శేఖర్ బాషా భార్య ఇటీవల ప్రసవించింది. కంటెస్టెంట్స్ శేఖర్ బాషాను ఇంటికి పంపడానికి ఇది కూడా ఒక కారణం. అతడికి అబ్బాయి పుట్టాడు. ఇక మూడో వారానికి గాను విష్ణుప్రియ, ప్రేరణ, నైనిక, యష్మి, నాగ మణికంఠ, అభయ్, పృథ్విరాజ్, సీత నామినేట్ అయ్యారు. సోమవారం నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి.
ఇక సోషల్ మీడియా సమాచారం ప్రకారం ఈసారి కూడా షాకింగ్ ఎలిమినేషన్ తప్పదని అంటున్నారు. టాప్ సెలెబ్ ఇంటిని వీడనున్నారట. విష్ణుప్రియ ఓటింగ్ లో ముందంజలో ఉందట. ఆమెకు అత్యధికంగా ఓట్లు పోల్ అవుతున్నాయట. గేమ్ సంగతి ఎలా ఉన్నా... విష్ణుప్రియకు ఉన్న పాపులారిటీ రీత్యా ఓట్లు పడుతున్నాయి.