BrahmaMudi 28th march Episode:రాజ్ ని జైలుకు పంపుతానని స్వప్న వార్నింగ్, రాజ్ కి బాబు తల్లి ఫోన్..?

First Published Mar 28, 2024, 10:22 AM IST

తర్వాత రాజ్ కి ఫోన్ వస్తే పక్కక వెళతాడు. బాబు వాళ్ల అమ్మ చేసింది అనుకుంట అని రుద్రాణి అంటే.. రాజ్ కోపంగా చూస్తాడు. దీంతో రుద్రాణి నోరు మూస్తుంది.
 

Brahmamudi

BrahmaMudi 28th march Episode:కావ్య బాబుకి ఉగ్గు లేదని.. బయటకు వెళ్లి కళ్యాణ్ తో తెప్పిస్తుంది. దానికే అనామిక ఇంట్లో రచ్చ చేస్తుంది. అయితే.. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా  కావ్య ఉగ్గు తీసుకొని లోపలికి వెళ్తుంది. రాజ్ కి తినిపించడం రాక ఇబ్బంది పడుతుంటే.. తానే తినిపిస్తుంది. తర్వాత.. ఇంట్లో ఉయ్యాల కట్టి.. ఆ ఉయ్యాలలో బాబుని నిద్రపుచ్చుతుంది.  అర్థరాత్రి వరకు మేల్కొని ఉండి మరీ.. బాబుని నిద్రపుచ్చుతుంది. ఆ టైమ్ కి వరకు అసలు విసుక్కోకుండా బాబుని నిద్రపుచ్చినందుకు రాజ్ సంతోషిస్తాడు. కావ్యకు థ్యాంక్స్ చెబుతాడు. అయితే.. మీరు థ్యాంక్స్ చెబితే ఆనందపడే రోజులు ఎప్పుడో పోయాయి అని కావ్య  నిట్టూరుస్తుంది.

Brahmamudi

సీన్ కట్ చేస్తే... ఉదయాన్నే ఇంట్లో అందరికీ కావ్య కాఫీలు ఇస్తూ ఉంటుంది. అంతలో డెలివరీ బాయ్  వచ్చి డెలివరీ తీసుకోమని అంటాడు. అయితే.. రుద్రాణి ఇక తన సెటైర్లు మొదలుపెడుతుంది. ఆల్రెడీ డెలివరీ అయ్యి.. బేబీ బాయ్ వచ్చాడు.. ఇంకా ఏం డెలివరీ వచ్చింది అని రుద్రాణి అంటుంది. రాహుల్ వెళ్లి చూసి ఉయ్యాల అని అంటాడు. తీసుకొని లోపలికి వస్తాడు.

Brahmamudi

వెంటనే రుద్రాణి కావాలని..అపర్ణకు మండాలని.. వదిన నువ్వే కదా ఈ ఉయ్యాల ఆర్డర్ ఇచ్చిందని.. మనవడి కోసం ఆర్డర్ ఇచ్చావ్ కదా వదినా అంటూ సెటైర్లు వేస్తుంది.  ఇంకా బాబుకి ఆ ఫంక్షన్ చేయ్యాలి.. ఇవి పంచి పెట్టాలి అని ఓవర్ యాక్షన్ చేస్తుంది. అపర్ణకి మండిపోతుంది. తాను తన కొడుకే దూరం పెట్టానని.. అలాంటిది..వాడి కొడుకు కోసం ఉయ్యాల ఆర్డర్ చేస్తానా అని అంటుంది. మరి.. ఎవరు ఆర్డర్ చేశారు అని అంటుంది.

Brahmamudi

అప్పుడే రాజ్ బాబుని ఎత్తుకొని వచ్చి.. తానే ఆర్డర్ ఇచ్చాను అంటాడు. వెంటనే.. ఆ ఉయ్యాలను ఫిక్స్ చేస్తాడు. తర్వాత రాజ్ కి ఫోన్ వస్తే పక్కక వెళతాడు. బాబు వాళ్ల అమ్మ చేసింది అనుకుంట అని రుద్రాణి అంటే.. రాజ్ కోపంగా చూస్తాడు. దీంతో రుద్రాణి నోరు మూస్తుంది.

Brahmamudi

తర్వాత.. ధాన్యలక్ష్మి రచ్చ మొదలుపెడుతుంది. ఇంట్లోనే ఉయ్యాల తెచ్చి వేశాడు.. మీరేమీ అడగరేంటి అత్తయ్య అని అంటుంది. రుద్రాణి ఓవర్ యాక్షన్ చేస్తుంది. రాజ్ కదా.. ఎవరూ ఏమీ అనరు.. చెయ్యలేరు అని అంటుంది. అపర్ణ అక్కడి నుంచి ఆ మాటలు వినలేక లేచి వెళ్లిపోతూ ఉంటుంది. ఇక.. బాబు ఏడ్వడం మొదలుపడతాడు. కావ్య ఎత్తుకుందామని చూస్తే.. అపర్ణ చూపులకు ఆగిపోతుంది.

Brahmamudi

ఇంతలో స్వప్న వచ్చి ఎత్తుకుంటుంది. బాబుని ఓదార్చుతుంది. పసివాడు ఏడుస్తుంటే.. చూస్తూ ఉన్నారేంటి అని అందరినీ స్వప్న నిలదీస్తుంది. అసలు వాడు ఎవరి బిడ్డో తెలిస్తే.. నీలో మానవత్వం పొంగుకొస్తుంది అని రుద్రాణి అంటే.. అప్పుడు స్వప్నకు డౌట్ వస్తుంది. ఎవరు ఈ బాబు.? తల్లి ఎవరు...? అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది.

Brahmamudi

ఈ బాబు రాజ్ కొడుకు అని రుద్రాణి చెబుతుంది. ఆమాటకు స్వప్నకి ఫ్యూజులు పోతాయి.  రాజ్ కాదు.. రాహులా అని అడుగుతుంది. అయితే... ఆ పని చేసింది రాజ్ అని... ఎవరితోనే బిడ్డను కని తీసుకువచ్చాడు అని రాహుల్ చెబుతాడు. ఆ మాటలకు స్వప్నకు కోపం వస్తుంది. ఇలాంటి దరిధ్రపు పనులు నువ్వు తప్ప ఎవరూ చేయరని, రాజ్ అస్సలు చేయడని.. రాజ్ మీద నిందలు వేస్తుంటే మీరు ఎలా ఊరుకుంటున్నారు అని స్వప్న ఇంట్లో వాళ్లను నిలదీస్తుంది. కానీ.. వాడు రాజ్ కొడుకే అని రుద్రాణి అంటుంది. కానీ.. స్వప్న నమ్మదు.  రాజ్ క్యారెక్టర్ పై నింద వేస్తుంటే.. అందరూ ఊరుకున్నారేంటి అని స్వప్న అడిగితే...  రాజ్ వచ్చి నా బిడ్డ అని చెప్పి తీసుకొని వెళ్లిపోతాడు. స్వప్న కూడా షాక్ లో ఉండిపోతుంది.

Brahmamudi

ఇక.. స్వప్న.. కావ్యను గదిలోకి తీసుకువచ్చి ఇంట్లో ఏం జరుగుతందని అడుగుతుంది. కానీ కావ్య సమాధానం చెప్పకుండా.. తప్పించుకోవాలని చూస్తుంది. కానీ స్వప్న ఊరుకోదు. కావ్యను తిడుతుంది. నీ మొగుడు ఒక బిడ్డను తెచ్చి నా కొడుకు అంటే.. నువ్వు చేయాల్సింది ఇదేనా..? రాజ్ ని నిలదీయమని స్వప్న అంటుంది. కానీ.. దాని వల్ల తనకు ఉపయోగం ఉండదని కావ్య అంటుంది. అయితే... రాజ్ మీద పోలీసు కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తాను అని స్వప్న అంటుంది. రాజ్ ని అరెస్టు చేసి.. కోర్టుకు లాగాల్సిందే అని పట్టుపడుతుంది. అయితే.. అది తన పరిష్కారం కాదని కావ్య అంటుంది. ఆల్రెడీ ఇంట్లో వాళ్లు రాజ్ కి శిక్ష వేశారని.. జైల్లో ఉన్నట్లే అని అంటుంది.

నిజం ఏంటో తెలిసే వరకు తాను ఎదురుచూడక తప్పదని.. అప్పటి వరకు ఏ గొడవ చేయకు అని స్వప్న ను అడుగుతుంది. వీలైతే.. తనకు సహాయం చేయమని.. ఈ ఇంట్లో నువ్వు తప్ప... ఎవరూ హెల్ప్ చేసేవాళ్లు లేరు అని కావ్య బతిమిలాడుతుంది. నీ కోసం.. కొద్ది రోజులు ఆగుతానని.. తర్వాత.. ఎవరు చెప్పినా వినను అని.. ఇంట్లో అందరినీ రోడ్డు మీదకు ఈడ్చేస్తాను అని స్వప్న చెప్పేసి వెళ్లిపోతుంది.
 

Brahmamudi

ఇక కళ్యాణ్.. అప్పూకి ఫోన్ చేస్తాడు. అయితే.. కావ్య గురించి అప్పూ బాధపడుతుంది. తాను వదినను చూసుకుంటాను అని కళ్యాణ్ అంటాడు. నువ్వు పోలీసు సెలక్షన్స్ పై ఫోకస్ పెట్టమని కళ్యాణ్ అప్పూకి చెబుతాడు. సరే అని అంటుంది. అవన్నీ... అనామిక వింటుంది. 

Brahmamudi

నువ్వు ఇలా దొంగచాటుగా వినడం మానవా అని కళ్యాణ్ అంటే... తాను నీ భార్య అని.. ఏదైనా వినే హక్కు తనకు ఉందని, నువ్వు చేసే పనులే బాలేవు అని అంటుంది. అప్పూ తన ఫ్రెండ్ మాత్రమే అని కళ్యాణ్ అంటే.. పేరు ఏదైనా చేసే పని అదేకదా అని సెటైర్ వేస్తుంది. భార్య ఉండగా మరో అమ్మాయితో మాట్లాడే బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందా అని అనుకున్నాను అని.. నీ అన్నను చూశాక అర్థమైందని.. ఇద్దరిదీ ఒకటే రక్తం కదా అని అంటుంది. అయితే... తన అన్నయ్యను అంటే ఊరుకోను అని కళ్యాణ్ వార్నింగ్ ఇస్తాడు. అయితే... తాను లేనిది అనలేదని.. ఉన్నదే అన్నాను అని అంటుంది. అవకాశం వచ్చిందని నోటికి వచ్చినట్లు వాగకు అని కళ్యాణ్ అంటే... నువ్వు దానితో మాట్లాడితే అలాగే అంటాను అని.. నువ్వు కూడా మీ అన్నయ్యలాగా చేస్తే ఊరుకోను అని.. మీ వదిన అంత మంచిదాన్ని కాదు అని అంటుంది. కానీ.. కళ్యాణ్.. తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Brahmamudi

ఇక రాజ్ బుడ్డోడిని స్నానానికి తీసుకువెళ్లాలని అనుకుంటాడు. ఎలా చేపిస్తావ్ అని కావ్య అంటే.. షవర్ కింద నిలపెడతాను అని రాజ్ అంటాడు. అలా చేపిస్తే.. జ్వరం వస్తుందని కావ్య చెబుతుంది. అవునా.. నాకు తెలీదు అని రాజ్ అంటే.. తెలిస్తే.. వాళ్ల అమ్మను కూడా తీసుకొని వచ్చేవారు కదా అని సెటైర్ వేస్తుంది. ఇక..  స్నానం ఎలా చేయించాలో కావ్య చెబుతుంది. గార్డెన్ కి బాబుని తీసుకురమ్మని.. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తాను అంటుంది. ఇక వెళ్తూ వెళ్తూ.. ఆ బిడ్డ తల్లి ఎవరో చెప్పమని వార్నింగ్ ఇచ్చిమరీ వెళ్తుంది. తర్వాత.. స్నానానికి ఏర్పాట్లు చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

click me!