నామినేషన్స్ లో టాప్ కంటెస్టెంట్స్, ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

First Published | Oct 7, 2024, 8:36 AM IST

సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. 6వ వారానికి గాను ఆరుగురు నామినెట్ అయినట్లు సమాచారం అందుతుంది. మరి వీరిలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు? ఇంట్రెస్టింగ్ స్టోరీ.. 

Bigg boss telugu 8

వైల్డ్ కార్డ్ ఎంట్రీతో  బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా మారింది. ఫైర్ బ్రాండ్స్ తో పాటు నాన్ స్టాప్ ఎంటర్టైనర్స్ ని హౌస్లోకి తెచ్చారు. సాధారణంగా నయా సెలెబ్రిటీలను కంటెస్టెంట్స్ గా ఎంపిక చేస్తారు. దానికి భిన్నంగా మాజీ కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చారు. 
 

Bigg boss telugu 8

హరితేజ, టేస్టీ తేజ, గంగవ్వ, మెహబూబ్, అవినాష్, గౌతమ్ కృష్ణ, నయని పావని, రోహిణి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం ఘనంగా రీ లాంచ్ ఈవెంట్ ముగిసింది. ఆల్రెడీ హౌస్లో ఉన్న 8 మంది ఒక క్లాన్ గా.. వైల్డ్ కార్డ్స్ మరొక క్లాన్ గా టాస్క్ లలో పోటీపడనున్నారు. 

ఇక సోమవారం యధావిధిగా నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. యష్మిని హరితేజ నామినేట్ చేసింది. హరితేజకు యష్మి ఆటపై మంచి అభిప్రాయం లేదు. ఈ విషయాన్ని ఆమె నేరుగా నాగార్జునతో వేదికపై చెప్పారు. యష్మికి గట్టిగా ఇస్తానని పరోక్షంగా వెల్లడించింది. హౌస్లో సుత్తి ఎవరు అనగా? హరితేజ.. యష్మి పేరు చెప్పిన సంగతి తెలిసిందే. 
 


Bigg boss telugu 8

నామినేషన్స్ ప్రక్రియ వాడివేడిగానే సాగినట్లు సమాచారం. మెజారిటీ కంటెస్టెంట్స్ యష్మి ని నామినేట్ చేశారట. ఆమెకు అత్యధికంగా వ్యతిరేక ఓట్లు పడ్డాయట. ప్రక్రియ ముగిసిన అనంతరం గంగవ్వ, యష్మి, విష్ణుప్రియ, పృథ్విరాజ్, సీత, మెహబూబ్ నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. వీరిలో వచ్చే వారం ఒకరు ఎలిమినేట్ అయ్యా ఛాన్స్ ఉంది. 

శుక్రవారం అర్ధరాత్రి వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయి. ఇక నామినేట్ అయిన ఆరుగురు కంటెస్టెంట్స్ లో గంగవ్వ వీక్ అని చెప్పొచ్చు. కానీ ఆమెకు సింపతీ ఓట్లు బాగా పడతాయి. కానీ గంగవ్వ హౌస్లో ఉంటే... మిగతా కంటెస్టెంట్స్ గేమ్ డిస్ట్రబ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఆమెను మొదటివారమే ఇంటికి పంపే అవకాశం లేకపోలేదు. బిగ్ బాస్ షోలో చాలా ఎలిమినేషన్స్, ప్రేక్షకుల అభిప్రాయానికి వ్యతిరేకంగా జరిగాయి. 

Bigg boss telugu 8

విష్ణుప్రియకు స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె టైటిల్ ఫేవరేట్స్ లో ఒకరు. కాబట్టి విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. నామినేషన్స్ లో ఉంటున్న ప్రతిసారి ఆమెకు టాప్ 3లో ట్రెండ్ అవుతుంది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన మహబూబ్ స్ట్రాంగ్ ప్లేయర్. ఒకటి రెండు వారాల్లో అతడిని బయటకు పంపరు. కనీసం మెహబూబ్ జర్నీ ఐదు వారాలకు మించి సాగే అవకాశం ఉంది. 

యష్మి పై కొంత నెగిటివిటీ ఉంది. అయితే ఎలిమినేట్ అయ్యే స్థాయిలో కాదు. స్టార్ మా బ్యాచ్ గా ఆమెకు పరోక్షంగా మద్దతు ఉంటుంది. బుల్లితెర ఆడియన్స్ నుండి ఓట్లు పడతాయి. సీత, పృథ్విరాజ్ సైతం స్ట్రాంగ్ గా ఉన్నారు. ఒక అంచనా ప్రకారం గంగవ్వను ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. 
 

Bigg boss telugu 8

కాగా మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా వెలుగులోకి వచ్చింది గంగవ్వ. ఈమెది తెలంగాణ రాష్ట్రంలోని లంబాడిపల్లి అనే కుగ్రామం. గంగవ్వలోని ప్రత్యేకతలు గుర్తించిన స్థానిక యువకులు, వీడియోలు చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. గంగవ్వ వీడియోలకు విశేష ఆదరణ దక్కింది. అలా సోషల్ మీడియా స్టార్ గా ఎదిగింది. 

గంగవ్వ అనూహ్యంగా బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్ట్ చేసే ఛాన్స్ దక్కించుకుంది. దాంతో ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. మంచి ఇల్లు నిర్మించుకోవాలి అనేది గంగవ్వ కల. దానికి అవసరమైన డబ్బుల కోసమే బిగ్ బాస్ షోకి వచ్చానని గంగవ్వ వెల్లడించింది. స్వచ్ఛమైన పల్లెటూరు వాతావరణంలో పుట్టి పెరిగిన గంగవ్వకు బిగ్ బాస్ హౌస్ సరిపడలేదు. 
 

ఎలాగైనా చివరి వరకు హౌస్లో ఉండాలని ఆమె ప్రయత్నం చేసింది. వయసు రీత్యా అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఇల్లు, పిల్లలు గుర్తుకొచ్చి దిగులు చెందింది. దాంతో 5వ వారం ఎలిమినేట్ కాకుండానే గంగవ్వ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసింది. అయితే ఇంటి నిర్మాణానికి డబ్బులు సమకూర్చుతామని నాగార్జున హామీ ఇచ్చారు. చెప్పినట్లే గంగవ్వకు కొంత ఆర్థిక సహాయం చేశారు. 

రూ. 22 లక్షల ఖర్చుతో గంగవ్వ ఇల్లు నిర్మించుకుంది. గంగవ్వకు ఒక కల ఉందట. 50 ఆవుల ఒక ఫార్మ్ ఏర్పాటు చేసి, పాలు అమ్ముకుంటూ జీవించాలనేది చిరకాల వాంఛ అట. ఎప్పటికైనా అది చేస్తానని గంగవ్వ అంటున్నారు. గంగవ్వ అరడజనుకు పైగా సినిమాల్లో నటించింది. చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన మల్లేశం మూవీలో ఓ పాత్ర చేసింది. ఇస్మార్ట్ శంకర్, ఎస్ ఆర్ కళ్యాణమండపం, రాజ రాజ చోర, లవ్ స్టోరీ, గాడ్ ఫాదర్ చిత్రాల్లో గంగవ్వ నటించిన సంగతి తెలిసిందే. 
 

Latest Videos

click me!