ఫినాలేకి ముందు అమర్ కి షాక్... రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపేసిన నాగార్జున? 

Published : Dec 09, 2023, 05:19 PM ISTUpdated : Dec 09, 2023, 05:27 PM IST

 ఫినాలే సమీపిస్తుండగా అమర్ దీప్ గేమ్ వరస్ట్ గా మారింది. సహనం కోల్పోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు. పల్లవి ప్రశాంత్ తో అమర్ దీప్ వ్యవహరించిన తీరు విమర్శలపాలు కావడంతో అతడికి నాగార్జున రెడ్ కార్డు ఇచ్చారంటూ ప్రచారం జరుగుతుంది.   

PREV
17
ఫినాలేకి ముందు అమర్ కి షాక్... రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపేసిన నాగార్జున? 
Bigg Boss Telugu 7


బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ అన్ని రకాల పరీక్షలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని గేమ్ పై ఫోకస్ పెట్టినవాళ్ళే విన్నర్ అవుతారు. బిగ్ బాస్ పెట్టే టాస్క్స్, గేమ్స్ తోటి కంటెస్టెంట్స్ పై భిన్న ఎమోషన్స్ కలుగజేస్తాయి. కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెట్టేలా బిగ్ బాస్ ఆటలు ఉంటాయి. 

 

27
Bigg Boss Telugu 7

ఎదుటి కంటెస్టెంట్స్ ని కేవలం పోటీదారులుగా మాత్రమే చూడాలి. శత్రువులుగా భావించి వ్యక్తిగత దూషణలు చేసినా, ఫిజికల్ అటాక్ కి పాల్పడిన వాళ్లకు త్వరగానే బిగ్ బాస్ ఉద్వాసన పలుకుతారు. ప్రేక్షకుల్లో కూడా నెగిటివిటి పెరుగుతుంది. 
 

37
Bigg Boss Telugu 7

కాగా కంటెస్టెంట్ అమర్ దీప్ ప్రవర్తన అభిమానుల్లో కూడా వ్యతిరేకతకు కారణం అవుతుంది. ఓటింగ్ అప్పీల్ టాస్క్ లో అమర్ దీప్, ప్రశాంత్ ని ఓడించేందుకు దాడి చేశాడు. ప్రశాంత్ పై కోపంతో చేయి కొరికాడు. సంచాలక్ గా శోభకు ప్రశాంత్ కంప్లైంట్ చేశాడు. ఆమె పట్టించుకోలేదు. 
 

47
Bigg Boss Telugu 7

అంతటితో అమర్ ఆగలేదు. ప్రశాంత్ పై ఆవేశంతో ఊగిపోయాడు. పక్కనే ఉన్న వస్తువు తీసుకుని మీదకు విసరబోయాడు. బూతులు కూడా మాట్లాడాడు. నీది డబుల్ గేమ్, నిజ స్వరూపం భయటపెడతా అంటూ ఫైర్ అయ్యాడు. ప్రశాంత్ ని నెట్టుకుంటూ మెడికల్ రూమ్ వద్దకు 
తీసుకెళ్లాడు. 

57
Bigg Boss Telugu 7

ఆ సమయంలో అమర్ పిచ్చి పట్టినవాడిలా ప్రవర్తించాడు. అమర్ తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మొదటి నుండి ప్రశాంత్ అంటే గిట్టని అమర్ అతని మీద దాడికి దిగాడన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు. అమర్ కి హోస్ట్ నాగార్జున గట్టిగా బుద్ది చెప్పాలని ఆయన్ని ట్యాగ్ చేసి కామెంట్స్ పెడుతున్నారు.

67
Bigg Boss Telugu 7

ఈ క్రమంలో నాగార్జున అమర్ దీప్ కి గట్టిగా ఇచ్చాడని, ఏకంగా రెడ్ కార్డు ఇచ్చి ఎలిమినేట్ చేశాడనే టాక్ వినిపిస్తుంది. గతంలో సింగర్ రేవంత్ కి నాగార్జున ఎల్లో కార్డు ఇచ్చిన మరోసారి ఫిజికల్ గా అటాక్ చేస్తే ఎలిమినేట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. అమర్ దీప్ ని మాత్రం నేరుగా ఎలిమినేట్ చేశాడని అంటున్నారు.

77
Bigg Boss Telugu 7

పల్లవి ప్రశాంత్ కి అమర్ దీప్ తో సారీ చెప్పించాడట. అయితే అమర్ దీప్ ఎలిమినేట్ కాకుండా ఉండాలంటే ప్రశాంత్ చెప్పాలి. అతడు వద్దంటే నువ్వు ఎలిమినేట్ అయిపోతావని నాగార్జున చెప్పాడట. పల్లవి ప్రశాంత్ అమర్ దీప్ ని క్షమించి ఎలిమినేట్ చేయవద్దని చెప్పాడట. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

 

పల్లవి ప్రశాంత్ ని ఓడించేందుకు కుట్ర... ఓట్లు పడకుండా అలా చేస్తున్నారా?

click me!