BrahmaMudi 6th February Episode:నీకు, నా మొగుడికి తేడా ఏముంది..రాజ్ ని కడిగేసిన శ్వేత,కావ్య మాస్ యాంగిల్

First Published | Feb 6, 2024, 10:55 AM IST

నీకు, నా మొగుడికి పెద్ద తేడా కనపడటం లేదు.. అని రాజ్ కి బాగా క్లాస్ పీకుతుంది.  తానే వెళ్లి కావ్యకు చెబతాను అని అంటుంది.  నా సమస్య కోసం నువ్వు సహాయం చేస్తున్నావు అని చెబుతాను అంటుంది. కానీ రాజ్ ఆపేస్తాడు.
 

Brahmamudi


BrahmaMudi 6th February Episode: శ్వేత రాజ్ ని బయట కలుద్దాం అని అడుగుతుంది. కానీ.. కావ్యకు మండిపోయేలా చేయాలని ఆఫీసుకే రమ్మని చెబుతాడు.దీంతో వస్తుంది అయితే.. అక్కడ శ్వేతను చూసి కావ్య కారాలు మిరియాలు నూరుతుంది.  అది చూసిన తర్వాత.. కావ్య తమను తప్పుగా అర్థం చేసుకుంటోందనే విషయం శ్వేతకు అర్థమౌతుంది. వ ెంటనే కావ్య మనల్ని తప్పుగా అనుకుంటున్నప్పుడు.. మనం జస్ట్ ఫ్రెండ్ అని నువ్వు చెప్పాలి కదా అని  రాజ్ ని అడుగుతుంది. అయితే.. నేను చెప్పను అని రాజ్ అంటాడు.

Brahmamudi

ఎందుకు అంటే.. తనకు అసలు కావ్య అంటే ఇష్టం లేదని.. తమ  మధ్య అసలు ఏమీ లేదని..తనతో విడిపోవాలని అనుకుంటున్నానని చెబుతాడు. దీంతో.. శ్వేత షటప్ అని అరుస్తుంది. ఏ తప్పు చేయకుండా భార్యను ఎలా వదిలేస్తావ్..? మనల్ని చూసి తను కదా నీకు విడాకులు ఇవ్వాలి..కానీ తను కోపం తెచ్చుకుంటోంది కానీ.. విడాకులు ఇవ్వడం లేదు కదా అని శ్వేత అంటుంది. నా మొగుడంటే మూర్ఖుడు నీకు ఏమైంది..? నీకు, నా మొగుడికి పెద్ద తేడా కనపడటం లేదు.. అని రాజ్ కి బాగా క్లాస్ పీకుతుంది.  తానే వెళ్లి కావ్యకు చెబతాను అని అంటుంది.  నా సమస్య కోసం నువ్వు సహాయం చేస్తున్నావు అని చెబుతాను అంటుంది. కానీ రాజ్ ఆపేస్తాడు.


Brahmamudi


 ఈలోగా.. కావ్య ఫ్రస్టేషన్ తో రెచ్చిపోతూ ఉంటుంది. తన కోపం ఎలా తగ్గించుకోవాలా అని కావ్య అనుకుంటూ ఉంటే.. ఈ లోగా కళ్యాన్ ఫోన్ చేస్తాడు. ఇక కళ్యాణ్ తో తన ఫ్రస్టేషన్ మొత్తం తీర్చుకుంటుంది. మొత్తానికి కళ్యాణ్ ఏమైంది అని అడిగితే.. అప్పుడు శ్వేత వచ్చిందని.. ఇద్దరూ సరసాలు ఆడుకుంటున్నారని చెబుతుంది. ఇప్పుడు వాళ్లు ఏం చేస్తున్నారో చూస్తాను అని  వెళ్తుంది.

Brahmamudi

ఈలోగా.. శ్వేతను వెళ్లడానికి బయలుదేరుతుంది.  శ్వేత.. రాజ్ కి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు చాలా తప్పు చేస్తున్నావని. కావ్యలో తప్పు ఏదీ నీకు కనపడటం లేదు అంటున్నావ్?. అలాంటప్పుడు ఎందుకు విడిపోవాలని అనుకుంటున్నావ్ అని ప్రశ్నిస్తుంది. రాజ్ మాత్రం.. తనతో విడిపోవడానికి తాను కారణం వెతుకుతున్నానని.. తాను ఇప్పుడు తప్పుగా అర్థం చేసుకోవడం నాకు మంచి కారణం దొరికింది అంటాడు. కావ్య మన క్యారెక్టర్ల గురించి తప్పుగా అనుకోవడం నీకు సంతోషంగా ఉందా అని శ్వేత అడుగుతుంది.

Brahmamudi

అయితే.. రాజ్ మాత్రం.. కావ్యలో నిజంగానే వెతికినా ఎలాంటి కారణాలు దొరకవని, కానీ తనంటే నాకు ఇష్టం లేదని.. ఇప్పుడ కాదు పెళ్లి అయినప్పటి నుంచి తనతో విడిపోవాలని అనుకుంటున్నట్లు చెబుతాడు. రాజ్ మనసు మార్చడానికి శ్వేత చాలా ప్రయత్నిస్తుంది కానీ.. రాజ్ వినిపించుకోకుండా శ్వేతను పంపించేస్తాడు. శ్వేతను పంపే సమయంలో కావ్య చూస్తోందని.. మళ్లీ ఓవర్ చేస్తాడు.

Brahmamudi

సీన్ కట్ చేస్తే.. ఎవరో తల్లీ కొడుకులు కనకం ఇంటికి వస్తారు.  వాళ్ల అబ్బాయి అప్పూని చూసి ఇష్టపడ్డాడు అని పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి వస్తారు. ఈ లోగా అప్పూ వచ్చి ఏం జరుగుతుందని అడుగుతుంది. పెళ్లి చూపులని.. అబ్బాయి నిన్ను చూసి ఇష్టపడ్డాడు అని చెబుతుంది. కానీ.. అప్పూ.. కనకం చెప్పిన మాట వినిపించుకోదు. డైరెక్ట్ గా పెళ్లి కొడుకు దగ్గరకు వెళ్లి..తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పి. వాళ్లను పంపించేస్తోంది.

వాళ్లు వెళ్లిపోయిన తర్వాత.. కనకం అప్పూని తిడుతుంది. ఎందుకు అలా చేశావని..  మేం వెతికినా నీకు అలాంటి అబ్బాయిని తేలేమని నచ్చ చెప్పాలని చూస్తుంది.కానీ.. అప్పూ మాత్రం తన జిందగీ వేరు అని చెబుతుంది. పెళ్లి వద్దు అనడానికి ఒక్క కారణం చెప్పమని కనకం సీరియస్ అవ్వడంతో.. అప్పూ.. తనకు పోలీసు అవ్వాలని ఉందని చెబుతుంది. ఆ మాట విని కనకం మరింత షాకౌతుంది.

Brahmamudi

ఇక.. కావ్య ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరుతుంది. కారులో వెళ్తుంటే.. శ్వేత భర్త అరవింద్.. కావ్య కారును ఆపేస్తాడు. ఇక కావ్య అతనిపై తన ఫ్రస్టేషన్ అంతా తీర్చుకుంటుంది.  మీ ఆయన, శ్వేత కలిసి ఉన్న ఫోటోలు పంపింది నేనే అని చెబుతాడు. అంత అవసరం నీకు ఏముంది అని కావ్య అడిగితే... నేను శ్వేత భర్త అని చెబుతాడు.

నీ భర్త, నా భార్య మన ఇద్దరినీ మోసం చేస్తున్నారు అని చెబుతుంది. నా భార్య నాకు.. నీ భర్త నీకు.. విడాకులు ఇచ్చి వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని చెబుతాడు. నీ భర్త నా భార్యను ట్రాప్ చేశాడు అని చెబుతుంది.  అయితే.. నా భర్తను అన్నావంటే ఊరుకోను అని సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. నీ పెళ్లాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవడం చేత కాదా.. ఏ పనీ లేకుండా.. వాళ్ల ఫోటోలు తీస్తూ కూర్చున్నావా అంటూ.. నీలాంటి వాడిని మా ఏరియాలో చవట అంటారని.. నీకు కుదిరితే.. నీ పెళ్లి కంట్రోల్ లో పెట్టుకో అంటూ,... తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది. ఇంకోసారి కారు అడ్డుపెడితే.. కారుతోనే తొక్కించేస్తా అని వార్నింగ్ ఇస్తుంది. 

Brahmamudi

కావ్య రియాక్షన్ కి శ్వేత మొగుడు షాకైపోతాడు. అయితే.. కావ్యను చూసి.. ఇదేం ఆడదిరా బాబు అని భయపడతాడు. తన భార్య కూడా ఏరోజు తనను తిట్టలేదని.. తాను తిడితే పడిందని.. కొడితే కింద పడింది అనుకుంటాడు. దీనిని భరించలేక వాడు.. నా పెళ్లాం వెనక పడుతున్నాడు అని అనుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. 

Latest Videos

click me!