాయ్ ప్రేక్షకులను అలరిస్తుంది. ఒకపక్క సీరియల్స్ చేస్తూనే నైనీషా రాయ్ సినిమాల్లో పాత్రల కోసం ప్రయత్నం చేస్తుంది. 

click me!

Recommended Stories