Bigg Boss Top 5: టాప్ 5 ఎవరో లీక్ చేసిన భోలే షావలి... రసవత్తరంగా టైటిల్ రేస్!

First Published | Nov 17, 2023, 12:09 PM IST

బిగ్ బాస్ తెలుగు 7 చివరి దశకు చేరుకుంది. మరో నాలుగు వారాల్లో షో ముగియనుంది. ఈ క్రమంలో ఎలిమినేటైన భోలే షావలి టాప్ 5 వీరే అంటూ కీలక కామెంట్స్ చేశాడు. 
 

Bigg Boss Telugu 7

బిగ్ బాస్ హౌస్లో టాప్ 10 ఉన్నారు. వీరిలో ఐదుగురు మాత్రమే ఫైనల్ కి వెళతారు. మిగతా ఐదుగురు ఎలిమినేట్ అవుతున్నారు. గత వారం భోలే షావలి ఎలిమినేట్ అయ్యాడు. 11వ వారానికి అశ్విని, అమర్, అర్జున్, గౌతమ్, రతిక, ప్రియాంక, శోభ, యావర్ నామినేట్ అయ్యారు. కెప్టెన్ శివాజీ, పల్లవి ప్రశాంత్ మాత్రమే ఎలిమినేషన్స్ లో లేరు. 

Bigg Boss Telugu 7

అవిక్షన్ పాస్ కోసం పోటీ జరుగుతుంది. అవిక్షన్ పాస్ అర్జున్ తేలుచుకున్నాడని అందరూ భావించారు. ట్విస్ట్ ఇస్తూ... టాప్ 5గా హౌస్ మేట్స్ తో నిర్ణయించబడిన యావర్, శివాజీ, ప్రశాంత్, ప్రియాంక, శోభలతో పోటీపడి గెలవాలని బిగ్ బాస్ చెప్పాడు. యావర్ తో పోటీపడి ఓడిపోయిన అర్జున్ అవిక్షన్ పాస్ కోల్పోయాడు. 


Bigg Boss Telugu 7

యావర్... పల్లవి ప్రశాంత్, శోభ మీద గెలిచి అవిక్షన్ రేసులో నిలిచాడు. ఫైనల్ లో ప్రియాంక, శివాజీలతో పోటీ పడి గెలిచాడు. అయితే గేమ్ ఫెయిర్ గా ఆడలేదంటూ సంచాలక్స్ డెసిషన్ పెండింగ్ లో పెట్టారు. శివాజీ, ప్రియాంక, యావర్ లలో ఒకరికి అవిక్షన్ పాస్ దక్కుతుంది. దీనితో ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకునే ఛాన్స్ ఉంది. 

Bigg Boss Telugu 7

కాగా ఎలిమినేటైన భోలే టాప్ 5 లో ఉండేది వీళ్లే అంటూ తన అంచనా చెప్పారు. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఫిజికల్ గా, మెంటల్ గా సత్తా చాటుతున్నాడు. అతడు ఖచ్చితంగా ఫైనల్ లో ఉంటాడు. శివాజీ కూడా ఫైనల్ కి వెళతాడు. యావర్ స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి అతడికి కూడా ఛాన్స్ ఉంది. అమర్ దీప్, ప్రియాంక ఫైనల్ లో ఉంటారు.. అని భోలే చెప్పుకొచ్చారు. 

భోలే హౌస్లో ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్నాడు. పాటలు పాడుతూ పిచ్చగా తన మార్క్ క్రియేట్ చేశాడు. సీరియల్ బ్యాచ్ భోలేని తీవ్రంగా టార్గెట్ చేశారు. ఈ క్రమంలో కొన్ని బూతు పదాలు మాట్లాడాడు. నాగార్జున భోలేకి వార్నింగ్ ఇచ్చాడు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన భోలే... ఐదు వారాలు హౌస్లో ఉన్నారు. 

యావర్ కి ఎవిక్షన్ పాస్ దక్కకుండా శోభా శెట్టి కుట్ర ?.. శివాజీ తీవ్ర అసహనం, డెసిషన్ పెండింగ్..

Latest Videos

click me!