పరోక్షంగా కొందరు హీరోలు, పరిశ్రమ పెద్దల మీద కూడా శివాజీ ఆరోపణలు చేశాడు. శివాజీ నేచర్ కి ఆయన ఎక్కువ రోజులు ఉండరని చాలా మంది భావించారు. కానీ శివాజీ హౌస్లో తన అనుభవాన్ని అంతా ఉపయోగించాడు. సీరియల్ బ్యాచ్ అమర్, శోభ, ప్రియాంక కలిసి ఆడుతున్నారని గ్రహించి ప్రశాంత్, యావర్ లతో తన టీమ్ ఏర్పాటు చేసుకున్నాడు.