రెండో వారం షాకింగ్ ఎలిమినేషన్? ఆ కంటెస్టెంట్ ఇంటికి!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో ఎలిమినేషన్ రంగం సిద్ధమైంది. మరి 8 మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఇంటిని వీడేది ఎవరు? షాకింగ్ ఎలిమినేషన్ జరగనున్నట్లు సమాచారం. 
 

Bigg boss telugu 8

శుక్రవారంతో ఓటింగ్ ముగియగా ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. నామినేషన్స్ లో విష్ణుప్రియ, నాగ మణికంఠ, శేఖర్ బాషా, నైనిక, కిరాక్ సీత, ఆదిత్య ఓం, పృథ్విరాజ్, నిఖిల్,  ఆసియానెట్ పోలింగ్ ప్రకారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో చూద్దాం..

సెప్టెంబర్ 1న 14 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. మొదటివారం బేబక్క ఎలిమినేట్ అయ్యింది. సోషల్ మీడియా స్టార్ బేబక్క కొన్ని వారాలు హౌస్లో రాణిస్తుందని భావించారు. కానీ ఆమె వారం రోజులకే చేతులు ఎత్తేశారు. వయసు రీత్యా బేబక్క టాస్క్ లలో పెద్దగా ప్రభావం చూపడం లేదు. అది కూడా ఆమెకు మైనస్ అని చెప్పొచ్చు. 
 


Bigg boss telugu 8

బేబక్క ఎలిమినేషన్ అనంతరం హౌస్లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. గత సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. 8 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఈ ఆదివారం ఇంటిని వీడాల్సి ఉంది. శుక్రవారమే ఓటింగ్ లైన్స్ ముగుస్తాయి. అంటే ఆడియన్స్ తీర్పు నమోదైంది. వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇవ్వనున్నాడు. 
 

Bigg boss telugu 8

వారం రోజులుగా బిగ్ బాస్ హౌస్లో జరిగిన సంఘటనలు, కంటెస్టెంట్స్ పెర్ఫార్మన్స్, ప్రవర్తన మీద రివ్యూ ఉంటుంది. బాగా ఆడిన వారిని ప్రశంసించడం, ఆడనివారికి క్లాస్ పీకుతాడు. సోనియా ఆకుల కంటెస్టెంట్స్ విష్ణుప్రియ మీద పర్సనల్ అటాక్ చేసింది. విష్ణుప్రియ జోక్స్, డ్రెస్సింగ్ తో పాటు ఫ్యామిలీపై విమర్శలు గుప్పించింది. హోస్ట్ నాగార్జున ఈ విషయాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి రెండో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

కొన్ని గేమ్స్ లో సంచాలక్స్ నిర్ణయాలు ఎలా ఉన్నాయి? అనేది కూడా హోస్ట్ నాగార్జున సమీక్షించనున్నారు. ఇక కీలక ప్రక్రియ నామినేషన్స్ లో ఉన్నవారిని ఓట్ల ఆధారంగా ఒక్కొక్కరినీ సేవ్ చేస్తాడు. అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేస్తాడు. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు? 

ఆసియా నెట్ తెలుగు పోల్ ప్రకారం విష్ణుప్రియ, నిఖిల్, నైనిక సేఫ్. వారికి అత్యధికంగా ఓట్లు పోల్ అయ్యాయి. మిగిలిన ఐదుగురిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. శేఖర్ బాషా హౌస్లో ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్నాడు. అతడు ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. అతడు నాలుగో స్థానంలో ఉన్నాడు. 

అనంతరం కిరాక్ సీతకు ఓట్లు పోల్ అయ్యాయి. ఆమె ఈ వారం ఎలిమినేట్ కాదని ఆసియానెట్ తెలుగు రీడర్స్ పోల్ లో తెలియజేశారు. నాగ మణికంఠకు ఆరో స్థానం దక్కింది . అతడు కూడా ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదని ఆడియన్స్ అభిప్రాయపడ్డారు.

ఇక డేంజర్ జోన్లో పృథ్విరాజ్, ఆదిత్య ఓం నిలిచారు. అనూహ్యంగా ఆదిత్య ఓం కంటే పృథ్విరాజ్ మెరుగైన ఓట్లు సంపాదించాడు. అంటే పృథ్విరాజ్ డేంజర్ జోన్లో ఉన్నప్పటికీ ఆదిత్య ఓం కంటే ముందంజలో ఉన్నాడు. ఆసియా నెట్ తెలుగు పోల్ లో తేలింది ఏంటంటే? ఈ వారం ఆదిత్య ఓం ఎలిమినేట్ అవుతాడు.


ఆదిత్య ఒకప్పటి హీరో. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన నటుడు. అతడు రెండో వారం ఎలిమినేట్ కావడం ఉహించని పరిణామం. అయితే ఆదిత్య ఓం కి తెలుగు పెద్దగా రాదు. నామినేషన్స్ లో అతడు తేలిపోతున్నాడు. పాయింట్స్ స్ట్రాంగ్ గా ఉండటం లేదు. గేమ్స్, ఇతర టాస్క్ లలో కూడా సత్తా చాటడం లేదు. అది ఆదిత్య ఓం కి మైనస్ కావచ్చు. 

Latest Videos

click me!