బిగ్ బాస్ సీజన్ 7 ఫినాలేకు మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. విజేతను ప్రకటించే చివరి ఎపిసోడ్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు. యంగ్ హీరోయిన్స్, ఎలిమినేటైన కంటెస్టెంట్స్ దుమ్మురేపే పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. ఇక కొత్త చిత్రాల ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, సుమ కనకాల, కళ్యాణ్ రామ్ వంటి స్టార్స్ సందడి చేయనున్నారు.