Sohel : సోహెల్ పై బిగ్ బాస్ అరియానా ఫైర్.. ‘నాకు నువ్వంటే అస్సలు పడదు’.. చిర్రెత్తిపోయిన ఆర్జీవీ గర్ల్?

Shreekanth Nuthi | Updated : Feb 02 2024, 01:39 PM IST

నటుడు సోహెల్ సినిమా రిలీజ్ అయిన వేళ బిగ్ బాస్ అరియానా Bigg Boss Ariyana ఫైర్ అయ్యింది. అతను చేసిన పనికి ఏమాత్రం కోపం తగ్గడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

16
Sohel : సోహెల్ పై బిగ్ బాస్ అరియానా ఫైర్.. ‘నాకు నువ్వంటే అస్సలు పడదు’.. చిర్రెత్తిపోయిన ఆర్జీవీ గర్ల్?

బిగ్ బాస్ అరియానా బుల్లితెరపై సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ తెగ సందడి చేస్తూ ఉంటుంది. ఆసక్తికరమైన పోస్టులు పెడుతూ ఉంటుంది. కానీ తాజాగా Bigg Boss Sohel పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. 

26

బిగ్ బాస్ షోతో మంచి ఫేమ్ దక్కించుకున్న సోహెల్ Sohels ప్రస్తుతం హీరోగా వరుస చిత్రాతో అలరిస్తున్న విషయం తెలిసిందే. రోటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నాడు. చివరిగా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా ఆకట్టుకున్నారు. 

36

ప్రస్తుతం మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సోహెల్ నటించిన సినిమా ‘బూట్ కట్ బాలరాజ్’ Bootcut Balaraju ఈరోజు రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా అరియానా గ్లోరీ బిగ్ బాస్ సోహెల్ చేసిన పనికి ఫైర్ అయ్యంది. ఇన్ స్టా స్టోరీలో వీడియోను పంచుకుంది. 

46

అరియానా మాట్లాడుతూ..  ‘సోహెల్ నీ మీద కోసం ఏమాత్రం తగ్గడం లేదు. నువ్వు చేసేవన్నీ చేసి అరియానా నా బెస్ట్ ఫ్రెండ్ అని క్యూట్ గా చెబుతుంటావు. అసలు నాకు నువ్వంటే ఏమాత్రం పడదు. ఏదేమైనా నీ సినిమా... బూట్ కట్ బాలరాజు.. మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను.’ అంటూ వీడియో పెట్టుకుంది. 

56

అయితే... అరియానాను సోహెల్ ఏ విషయంలో హార్ట్ చేశారనేది చెప్పలేదు. కానీ తన కోపాన్ని మొత్తం బయటపెట్టింది. చివర్లో తన మిత్రుడు నటించిన సినిమాను ఆదరించాలని తన అభిమానులను కోరింది. 

66

ఇక ‘బూట్ కట్ బాలరాజు’ సినిమాను సోహెలే నిర్మించారు. ఇవ్వాళ (ఫిబ్రవరి 2న) గ్రాండ్ గా విడుదలైంది. గ్లోబల్ ఫిలిమ్స్, కథ వేరుంటాది బ్యానర్స్ పై రూపుదిద్దుకుంది. మేఘ లేఖ హీరోయిన్. సునీల్, సిరి హన్మంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. 

Read more Photos on
click me!