అయితే విన్నర్ ప్రైజ్ మనీలో భారీ కోతలు ఉంటాయి. ప్రైజ్ మనీ రూపంలో ఓ వ్యక్తి గెల్చుకున్న మొత్తంపై భారీగా టాక్స్ వేస్తారు. అది లాటరీ కావచ్చు, రియాలిటీ షోలో గెలుచుకున్న మొత్తం కావచ్చు. టీడీఎస్ రూపం 31.2% చెల్లించాలి. జీఎస్టీతో పాటు ఇంకా ఎక్స్ట్రా ఛార్జులు ఉంటాయి. గతంలో బిగ్ బాస్ విన్నర్ రూ. 50 లక్షలు గెలుచుకుంటే టాక్స్ కటింగ్స్ పోను రూ. 37 లక్షలు చేతికి వచ్చేవి.