లేటెస్ట్ ఓటింగ్ లో షాకింగ్ రిజల్ట్, డేంజర్ జోన్లో ఉంది ఎవరు?

First Published | Sep 17, 2024, 2:56 PM IST

 బిగ్ బాస్ తెలుగు 8లో మూడో వారానికి గానూ 8 మంది నామినేట్ అయ్యారు. టాప్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండగా ఓటింగ్ కీలకంగా మారింది. 
 

బిగ్ బాస్ సీజన్ 8 మూడో వారంలో అడుగుపెట్టింది. సెప్టెంబర్ 1న 14 మంది కంటెస్టెంట్స్ తో షో గ్రాండ్ గా లాంచ్ చేశారు. హౌస్ మేట్స్ లో పెద్దగా పేరున్న సెలెబ్రిటీలు లేని క్రమంలో ఒకింత ఆడియన్స్ నిరాశకు గురయ్యారు. 


ఫస్ట్ వీక్ సోషల్ మీడియా స్టార్ బేబక్క ఎలిమినేట్ అయ్యింది. సంచలనాలు చేస్తుంది అనుకుంటే ఫస్ట్ వీకే చాప చుట్టేసింది. ప్రేక్షకులు ఆమెకు హ్యాండ్ ఇచ్చారు. ఇక రెండో వారం అనూహ్యంగా శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యాడు. శేఖర్ బాషా ఎలిమినేషన్ ఊహించనిది. 

ఆదిత్య ఓం, శేఖర్ బాషాలలో ఒకరు ఇంటిని వీడాల్సి ఉండగా.. నిర్ణయం హౌస్ మేట్స్ చేతిలో పెట్టాడు నాగార్జున. మెజారిటీ కంటెస్టెంట్స్ శేఖర్ బాషా బయటకు వెళ్లాలని నిర్ణయించారు. శేఖర్ బాషా భార్య మగబిడ్డకు జన్మనిచ్చిందని నాగార్జున వెల్లడించారు. ఈ కారణంతో శేఖర్ బాషాను హౌస్ మేట్స్ ఎలిమినేట్ చేశారు. 


Vishnupriya Bhimeneni

శేఖర్ బాషా ఎలిమినేషన్ తో హౌస్లో 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో విష్ణుప్రియ, నాగ మణికంఠ, పృథ్వీరాజ్, నైనిక, సీత, యష్మి, అభయ్, ప్రేరణ నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఇంటిని వీడాల్సి ఉంది. సోమవారం నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. 

తాజా ట్రెండ్ ప్రకారం విష్ణుప్రియ టాప్ లో ఉందట. ఆమెకు 25 శాతానికి పైగా ఓట్లు నమోదు అయ్యాయట. అనూహ్యంగా రెండో స్థానంలో నాగ మణికంఠ ఉన్నాడట. బిగ్ బాస్ హౌస్ కి రాకముందు వరకు నాగ మణికంఠ ఎవరో తెలియదు. అయితే తన గేమ్ తో నాగ మణికంఠ ఆడియన్స్ లో ఫేమ్ రాబట్టాడు. సింపతీ గేమ్ అంటూ మొదట్లో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ నాగ మణికంఠకు ఆడియన్స్ బాగానే ఓట్లు వేస్తున్నారని తెలుస్తుంది.
 

విష్ణుప్రియ, నాగ మణికంఠల తర్వాత మూడో స్థానంలో సీరియల్ నటి ప్రేరణ ఉన్నారట. నాలుగో స్థానంలో యష్మి గౌడ ఉన్నారట. ఇక సోషల్ మీడియా స్టార్, నటి కిరాక్ సీత ఐదో స్థానంలో ఉందట. నైనిక ఆరోస్థానంలో, పృథ్విరాజ్ ఏడో స్థానంలో ఉన్నాడట. 

అందరి కంటే అభయ్ నవీన్ వెనుకంజలో ఉన్నాడట. ఆయనకు అతి తక్కువ ఓట్లు పోల్ అయ్యాయట. లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం చివరి మూడు స్థానాల్లో నైనిక, పృథ్విరాజ్, అభయ్ నవీన్ ఉన్నారు. అభయ్ నవీన్ పలు సినిమాలు, సిరీస్లలో నటించాడు. గేమ్ పరంగా అభయ్ ప్రభావం చూపడం లేదు. 
 

అభయ్ నవీన్ చీఫ్స్ లో ఒకడు. అతడు నామినేషన్స్ లో ఉండకూడదు. మరొక చీఫ్ నిఖిల్ తో అతడు పోటీ పడాల్సి వచ్చింది. ఇద్దరిలో ఒకరు నామినేట్ కావాలని బిగ్ బాస్ ఆదేశించాడు. నిఖిల్ తో చర్చించిన అభయ్... తాను నామినేట్ అవుతానని బిగ్ బాస్ కి చెప్పాడు. ఒక వేళ అతడు ఈ వారం ఎలిమినేట్ అయితే అతిపెద్ద తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు అవుతుంది. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి మూడో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

Latest Videos

click me!