Bigg Boss Telugu 7
బిగ్ బాస్ హౌస్లో టాప్ 8 ఉన్నారు. 12వ వారం రతిక రోజ్, అశ్విని శ్రీ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. కాగా హౌస్లో టికెట్ టు ఫినాలే టాస్క్ కి రంగం సిద్ధమైంది. 8 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లలో పోటీపడి గెలవాలి. ఎక్కువ టాస్క్ లలో గెలిచి పాయింట్స్ సంపాదించిన వాళ్లకు టికెట్ టు ఫినాలే దక్కుతుంది.
Bigg Boss Telugu 7
టికెట్ టు ఫినాలే గెలిచిన కంటెస్టెంట్ నేరుగా ఫైనల్ కి వెళతాడు. బిగ్ బాస్ సీజన్ 7 మొదటి ఫైనలిస్ట్ అవుతారు. అయితే ఈ వారం నామినేషన్స్ లో ఉండి ఎలిమినేట్ అయితే మాత్రం ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ ఉండదు. ఒక వేళ నామినేషన్స్ లో ఉండి సేవ్ అయితే నెక్స్ట్ రెండు వారాలు ఆ కంటెస్టెంట్ నామినేషన్స్ నుండి మినహాయింపు పొందుతారు.
Bigg Boss Telugu 7
మొదటి టాస్క్ లో అర్జున్ గెలిచినట్లు సమాచారం. ప్రియాంక, అర్జున్ చివరి వరకు పోరాడారు. చివరికి అర్జున్ కి విజయం దక్కిందట. మిగతా టాస్క్ లలో ప్రశాంత్ కూడా సత్తా చాటాడట. శివాజీ, శోభ మాత్రం అందరి కంటే తక్కువ పాయింట్స్ తో రేసు నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. టికెట్ టు ఫినాలే గెలుచుకునే ఛాన్స్ వీళ్ళకు లేదంటున్నారు.
Bigg Boss Telugu 7
అర్జున్, ప్రశాంత్ ఎక్కువ పాయింట్స్ తో ముందంజలో ఉన్నారని సమాచారం. మరి వీరిద్దరిలో ఎవరికి టికెట్ టు ఫినాలే దక్కుతుందో చూడాలి. ఉల్టా ఫల్టా షో కాబట్టి చివరి వరకు ఏం జరుగుతుందో చెప్పలేం. గేమ్స్ లో గెలిచినా బిగ్ బాస్ నిర్ణయాల కారణంగా ఫలితాలు మారిపోతాయి.