Abijeet: పెళ్లి, సినిమాలు వదిలేసి దేశ సంచారిగా మారిపోయిన బిగ్ బాస్ అభిజీత్... విస్మయపరిచే కారణాలు!

Published : Nov 26, 2023, 03:39 PM ISTUpdated : Nov 26, 2023, 03:44 PM IST

బిగ్ బాస్ అభిజీత్ దేశ సంచారిగా మారిపోయాడు. ఫ్యామిలీ, కెరీర్ పక్కన పెట్టి ప్రాంతాలు చుట్టేస్తున్నాడు. సహస యాత్రలు చేస్తున్నాడు. దీనికి వెనుక పెద్ద కారణమే ఉందట.   

PREV
19
Abijeet: పెళ్లి, సినిమాలు వదిలేసి దేశ సంచారిగా మారిపోయిన బిగ్ బాస్ అభిజీత్... విస్మయపరిచే కారణాలు!
Bigg Boss Abijeet

దర్శకుడు శేఖర్ కమ్ముల సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసిన హీరోల్లో అభిజీత్ ఒకడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో అభిజీత్ హీరో అయ్యాడు. ఇద్దరు ముగ్గురు హీరోలు ఉండే ఆ సినిమాలో అభిజీత్ మెయిన్ లీడ్ చేశాడు. హ్యాపీ డేస్ అనంతరం ఎడ్జ్ జానర్లో వచ్చిన మూవీ కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. 

 

29

అయితే హ్యాపీ డేస్ స్థాయిలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఆడలేదు. యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అనంతరం రామ్ లీల, మిర్చిలాంటి కుర్రోడు చిత్రాల్లో అభిజీత్ హీరోగా నటించారు. అవేమీ ఆడలేదు. బ్రేక్ తీసుకున్న అభిజీత్ 2020లో బిగ్ బాస్ హౌస్లో ప్రత్యక్షం అయ్యాడు. 
 

39

టాప్ సెలెబ్ గా టైటిల్ ఫేవరేట్ హోదాలో హౌస్లో కొనసాగాడు. అభిజీత్ లవ్ ట్రాక్స్ కూడా నడిపాడు. మోనాల్ పట్ల ఇష్టం పెంచుకున్న అభిజీత్ గట్టిగా ట్రై చేశాడు. కానీ ఆమె అఖిల్ సార్థక్ కి కనెక్ట్ అయ్యింది. దాంతో ఆమె మీద ఆశలు వదులుకున్నాడు. 
 

49

మైండ్ గేమ్ ఆడుతూ ఆడియన్స్ లో ఫేమ్ రాబట్టాడు. మోనాల్ దూరమయ్యాక అభిజీత్ మరో లేడీ కంటెస్టెంట్ అలేఖ్య హారికకు దగ్గరయ్యాడు. అలేఖ్యకు అభిజీత్ అంటే చాలా ఇష్టం. దాంతో ఇద్దరికీ జత కుదిరింది. వీరిద్దరికి కామన్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేశారు.

59
Bigg Boss Abijeet

హౌస్లో అభిజీత్-హారిక లవర్స్ గా రొమాన్స్ చేశారు. బయట వారి పేరెంట్స్ కలిసి ఇంటర్వ్యూలు ఇచ్చారు. షో ముగిశాక వాళ్ళు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేస్తామంటూ కామెంట్స్ చేశారు. ఫైనల్ లో అఖిల్ సార్థక్-అభిజీత్ మధ్య టైటిల్ పోరు నడిచింది. అభిజీత్ విన్నర్ కాగా.. అఖిల్ సార్థక్ రన్నర్ గా మిగిలాడు. 
 

69
Bigg Boss Abijeet


హౌస్ నుండి టైటిల్ తో బయటకు వచ్చిన అభిజీత్ హారికను చెల్లి అనేశాడు. దాంతో ఆమె హర్ట్ అయ్యింది. అభిజీత్ ని మరలా కలవలేదు. బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ గా అభిజీత్ కి ఆఫర్స్ వస్తాయని అందరూ భావించారు. అలా ఏం జరగలేదు. అభిజీత్ ఫేట్ మారలేదు. 
 

79
Bigg Boss Abijeet


మోడరన్ లవ్ ఆఫ్ హైదరాబాద్ అనే ఆంథాలజీ సిరీస్లో అభిజీత్ నటించాడు. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ ఆయన చేయలేదు. కాగా గత మూడేళ్ళుగా అభిజీత్ ట్రావెలర్ గా మారిపోయాడు. స్వదేశం, విదేశం అని తేడా లేకుండా అన్ని ప్రాంతాలు తిరిగేస్తున్నాడు. 
 

89

లాంగ్ బైక్ రైడ్స్ కి వెళుతున్నాడు. సాహసయాత్రలు చేస్తున్నాడు. వ్యవసాయం పట్ల కూడా ఆసక్తి చూపుతున్నాడు. ఇకపై నటించకూడదు, పెళ్లి చేసుకోకూడదని అభిజీత్ నిర్ణయించుకున్నాడని సమాచారం. జీవింతాంతం ఇలా నచ్చిన ప్రదేశాలను సందర్శిస్తూ ప్రకృతిలో జీవనం గడిపేయాలి అనుకుంటున్నాడట. 


 

99

అభిజీత్ ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణాలు ఉన్నాయట. అభిజీత్ కి అనారోగ్య సమస్యలు ఉన్నాయట. అందుకే అభిజీత్ ప్రశాంత జీవనం కోరుకుంటున్నాడట. ఒత్తిడి లేకుండా నచ్చినట్లు బ్రతకాలి అనుకుంటున్నాడట. ఆర్థికంగా సెటిల్డ్ ఫ్యామిలీ కావడంతో అభిజీత్  స్వేచ్ఛా జీవితం గడుపుతున్నాడని సమాచారం. 

 

Bigg Boss Telugu 7: గ్రూప్ రాజకీయాలతో నన్ను ఏకాకిని చేశారు... పోతూ పోతూ బాంబు పేల్చిన అశ్విని!

Read more Photos on
click me!

Recommended Stories