Published : Dec 26, 2023, 06:55 AM ISTUpdated : Dec 26, 2023, 07:54 AM IST
బిగ్ బాస్ రియాలిటీ షో విపరీతమైన పాపులారిటీ కలిగి ఉంది. అదే సమయంలో వివాదాలకు కేంద్ర బిందువు అవుతుంది. సీజన్ 7 గ్రాండ్ ఫినాలే రోజు అల్లర్లు చోటు చేసుకున్న నేపథ్యంలో కీలక మార్పులు జరగనున్నాయట.
బిగ్ బాస్ సీజన్ 7 భారీ సక్సెస్. అద్భుతమైన టీఆర్పీ రాబట్టింది. అయితే మేకర్స్ ఆనందాన్ని వివాదాలు ఆవిరి చేశాయి. బిగ్ బాస్ ఏ స్థాయిలో విజయం సాధించిందో... అదే స్థాయిలో వివాదాలు చుట్టుముట్టాయి. టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కావడం, ఆ షో రెప్యుటేషన్ దెబ్బ తీసింది. ఈ షో రద్దు చేయాలన్న వాదనలకు బలం చేకూర్చింది.
26
Bigg Boss Telugu Season 7
పోలీసులు ఆంక్షలు పట్టించుకోకుండా ర్యాలీ చేసిన పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడు. అతనికి కోర్ట్ రిమాండ్ విధించింది. అనంతరం బెయిల్ పై విడుదలయ్యాడు. అలాగే పల్లవి ప్రశాంత్ అభిమానులు అల్లర్లకు పాల్పడ్డారు. ఇతర కంటెస్టెంట్స్ వాహనాల మీద దాడి చేశారు. పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీ నాశనం చేశారు.
36
Bigg Boss Telugu 7
అన్నపూర్ట స్టూడియో ఎదుట అల్లర్లకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు గుర్తిస్తున్నారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఇంకా నిందితులను గుర్తిస్తున్నారు. మరికొందరు అరెస్టు అయ్యే అవకాశం ఉంది. ఈ ఘటన నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహకులు కఠిన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.
46
Bigg Boss Telugu 7
ఇకపై బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎలాంటి ర్యాలీలు నిర్వహించకుండా ముందే అగ్రిమెంట్ చేసుకోనున్నారట. కంటెస్టెంట్స్ గా ఎంపికైన వారికి ఈ మేరకు గట్టి సూచనలు ఇవ్వనున్నారట. ఎలిమినేటైన కంటెస్టెంట్స్, విన్నర్, ఫైనలిస్ట్స్ ఎవరూ ర్యాలీలు నిర్వహించడం, అభిమానులను అన్నపూర్ణ స్టూడియో వద్ద కలవడం లేకుండా చేయాలి అనుకుంటున్నారట.
56
Bigg Boss Telugu 7
నెక్స్ట్ సీజన్ నుండి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ర్యాలీలు ఉండవు. వాళ్ళు నేరుగా ఇంటికి వెళ్లిపోయేలా బిగ్ బాస్ నిర్వాహకులు ఒప్పందం కుదుర్చుకునే అవకాశం కలదంటున్నారు. పోలీసులు కూడా ఇదే సూచన చేయనున్నారట. కంటెస్టెంట్స్ ర్యాలీలు చేయకుండా చూసుకోవాలని నిర్వాహకులు పోలీసులు గట్టిగా చెప్పనున్నారట.
66
ఈ మేరకు ఓ వాదన తెరపైకి వచ్చింది. కాబట్టి నెక్స్ట్ సీజన్ నుండి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రోడ్ల మీద ర్యాలీలు చేయడం జరగకపోవచ్చు. బిగ్ బాస్ షో అభిమానులను ఇది నిరాశపరిచే అంశమే. మరి నిజంగా ర్యాలీల మీద నిషేధం విధిస్తే... అభిమానులు వాళ్ళను కలవాలంటే నేరుగా ఇంటికి వెళ్ళాలి. చూద్దాం ఇక ఏమవుతుందో...