పల్లవి ప్రశాంత్ ని ఓడించేందుకు కుట్ర... ఓట్లు పడకుండా అలా చేస్తున్నారా?

Published : Dec 09, 2023, 04:19 PM ISTUpdated : Dec 09, 2023, 04:41 PM IST

పల్లవి ప్రశాంత్ టైటిల్ రేసులో ఉన్నాడు. ఇతనికి శివాజీ, అమర్ దీప్ నుండి పోటీ ఎదురవుతుంది. అయితే రైతుబిడ్డను ఓడించేందుకు కుట్ర జరుగుతుందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది.   

PREV
16
పల్లవి ప్రశాంత్ ని ఓడించేందుకు కుట్ర... ఓట్లు పడకుండా అలా చేస్తున్నారా?
Bigg Boss Telugu 7

బిగ్ బాస్ తెలుగు 7 సెన్సేషన్ గా అవతరించాడు పల్లవి ప్రశాంత్. కామనర్ హోదాలో ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్లో అడుగుపెట్టాడు. పల్లవి ప్రశాంత్ నాలుగు వారాలు ఉంటే గొప్ప అనుకున్నారు. అలాంటిది తన ఆట తీరుతో టైటిల్ ఫెవరేట్ అయ్యాడు. 

 

26
Bigg Boss Telugu 7

పల్లవి ప్రశాంత్ కి విపరీతమైన అభిమాన గణం ఏర్పడింది.అది కేవలం తన ఆట తీరుతో సంపాదించుకున్నాడు. పల్లవి ప్రశాంత్ టాస్క్ లలో చిరుతలా పోరాడతాడు. అతడి వేగం ఇతరులు అందుకోలేరు. మైండ్ గేమ్స్ లో కూడా పల్లవి ప్రశాంత్ సత్తా చాటిన సందర్భాలు ఉన్నాయి. పల్లవి ప్రశాంత్ లో నచ్చే మరో లక్షణం మరొకరిపై ద్వేషం వ్యక్తం చేయడు. అందరినీ గౌరవిస్తాడు. 

36

పల్లవి ప్రశాంత్ టైటిల్ ఫేవరేట్ అనడానికి అనేక కారణాలు ఉన్నాయి. పలు అఛీవ్మెంట్స్ ఖాతాలో ఉన్నాయి. పల్లవి ప్రశాంత్ పవర్ అస్త్ర గెలిచాడు. ఈ సీజన్ మొదటి కెప్టెన్ అయ్యాడు. అవిక్షన్ పాస్ గెలిచాడు. ఇతర కంటెస్టెంట్స్ లో ఎవరికీ ఈ స్థాయి రికార్డు లేదు. 

46
Bigg Boss Telugu 7

ఫినాలే అస్త్ర రేసులో కూడా టాప్ 3 వరకు వెళ్ళాడు. చిన్న మిస్టేక్ తో రేసు నుండి తప్పుకున్నాడు. రైతుబిడ్డ అనే సింపథీతో గేమ్ ఆడుతున్నాడని విమర్శించిన వాళ్ళకు ప్రశాంత్ తన గేమ్ తో సమాధానం చెప్పాడు. 

 

56

ఇది కీలక సమయం. ఫినాలేకి 9 రోజుల సమయం మాత్రమే ఉంది. హౌస్లో ఉన్న 7 గురి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. టైటిల్ కోసం ఓటింగ్ జరుగుతుంది. కాగా అమర్, ప్రశాంత్, శివాజీ మధ్య టైటిల్ పోరు ఉంటుందని ప్రచారం జరుగుతుండగా... ప్రశాంత్ ని ఓడించే కుట్ర జరుగుతుందని ఓ వీడియో వైరల్ అవుతుంది. 

66
Bigg Boss Telugu 7

మిస్డ్ కాల్ ఓటింగ్ లో ప్రశాంత్ కి ఓట్లు పడకుండా చేస్తున్నారట. ప్రశాంత్ కి కేటాయించిన 8886676905 నెంబర్ సరిగా పనిచేయడం  లేదట. మిస్డ్ కాల్ రిజిస్టర్ అవడం లేదట. అమర్ దీప్ నెంబర్ 8886676901 మాత్రం అన్ని వేళలా పనిచేస్తుందట. ఈ వాదనలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. 

 

Bigg Boss Telugu 7: 14వ వారం ఓటింగ్ రిజల్ట్స్... ఆ టాప్ కంటెస్టెంట్స్ ఇద్దరూ ఇంటికి!

click me!

Recommended Stories