Bigg Boss Telugu 7
బిగ్ బాస్ తెలుగు 7 ముగింపు దశకు చేరుకుంది. 11వ వారం నడుస్తోంది. గత ఆదివారం భోలే ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఈ వారానికి అమర్ దీప్, అర్జున్, అశ్విని, గౌతమ్, ప్రియాంక, శోభ, యావర్, రతిక నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.
Bigg Boss Telugu 7
11వ వారం హౌస్లో అవిక్షన్ పాస్ కోసం పోటీ మొదలైంది. ఈ పాస్ గెలుచుకున్న సభ్యుడు ఎలిమినేషన్ నుండి తనను తాను సేవ్ చేసుకోవచ్చు. లేదా తనకు నచ్చిన కంటెస్టెంట్ కోసం వాడొచ్చు. సీజన్ 7 అవిక్షన్ పాస్ వలన దక్కే ప్రయోజనాలు ఏమిటో ఇంకా పూర్తి చెప్పలేదు.
Bigg Boss Telugu 7
1 నుండి 10 వరకు నెంబర్స్ కలిగిన బోర్డులు గార్డెన్ ఏరియాలో ఉంచిన బిగ్ బాస్ ఎవరిది ఏ ర్యాంక్ అని భావిస్తున్నారో చెప్పాలి అన్నారు. అందరూ టాప్ ఫైవ్ కోసం పోటీపడ్డారు. అయితే మెజారిటీ సభ్యుల నిర్ణయం మేరకే ఆ ర్యాంక్స్ దక్కుతాయి. శివాజీ, యావర్, ప్రశాంత్, ప్రియాంక, శోభలకు వరుసగా టాప్ ఫైవ్ ర్యాంక్స్ దక్కాయి.
Bigg Boss Telugu 7
అమర్, అర్జున్, గౌతమ్, అశ్విని, రతిక వరుసగా బాటమ్ ఫైవ్ ర్యాంక్స్ లో నిల్చున్నారు. అయితే బిగ్ బాస్ బాటమ్ 5 లో ఉన్న కంటెస్టెంట్స్ కి అవిక్షన్ పాస్ దక్కుతుందని ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో అర్జున్, అమర్, గౌతమ్, రతిక, అశ్విని అవిక్షన్ పాస్ కోసం పోటీపడ్డారు. అర్జున్ గెలిచిన నేపథ్యంలో అతడికి అవిక్షన్ పాస్ దక్కింది.
Bigg Boss Telugu 7
కాగా బిగ్ బాస్ మరో మెలిక పెట్టాడు. టాప్ ఫైవ్ లో ఉన్న శివాజీ, యావర్, ప్రశాంత్, ప్రియాంక, శోభలతో పోటీపడి గెలుచుకోవాలని మరో మెలిక పెట్టారు. దీనిలో భాగంగా యావర్ తో ఓ గేమ్ లో పోటీపడ్డారు అర్జున్. అటూ ఇటూ ఊగుతూ ఉండే బోర్డు అంచున చుట్టూ ఉన్న రాడ్స్ మీద బాల్స్ పడిపోకుండా అమర్చాలి.