BrahmaMudi 3rd February Episode:కనకం కూతుళ్లా మజాకా.. కావ్యను మార్చేసిన స్వప్న, రౌడీలను కనిపెట్టిన అప్పూ..!

First Published | Feb 3, 2024, 9:49 AM IST

ఆ బిల్లు నేనే కట్టాను అని..  మీ క్రెడిట్ కార్డుతో కట్టాను అని చెబుతుంది. అది విని అందరూ నవ్వుకుంటారు. రుద్రాణి మాత్రం...కావ్యకు చీరలు కొంటే.. నాకెందుకు ఈ బొక్క అని అంటుంది.

Brahmamudi

BrahmaMudi 3rd February Episode:నిన్నటి ఎపిసోడ్ లో అప్పూ పిజ్జా డెలివరీకి వచ్చి ఓ పాప కిడ్నాప్ అయిన విషయం తెలుసుకుంటుంది. ఈ రోజు ఎపిసోడ్ లో అదే కంటిన్యూ అయ్యింది. తన ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి.. పాపను ఎక్కడ దాచి పెట్టారు అనే విషయాన్ని అప్పూ కనిపెట్టేస్తుంది.

Brahmamudi

మరోవైపు..దుగ్గిరాల ఇంట్లో అందరూ కూర్చొని ఉంటారు. అప్పుడే కొరియర్ బాయ్ వచ్చి.. మేడమ్ కొరియర్ అని చెబుతాడు. అది విని.. ఏ మేడమ్ అని అడుగుతారు. అయితే.. కళ్యాణ్ నేను చూస్తాను అని చెప్పి వెళ్లి చూస్తాడు. కళ్యాణ్ చేతిలో కొరియర్ బాయ్?. చీర కొరియర్స్ పెడుతూనే ఉంటాడు. అన్ని కొరియర్స్ రావడం ఏంటి? ఎవరైనా చీరల షాప్ పెడుతున్నారేమో.. రాంగ్ అడ్రస్ ఏమో అని అపర్ణ వాళ్లు అనుకుంటూ ఉంటారు. దాని మీద పేరు ఎవరిది ఉందో చూడండి అని అంటారు. అయితే... కళ్యాణ్ నాకు కనపడటం లేదని అంటాడు. అంత ఎత్తు వరకు చీరలు ఉంటాయి. అయితే..  రాహుల్ నేను చూస్తాను అని వెళతాడు. దాని మీద పేరు చూసి షాకైపోతాడు. అలా నిలపడి ఉంటాడు.


Brahmamudi

వెంటనే రుద్రాణి వచ్చి.. పేరు చదవమంటే అలా చూస్తావేంటి రా అని వచ్చి ఆమె కూడా చూసి షాకౌతుంది. ఏమైందని అందరూ అడిగితే.. అది నా పేరే.. కానీ నేను ఆర్డర్ చేయలేదు అని అంటుంది. అప్పుడు స్వప్న..వచ్చి నేనే ఆర్డర్ చేశాను అని చెబుతుంది. మీ పేరు మీద నేను ఆర్డర్ చేశాను కానీ.. మీకు కాదు.. నాకు కూడా కాదు అని కావ్య కోసం కొన్నాను అని  అంటుంది. బిల్లు ఎంత అయ్యింది అంటే ఆ డెలివరీ బాయ్ రూ.70వేలు అని చెబుతాడు. అంత బిల్లు నేను కట్టను అని రుద్రాణి అంటుంది. ఆల్రెడీ కట్టేశారు అని అతను చెప్పి వెళ్లిపోతాడు. అప్పుడు స్వప్న.. ఆ బిల్లు నేనే కట్టాను అని..  మీ క్రెడిట్ కార్డుతో కట్టాను అని చెబుతుంది. అది విని అందరూ నవ్వుకుంటారు. రుద్రాణి మాత్రం...కావ్యకు చీరలు కొంటే.. నాకెందుకు ఈ బొక్క అని అంటుంది.

Brahmamudi

అయితే.. నా కోడలు కోసం కొన్నారు కదా.. ఆ డబ్బులు నేనే ఇస్తాను అని అపర్ణ అంటుంది. నా డబ్బులు నాకు వచ్చాయి అది చాలు అని  రుద్రాణి అనుకుంటుంది. తన కోడలి కోసం అంటే నేను కూడా నా క్రెడిట్ కార్డు ఇచ్చేవాడిని కదా అని  కళావతికి చీరలు కావాలంటే నేను కొనిచ్చేవాడిని కదా అని రాజ్ అంటాడు. అయితే... నా చెల్లిని ఎవరో అప్పలమ్మలా రెడీ అవుతున్నావ్ అన్నారట. నా చెల్లిని అంత మాట అంటే నేను ఎందుకు ఊరుకుంటాను అని స్వప్న అంటుంది.

ఆ మాటకు రాజ్ ఫేస్ లో ఎక్స్ ఫ్రెషన్స్ మారిపోతాయి.  వెంటనే ఇంట్లో అందరూ.. కావ్యను అంత మాట అన్నది ఎవరు అని నానా హడావిడీ చేస్తారు. రాజ్ తనకు ఎందుకు వచ్చిన తంట అని ఆఫీసుకు వెళ్లిపోతాడు. ఇక..  స్వప్న ఆ చీరలన్నీ పట్టుకొని.. కావ్యను రెడీ చేయడానికి తీసుకువెళ్తుంది. చాలా సేపు అయినా రాలేదని రుద్రాణి సెటైర్ వేస్తుంది. అయితే..  తన కోడలు వెళ్లమన్నా మిస్ ఇండియా పోటీలకు వెళ్లే రకం కాదులే అని కావ్యను సపోర్ట్ చేస్తుంది. ఇదంతా చూసి.. ధాన్యలక్ష్మి, అనామికలకు కాలుతుంది.

Brahmamudi


ఇంతలో.. స్వప్న.. కావ్యను రెడీ చేసి తీసుకువస్తుంది. నిజానికి ఆ గెటప్ అసలు కావ్యకు సూట్ కాదు. కానీ.. ఇంట్లో అందరు మాత్రం వావ్ సూపర్ అని పొగిడేస్తారు. ధాన్యలక్ష్మి మాత్రం తనకు నచ్చలేదు అని ముఖం మీదే చెప్పేస్తుంది. అపర్ణ మాత్రం.. తన కోడలు ఆఫీసుకు వెళ్తుందని.. ఆ మాత్రం లేకపోతే ఎలా అని.. అక్కడి చాలా పెద్ద పెద్ద వాళ్లు వస్తూ ఉంటారు అని సపోర్ట్ చేస్తుంది.

Brahmamudi

అయితే కళ్యాణ్ మాత్రం.. వదినకు అలా రెడీ అవ్వడం ఇష్టం లేదు.. పులి వేషం వేసుకున్నదానిలా ఫీలౌతుంది.. అంటాడు. స్వప్న అవునని.. కానీ రాజ్ కావ్యను మోడ్రన్ గా చూడాలని అనుకుంటున్నాడని చెబుతుంది. అది విని అపర్ణ షాకౌతుంది. రాజ్ కావ్యను ఇలా చూడాలని అనుకుంటున్నాడా అని మనసులో అనుకుంటుంది. అయితే.. ఇందిరాదేవి మాత్రం... భర్తకు నచ్చినట్లు రెడీ అవ్వడంలో ఎలాంటి తప్పులేదని సపోర్ట్ చేస్తుంది. అమ్మమ్మగారికే నచ్చిందంటే.. అందరికీ నచ్చాల్సిందే అని స్వప్న కూడా చెబుతుంది.

Brahmamudi

సీన్ కట్ చేస్తే... అప్పూ.. ఆ రౌడీలు పాపను కిడ్నాప్ చేసిన ప్లేస్ ని కనిపెడుతుంది. వాళ్ల కంట పడకుండా.. లోపలికి వెళ్తుంది. సోమవారం ఎపిసోడ్ లో పాపను కాపాడి బయటకు తీసుకువచ్చే అవకాశం ఉంది.

ఇక.. కమింగప్ లో.. శ్వేత వచ్చి..కావ్యతో మంచిగా మాట్లాడుతుంది. కానీ.. కావ్య మాత్రం చాలా చిరాకుగా సమాధానం ఇస్తుంది. అయితే.. కావ్య మన గురించి తప్పుగా అనుకుంటుందని రాజ్ ద్వారా శ్వేతకు తెలుస్తుంది. ఇప్పుడే వెళ్లి కావ్య కు నిజం చెబుతాను అని  శ్వేత అంటుంది. ..రాజ్ మాత్రం తనకు కావ్య అంటే ఇష్టం లేదని.. విడాకులు  ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెబుతాడు. మరి సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Latest Videos

click me!