GuppedanthaManasu 26th January Episode:రాజీవ్ కన్నింగ్ ప్లాన్ లో ఇరుక్కున్న చక్రపాణి, శైలేంద్రకు చెమటలు పట్టి

First Published | Jan 26, 2024, 8:33 AM IST

మీ మామ ఎక్కడ ఉన్నాడో తెలిస్తే.. ఆ రిషిగాడు ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది. అప్పుడు నేను వాడిని చంపేయవచ్చు... నాకు ప్రశాంతంగా  ఉంటుంది అని శైలేంద్ర ఫోన్ పెట్టేస్తాడు.

Guppedantha Manasu

GuppedanthaManasu 26th January Episode:వసుధార ఎలాగూ రిషిని తీసుకురాలేదని.. దానిని అవకాశంగా తీసుకొని.. కాలేజీలో అల్లర్లు సృష్టించవచ్చు అని శైలేంద్ర ప్లాన్ వేస్తాడు. అదే విషయాన్ని వెళ్లి వసుధారతోనూ చెబుతాడు. కానీ... వసు రివర్స్ లో షాకిస్తుంది. రిషి సర్ కాలేజీకి వస్తారని చెబుతుంది. ఇక తాను భయపడింది చాలని.. ఇప్పటికి గేమ్ ముగించేద్దాం అని అంటుంది. నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడేలా చేస్తాను అని వసుధార అంటుంది. సాక్ష్యాలు అన్నీ సంపాదించి.. వాటిని రిషి సర్ ముందు పెడతానని, ఇక తప్పించుకోలేవని, నీ చాప్టర్ క్లోజ్ కూడా వార్నింగ్ ఇస్తుంది. అక్కడి నుంచి  వసు వెళ్లిపోతుంది.

Guppedantha Manasu

వసుధార.. తన కంటితో తననే పొడిచింది అని శైలేంద్ర ఫీలౌతాడు. తర్వాత.. వెంటనే కాలేజీలో జరిగిన విషయం మొత్తం రాజీవ్ కి చెబుతాడు. నీ మరదలు నాకు చెమటలు పట్టిస్తోందని చెబుతాడు. దానికి రాజీవ్ నవ్వేసి.. అందానికి అందం, తెలివికి తెలివి ఉన్నాయి కాబట్టే... నేను నా మరదలికి దాసోహం అయ్యాను అని చెబుతాడు. అది సరే కానీ.. ముందు చక్రపాణిని పట్టుకో అని శైలేంద్ర చెబుతాడు. మీ మామ ఎక్కడ ఉన్నాడో తెలిస్తే.. ఆ రిషిగాడు ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది. అప్పుడు నేను వాడిని చంపేయవచ్చు... నాకు ప్రశాంతంగా  ఉంటుంది అని శైలేంద్ర ఫోన్ పెట్టేస్తాడు.


Guppedantha Manasu

సీన్ కట్ చేస్తే.. చక్రపాణి రిషి దగ్గర ఉంటాడు. రిషికి ఓ వైపు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అల్లుడుగారు ఎప్పుడు కోలుకుంటారా? తన కూతురి జీవితం  ఎప్పుడు మళ్లీ నార్మల్ అవుతుందో అని, ఇప్పటికే అల్లుడి గారి విషయంలో వసమ్మ టెన్షన్ పడుతోందని చక్రపాణి ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయానికి చక్రపాణికి వాళ్ల ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఎన్నిసార్లు కట్ చేసినా మళ్లీ చేస్తూనే ఉంటాడు. దీంతో.. ఈ సారి తప్పక చక్రపాణి లిఫ్ట్ చేస్తాడు.

Guppedantha Manasu

ఏంటి సంగతులు అంటే తన కూతురికి పెళ్లి కుదిరిందని,నువ్వు ఎక్కడ ఉన్నావో చెబితే శుభలేఖ తెచ్చి ఇస్తాను అని చెబుతాడు. అయితే... తాను ప్రస్తుతం వేరే పనిలో ఉన్నానని.. ఎక్కడ ఉన్నానో  చెప్పలేను అని చక్రపాణి అంటాడు. ఎన్నిసార్లు వాళ్ల ఫ్రెండ్ అడిగినా.. చక్రపాణి చెప్పడానికి ఇష్టపడడు. తన ఆశీస్సులు ఎప్పుడూ మీ కూతురికి ఉంటాయని, పెళ్లికి రాలేనని, తర్వాత వీలు చూసుకొని ఏదైనారోజు వస్తాను అని చెబుతాడు. అదే చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.

Guppedantha Manasu


అయితే... అతని తో ఫోన్ చేయించింది రాజీవ్. తుపాకీ గురి పెట్టి మరీ అలా రాజీవ్ మాట్లాడిస్తాడు. చక్రపాణి ఎక్కడ ఉన్నాడో చెప్పకపోతే నేనేం చేస్తాను అని  అతను అంటాడు. కానీ...  తాను వెళ్లి పోయిన తర్వాత.. నువ్వు మళ్లీ మా మామయ్యకు ఫోన్ చేసి నేను చేయించాను అని చెబితే.. చంపేస్తాను అని రాజీవ్ బెదిరిస్తాడు. అతను.. తాను ఈ విషయం ఎవరికీ చెప్పను అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.


ఇక.. చక్రపాణి ఎక్కడ ఉన్నాను అనే విషయం నీ బెస్ట్ ఫ్రెండ్ కి కూడా చెప్పలేదు అంటే. రిషి గురించి ఎవరికీ తెలియకూడదు అని అనుకుంటున్నావన్నమాట. జాగ్రత్త పడు.. ఎంత కాలం జాగ్రత్తపడతావో చూస్తాను., నిన్ను నేను కలిసే సమయం మరి కొద్ది రోజుల్లోనే ఉందని... అప్పుడు ఈ రాజీవ్ గాడి వీర ప్రతాపం ఏంటో చూపిస్తాను అని అనుకుంటాడు.

Guppedantha Manasu

ఇక, చక్రపాణి రిషి కోసం పండ్లు తీసుకొని వస్తాడు. అప్పుడే.. అతనికి వసుధార ఫోన్ చేస్తుంది.  సర్ ఎలా ఉన్నారు.. అని అడుగుతుంది. బాగానే ఉన్నారు అని చక్రపాణి అంటే.. సర్ కి జ్యూస్ తాగించి కాలేజీకి తీసుకురమ్మని చెబుతుంది. చక్రపాణి ఎందుకుమ్మా అని అడిగితే.. కాలేజీలో ఫెస్ట్ ఉందని..  సర్ వస్తే బాగుంటుందని చెబుతుంది.  ఒక్కసారి సర్ ని అందరికీ చూపిస్తే బాగుంటుందని వసుధార అంటుంది. శైలేంద్ర గురించి చక్రపాణి భయపడితే.. ఏమీ చెయ్యలేడని ధీమాగా మాట్లాడుతుంది.  కానీ.. చక్రపాణి నచ్చచెప్పాలని చూస్తాడు. కానీ.. వసు మాత్రం.. తాను చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెబుతుంది. దీంతో.. చక్రపాణి సరే అంటాడు.

Guppedantha Manasu

ఇక.. రిషిని తీసుకువస్తున్నావా అని మహేంద్ర, అనుపమ అడుగుతారు. అవునని.. ఆల్రెడీ నాన్నకు చెప్పాను అని అంటుంది. నిర్ణయం మార్చుకోమని అనుపమ, మహేంద్ర నచ్చచెప్పాలని చూస్తే.. లేదని.. సర్ రావాల్సిందే అంటుంది. తాను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానని.. కాలేజీ కోసం.. స్టూడెంట్స్ ఆనందం కోసం , ఫెస్ట్ విజయం చేయడానికి తీసుకుస్తాను అంటుంది. శైలేంద్రకు తెలిస్తే... రిషికి ప్రమాదమేమో అని అనుపమ అంటే... ఈ కాలేజీలో రిషిని తాకేవారు కూడా ఎవరూ లేరు అని అంటుంది. శైలేంద్ర కావాలనే మనల్ని భయపెట్టాలని చూస్తున్నాడని.. ఆ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని అంటుంది. 

మహేంద్ర.. వసు మాటలను మెచ్చుకకుంటాడు. ఆ బఫూన్ గాడికి మనం ఎందుకు భయపడాలి.. నా కొడుకు కాలేజీకి రావాలి  అని  మహేంద్ర కూడా అంటాడు. ఈ రోజు రిషి కాలేజీకి రావాలి.. కాలేజీ ఫెస్ట్ సక్సెస్ అవ్వాలి.. ఆ శైలేంద్ర దుర్మార్గాలకు పులిస్టాప్ పడాలి అని మహేంద్ర అంటాడు.

Guppedantha Manasu

ఇక.. దేవయాణి ఇంట్లో కూర్చొని  గులాబ్ జామూన్ చేతిలో పట్టుకొని తినాలని అనుకుంటుంది. మనం అనుకున్నది జరుగుతుంటే.. ఆనందం ఎక్కువగా ఉంటుందని.. ఈ స్వీట్ తినాల్సిందే అని సంబరపడిపోతూ ఉంటుంది. సరిగ్గా స్వీట్ నోట్లో పెట్టుకునే సమయానికి శైలేంద్ర ఫోన్ చేస్తాడు. శైలేంద్ర చెప్పేది వినకుండా.. దేవయాణి తన ఆనందం పంచుకుంటుంది..ఆ వసుధారకు చుక్కలు చూపించావా.. రిషి ప్లెక్సీలు పెట్టావ్ కదా అని మాట్లాడుతూనే ఉంటుంది. కానీ.. తమ ప్లాన్ రివర్స్ అయ్యిందని  శైలేంద్ర చెబుతాడు. వాళ్ల అమ్మని కూడా కాలేజీకి రమ్మని చెబుతాడు. రిషి వస్తున్నాడని చెబుతాడు.

Guppedantha Manasu

అప్పుడే..మహేంద్ర వచ్చి.. ఫోన్ తీసుకుంటాడు. ఏం మాట్లాడుతున్నారు వదినగారు అంటాడు. ఏం లేదు ఫెస్ట్ ఎలా జరుగుతుందో శైలేంద్ర చెబుతున్నాడు అని అంటుంది. ఇక మీరు మారరా.. అవే అబద్దాలు...  రిషి కాలేజీకి వస్తున్నాడు.. మీరు కూడా కాలేజీకి రావాలి అంటాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

కమింగ్ అప్ లోనూ ఇదే జరిగేలా ఉంది. చక్రపాణి ఇంకా బయలుదేరలేదు. వసు రమ్మని చెబుతూ ఉంటుంది. మినిస్టర్ గారు కూడా రిషి వచ్చాకే బహేమతులు ఇద్దాం అంటాడు. మరోవైపు శైలేంద్ర, రాజీవ్.. రిషిని ఎలా పట్టుకోవాలా అని చూస్తూ ఉంటారు.  రిషి ని చూపించకుండా.. రిషి పేరు చెప్పి.. ఎపిసోడ్ ల మీద ఎపిసోడ్ లు లాగించేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా చేస్తారో చూడాలి.
 

Latest Videos

click me!