BrahmaMudi 14th december Episode:స్వప్న పై రుద్రాణి కుట్ర, గుడిలో శ్వేతతో రాజ్, చూసేసిన అపర్ణ

Published : Dec 14, 2023, 10:29 AM IST

అందరి కాపురం బాగుందని, ఈ ఒక్కరోజు ఉపవాసం చేస్తే, ఆ దేవుడు మనల్ని కలిపేవాడు అని బాధపడుతుంది. ఆ దేడు కూడా మనల్ని కలపలేడు అని చెప్పి. హ్యాపీగా పండ్లు తినేస్తాడు రాజ్. కావ్య మాత్రం.. మనల్ని కలిపేవరకు ఆ దేవుడిని కూడా వదిలిపెట్టను అని చెప్పేస్తుంది.  

PREV
17
BrahmaMudi 14th december Episode:స్వప్న పై  రుద్రాణి కుట్ర, గుడిలో శ్వేతతో రాజ్, చూసేసిన అపర్ణ
Brahmamudi


BrahmaMudi 14th december Episode: కార్తీక పౌర్ణమి సందర్భంగా కావ్య ఇంట్లో పూజ చేస్తూ ఉంటుంది. దుగ్గిరాల కుటుంబ సభ్యులంతా  దేవుడికి నమస్కారం పెట్టుకుంటూ ఉంటారు. తర్వాత కావ్య అందరికీ హారతి ఇస్తుంది. పూజ పూర్తైంది కాబట్టి.. అప్పటి నుంచి.. సాయంత్రం దీపాలు వెలిగించే వరకు అందరూ ఉపవాసం ఉండాలని ఇందిరాదేవి చెబుతుంది. అయితే, ఇంట్లో మగవాళ్లు మాత్రం.. తమకు ఎందుకు ఉపవాసం, కష్టమని చెబుతారు. వెంటనే రాజ్ ని కావ్య ఇరికించేస్తుంది. రాజ్ ఉపవాసం ఉంటానని మాట ఇచ్చాడని అందరి ముందు కమిట్ చేసేస్తుంది.అపర్ణ, రుద్రాణి తప్ప.. ఇంట్లోవారు అందరూ సంతోషపడతారు. అందరి ముందు కావ్య చెప్పింది.. అబద్ధం అని నిరూపించలేక తిప్పలు పడుతూ ఉంటాడు. లోపల మాత్రం తిట్టుకుంటూ ఉంటాడు. 

27
Brahmamudi

వాళ్ల నాన్న, బాబాయ్ తినడానికి వెళ్తే.. రాజ్ తినకుండా వెళ్లలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. కడుపులో కలుతుంటే.. కావ్యను మనసులో పిచ్చి పిచ్చిగా తిట్టుకుంటాడు. ఓ పక్కన వాళ్ల నాన్న, బాబాయ్ టిఫన్ చేస్తూ.. పెసరట్టు చాలా రుచిగా ఉందని, రాజ్ ని కూడా తినడానికి రమ్మని చెబుతారు.  రాజ్ వెళ్లాలి అనుకున్నా కూడా ..కావ్య ఓవర్ డైలాగులు కొడుతూ, వెళ్లనివ్వదు. చేసేది లేక.. తానే ఉపవాసం ఉండాలని అనుకున్నాను అని అందరి ముందు చెప్పేస్తాడు. పాపం అపర్ణ మాత్రం ముఖం మాడ్చుకుంటుంది. తర్వాత స్వప్నను తినమని చెబుతారు. నేను కూడా ఉపవాసం ఉన్నాను అని స్వప్న చెబుతుంది. కానీ, కడుపుతో ఉన్నవారు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పగానే.. ఆనందంతో వెళ్లి, కమ్మగా టిఫిన్ ఆరగిస్తుంది.

37
Brahmamudi


సీన్ కట్ చేస్తే, రాజ్ గదిలో ఓ మూల దుప్పటి కప్పుకొని అరటిపండ్లు తింటూ ఉంటాడు. ఆ తొక్క కింద పడేయడంతో కావ్య చూసేస్తుంది. మెల్లగా వెళ్లి, ఆ దుప్పటి తీసేస్తుంది. తర్వాత, ఉపవాసంలో ఎందుకు తింటున్నారు అని అడుగుతుంది. అయితే, తాను ఉపవాసం చేయాలని అనుకోలేదని, నువ్వే బలవంతంగా చేపించాలని అనుకున్నావ్ అని సీరియస్ అవుతాడు. అయితే, అందరి కాపురం బాగుందని, ఈ ఒక్కరోజు ఉపవాసం చేస్తే, ఆ దేవుడు మనల్ని కలిపేవాడు అని బాధపడుతుంది. ఆ దేడు కూడా మనల్ని కలపలేడు అని చెప్పి. హ్యాపీగా పండ్లు తినేస్తాడు రాజ్. కావ్య మాత్రం.. మనల్ని కలిపేవరకు ఆ దేవుడిని కూడా వదిలిపెట్టను అని చెప్పేస్తుంది.

47
Brahmamudi

ఇక, రాహుల్, రుద్రాణిలు మళ్లీ స్వప్నను ఎలా వదిలించుకోవాలా అని ప్లాన్ వేస్తూ ఉంటారు. స్వప్న చేసే ఓవర్  యాక్షన్ చూస్తుంటే చాలా చిరాకుగా ఉంది అని రాహుల్ అంటాడు. ‘ ఈ చిరాకు స్వప్నను తల్లి చేయడానికి ముందు ఉండాల్సింది. చేయాల్సిందంతా చేసి, ఇప్పుడు చిరాకుగా ఉంది అంటే ఎలా? అది తల్లికాకపోయి ఉంటే, ఈ పాటికి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయి ఉండేది. ఇప్పుడు నేను కూడా ఏం చేయలేను. డీఎన్ఏ టెస్టు చేసేవరకు ఆగాల్సిందే.’ అని రుద్రాణి బదులిస్తుంది. కానీ రాహుల్ మాత్రం.. ‘ అలా అనకు మమ్మీ, ఏదో ఒక ఉపాయం ఉంటుంది ఆలోచించు ప్లీజ్ ’ అంటాడు. దీంతో.. రుద్రాణి కాసేపు ఆలోచించి ఓ ఐడియా ఇస్తుంది. ‘ అందరూ  వెళ్తున్న గుడికి అరుణ్ ని రమ్మని చెప్పు. ఫ్యామిలీలో అందరికీ కాకుండా కేవలం స్వప్నకు మాత్రమే కనపడేలా చూడు. అప్పుడు స్వప్న వాడిని పట్టుకుంటే తనపై పడిన నింద పోతుందని, వాడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. అలా వెళ్తూ, వెళ్తూ, స్వప్న కిందపడేలా చేసి, మిస్ క్యారేజ్ అయ్యేలా చేద్దాం’అని చెబుతుంది. ‘ ప్లాన్ అదిరింది మామ్, ఇదే చేద్దాం’ అని రాహుల్ అంటాడు. ‘ ఈ ప్లాన్ మాత్రం ప్లాప్ అయితే, నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను. జాగ్రత్తగా చెయ్యి’ అని రుద్రాణి కొడుక్కి వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడే వెళ్లి, అరుణ్ ని గుడికి రమ్మని చెబుతా అని రాహుల్ అంటాడు.

57
Brahmamudi

ఇక, రాజ్ అన్ని పండ్లు తిన్నా కూడా ఇంకా ఆకలితో తిప్పలు పడుతూ ఉంటాడు. ఆలోగా శ్వేత ఫోన్ చేస్తుంది. కలుద్దాం అన్నావ్.. ఫోన్ చేయలేదు అని అడుగుతుంది. గుడికి వెళ్తున్నాం అని చెబుతాడు. తాను కూడా నేను గుడికి వస్తాను అని చెబుతుంది. వద్దు అని రాజ్ చెప్పినా వినకుండా, గుడిలో కలుసుకుదాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అందరి ముందు శ్వేతను కలవడం ఎలా అని రాజ్ కంగారుపడుతూ ఉంటాడు.

ఇక, దుగ్గిరాల కుటుంబం మొత్తం గుడికి వెళతారు. వాళ్లు అలా గుడికి వెళ్లగానే అనామిక ఫ్యామిలీ కూడా వచ్చేస్తుంది.  ఏంటి విశేషం అని అడిగితే.. అనామిక ఉపవాసం ఉందని, దీపాలు వెలిగించడానికి వచ్చాం అని చెబుతారు. ఈ గుడికే ఎందుకు వచ్చారు అని కావ్య, స్వప్న, రాజ్ లు కాసేపు కళ్యాణ్ ని ఏడిపిస్తారు. వీళ్లు నవ్వుకుంటూ ఉంటారు.

67
Brahmamudi

ఆలోగా.. అటు నుంచి అప్పూ, మూర్తి వస్తూ ఉంటారు. కావ్య, కనకం చూసి సంతోషిస్తారు. కావ్య సంతోషంగా వాళ్ల నాన్న అంటూ దగ్గరకు వెళ్తుంది. అయితే, అప్పూ రావడం అనామిక పేరెంట్స్ కి నచ్చదు. అప్పూ అడ్డు తొలగిస్తానని అనామిక తల్లి అంటుంది. ఈలోగా కళ్యాణ్ వెళ్లి అప్పూని పలకరించాలని చూస్తే, అనామిక వెళ్లి అడ్డుపడుతుంది. అది చూసి అప్పూ బాధపడుతుంది.

77
Brahmamudi

ఇక, అందరూ వెళ్లి దర్శనం చేసుకుందామని అపర్ణ అంటుంది. అయితే రాజ్.. మీరు వెళ్లండి.. కళావతి రాదు అని చెబుతాడు. ఎందుకు అంటే, కళ్యాన్ పెళ్లి కోసం  ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకుందని చెబుతాడు. అది విని కావ్య కూడా షాకౌతుంది. తనను ఉపవాసం దగ్గర ఇరికించిందని, ఇలా 108 ప్రదక్షిణలు మొక్కు చెప్పి ఇరికిస్తాడు. బలవంతంగా కావ్యను ప్రదక్షిణలకు తీసుకొని వెళతాడు. 

మరోవైపు కొందరు అమ్మాయిలు గుడిలో తమ కోరికను నెరవేర్చుకోవడానికి కాయిన్ నిలపెడుతుంటారు. అది చూసి అనామిక అడుగుతుంది. వెంటనే అనామిక, స్వప్న అక్కడికి వెళతారు. కనకం అప్పూని కూడా నిలపెట్టమని చెబుతూ ఉంటుంది. ఈలోగా అందరూ గుడిలోకి వెళ్లిపోతారు. అరుణ్ ఇంకా రాలేదేంటని  రుద్రాణి అడుగుతుంది. వస్తున్నాడు అని  రాహుల్ చెబుతాడు. ఈలోగా రాహుల్ అరుణ్ కి ఫోన్ చేసి స్వప్నకు మాత్రమే కనపడు అని చెబుతాడు.

కమింగప్ లో రాజ్ తో శ్వేత క్లోజ్ గా ఉండటం అపర్ణ కంట పడుతుంది. మరోవైపు కావ్య కూడా  రాజ్ కోసం వెతుకుతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.
 

click me!

Recommended Stories