బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రెండు వారాలు పూర్తి చేసుకోనుంది. షో ఆశించిన స్థాయిలో లేదు. కంటెస్టెంట్స్ ఎంపిక కూడా సరిగా లేదు. విష్ణుప్రియ, ఆదిత్య ఓం తో పాటు ఒకరిద్దరు మాత్రమే తెలిసిన ముఖాలు. సీరియల్ నటులు యాష్మి గౌడ, పృథ్విరాజ్, నిఖిల్, ప్రేరణ అంత పాప్యులర్ కాదు. పైగా కన్నడ బ్యాచ్.
సీజన్ 8 గేమ్స్, టాస్క్స్ సైతం నిరాశ పరుస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు ఫస్ట్ వీక్ టీఆర్పీ దారుణంగా ఉందట. బేబక్క ఎలిమినేషన్ తో ఇంట్లో13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఎవరూ ప్రభావం చూపడం లేదు. ప్రేక్షకులు ఎంటర్టైన్ చేసే కంటెస్టెంట్స్ ని కోరుకుంటున్నారు.