కంటెస్టెంట్ అర్జున్ కి ప్రజెంట్ వైఫ్ ప్రేమగా ఓ బహుమతి పంపింది. కానీ అది దక్కాలంటే యావర్ చేతుల్లోనే ఉంది. బిగ్ బాస్ పెట్టిన ఫిట్టింగ్ కి కంటెస్టెంట్స్ షాక్ అయ్యారు.
బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలేకి సిద్ధం అవుతుంది. శివాజీ, అమర్, పల్లవి ప్రశాంత్, ప్రియాంక, అర్జున్, యావర్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు. వీరిలో ఒకరు విన్నర్ కానున్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండొచ్చు. అర్జున్, యావర్ లలో ఒకరు వెళ్లిపోయే అవకాశం ఉంది.
26
Bigg Boss Telugu 7
లేదంటే ఆరుగురు ఫైనల్ కి వెళతారు. హౌస్లో గొడవలు తగ్గాయి. అందరూ ప్రశాంతంగా ఉంటున్నారు. అనూహ్యంగా ప్రియాంక-ప్రశాంత్ మధ్య స్నేహం పెరిగింది. ఇదిలా ఉంటే కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. మీరు ఇంటి సభ్యులతో పాటు ఇంటి ఫుడ్ కూడా మిస్ అవుతున్నారు. మీ ప్రియమైన వారు పంపిన ఫుడ్ మీకు అందుతుంది అన్నాడు.
36
Bigg Boss Telugu 7
అయితే ఒక ఫిట్టింగ్ పెట్టాడు. ఒక కంటెస్టెంట్ కి కుటుంబ సభ్యులు పంపిన ఫుడ్ దక్కాలంటే మరొక కంటెస్టెంట్ బిగ్ బాస్ చెప్పిన గేమ్ ఆడి గెలవాల్సి ఉంటుంది. అర్జున్ కి తన ప్రెగ్నెంట్ వైఫ్ సురేఖ ఇష్టమైన ఆహారం పంపింది. ప్రేమతో భార్య పంపిన ఆ ఫుడ్ తినాలని అర్జున్ ఆశపడ్డాడు.
46
Bigg Boss Telugu 7
అయితే ఆ ఫుడ్ దక్కాలంటే యావర్ 'స్వింగ్ బేబీ స్వింగ్' టాస్క్ గెలవాల్సి ఉంది. అవిక్షన్ పాస్ టాస్స్ లలో ఒకటైన ఈ టాస్క్ ని బిగ్ బాస్ మరలా తెరపైకి తెచ్చాడు. గతంలో ఈ టాస్క్ లో అర్జున్, యావర్ పోటీపడ్డారు. యావర్ గెలిచాడు. అయితే అతడు ఫౌల్ గేమ్ ఆడినట్లు తర్వాత తేలింది.
56
Bigg Boss Telugu 7
ఇదే గేమ్ ఆడి యావర్ గెలిస్తే అర్జున్ కి భార్య పంపిన ఫుడ్ దక్కుతుంది. జాగ్రత్తగా ఆడిన యావర్ టాస్క్ లో గెలిచి అర్జున్ కి ఫుడ్ చేరేలా చేశాడు. దాంతో అర్జున్ ఆనందం వ్యక్తం చేశాడు. అమర్ కి వచ్చిన ఫుడ్ కోసం ప్రియాంక పోటీ పడి గెలిచింది. ఆమె బాణం మీద బాల్స్ బాలన్స్ చేసే టాస్క్ ఆడింది.
66
Bigg Boss Telugu 7
శివాజీ బెలూన్స్ ని పగలగొట్టే టాస్క్ ఆడాడు. మొత్తంగా ఇంటి సభ్యులు చివరి వారం తమ సొంతింటి ఆహారం ఎంజాయ్ చేసే ఛాన్స్ దక్కింది. మరోవైపు టైటిల్ విన్నర్ ఎవరనే ఉత్కంఠ నడుస్తుంది. శివాజీ, అమర్, పల్లవి ప్రశాంత్ మధ్యే టైటిల్ పోరు నడుస్తుందని తెలుస్తుంది.