Bigg Boss Telugu 7: 14వ వారం ఓటింగ్ రిజల్ట్స్... ఆ టాప్ కంటెస్టెంట్స్ ఇద్దరూ ఇంటికి!

Published : Dec 09, 2023, 10:07 AM ISTUpdated : Dec 09, 2023, 11:26 AM IST

బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ డిసెంబర్ 17న ముగియనుంది. హౌస్లో 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఎలిమినేట్ అయ్యే ఇద్దరు కంటెస్టెంట్స్ పేర్లు తెరపైకి వచ్చాయి.   

PREV
17
Bigg Boss Telugu 7: 14వ వారం ఓటింగ్ రిజల్ట్స్... ఆ టాప్ కంటెస్టెంట్స్ ఇద్దరూ ఇంటికి!
Bigg Boss Telugu 7

బిగ్ బాస్ తెలుగు 7 ఆసక్తికరంగా సాగుతుంది. టాప్ కంటెస్టెంట్స్ మధ్య టైటిల్ పోరు రసవత్తరంగా ఉంది. 14 మంది సెలెబ్స్ తో షో మొదలు కాగా మరో 5 గురు కంటెస్టెంట్స్ ఐదు వారాల అనంతరం వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. మొత్తంగా 19 మంది కంటెస్టెంట్స్ ఈ సీజన్ లో పార్టిసిపేట్ చేశారు. 
 

27
Bigg Boss Telugu 7

కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని, శుభశ్రీ, నయని పావని, పూజ మూర్తి, సందీప్, తేజ, భోలే షావలి, రతిక రోజ్, అశ్విని, గౌతమ్ వరుసగా ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్లో శివాజీ, ప్రశాంత్, అమర్, యావర్, అర్జున్, శోభ, ప్రియాంక ఉన్నారు. వీరిలో అర్జున్ ఫినాలే అస్త్ర గెలిచి టాప్ 5లో చోటు దక్కించుకున్నాడు. 
 

37
Bigg Boss Telugu 7

మిగిలిన ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. చివరి రెండు వారాలకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయని బిగ్ బాస్ చెప్పారు. అంటే ఎలిమినేషన్ తో పాటు టైటిల్ కోసం ఓటింగ్ జరుగుతుంది. 14 వారానికి ఓటింగ్ లో వెనుకబడిన వారు ఎలిమినేట్ అవుతారని చెప్పడం జరిగింది. 
 

47
Bigg Boss Telugu 7

ఫైనల్ కి వెళ్ళేది ఐదుగురే కాబట్టి ఇద్దరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. ఆ ఇద్దరు ఎవరో ఇప్పుడు చూద్దాం. పలు మీడియా సంస్థల అనధికార పోల్స్ ప్రకారం ప్రశాంత్ టాప్ లో ఉన్నాడు. ప్రియాంక, శోభ చివరి స్థానాల్లో ఉన్నారు. ఈ ఆదివారం శోభ ఎలిమినేషన్ ఖాయం అని తెలుస్తుంది. 
 

57
Bigg Boss Telugu 7

శోభ మీద అత్యంత నెగిటివిటీ ఉంది. హౌస్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న శోభను స్టార్ మా కాపాడుకుంటూ వస్తుందనే వాదన ఉంది. శోభను కాపాడేందుకు పలువురు టాప్ కంటెస్టెంట్స్ ని బలి చేశారని సోషల్ మీడియా టాక్. షో చివర దశకు చేరుకోగా ఇక శోభను కాపాడే ఛాన్స్ లేదంటున్నారు.

67
Bigg Boss Telugu 7

అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ లో యావర్ వెళ్ళిపోతాడట. ఓటింగ్ లో ప్రియాంక కంటే యావర్ ముందున్నాడు. అయితే కనీసం ఒక్క లేడీ కంటెస్టెంట్ అయినా ఫైనల్ లో ఉండాలి. ఈ సమీకరణాల నేపథ్యంలో యావర్ ని ఎలిమినేట్ చేయనున్నారట. యావర్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా ఇంటిబాట పట్టనున్నాడట.

77
Bigg Boss Telugu 7

అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ లో యావర్ వెళ్ళిపోతాడట. ఓటింగ్ లో ప్రియాంక కంటే యావర్ ముందున్నాడు. అయితే కనీసం ఒక్క లేడీ కంటెస్టెంట్ అయినా ఫైనల్ లో ఉండాలి. ఈ సమీకరణాల నేపథ్యంలో యావర్ ని ఎలిమినేట్ చేయనున్నారట. యావర్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా ఇంటిబాట పట్టనున్నాడట.

 

Bigg Boss Telugu 7: శోభ వర్సెస్ శివాజీ... పీక్స్ చేరిన స్పై బ్యాచ్ స్పా బ్యాచ్ మధ్య గొడవలు!

click me!

Recommended Stories