తనకు కూడా క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురయ్యాయని కిరాక్ సీత ఓపెన్ అయ్యారు. ఒక మూవీ ఆఫర్ ఉంది. రూ. 25 లక్షలు ఇస్తారు.. కాకపోతే నిర్మాతను కలవడానికి ఫార్మ్ హౌస్ కి వెళ్లాలి. ఫారిన్ ట్రిప్ కి వెళ్ళాలి అన్నారు. కెరీర్ బిగినింగ్ లోనే ఇంత పెద్ద రెమ్యూనరేషన్ ఎందుకు ఇస్తున్నారు, అనే సందేహం కలిగింది.
తర్వాత నాకు విషయం అర్థమైంది. నాకు ఆఫర్ వద్దని చెప్పాను, అని కిరాక్ సీత అన్నారు. బేబీ మూవీ చూసి తాను కూడా ఏడ్చేసినట్లు కిరాక్ సీత వెల్లడించారు. అందుకు కారణం.. బేబీ మూవీ క్లైమాక్స్ ఏమిటో దర్శకుడు ఆమెకు చెప్పలేదట. ట్రాజిక్ ఎండింగ్ చూసి కిరాక్ సీత ఎమోషనల్ అయ్యిందట.