దివంతగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయడు ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర2’ Yatra 2. ఈ చిత్రం రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మహి వీ రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వైఎస్సాఆర్ పాత్రలో మలయాళం స్టార్ హీరో మమ్ముట్టీ (Mamootty).. జగన్ పాత్రలో జీవా నటించారు. చిత్రం ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తొలిరోజు నుంచి ఈ చిత్రానికి కాస్తా మంచి రిజల్ట్సే అందుతున్నాయి. అటు ప్రేక్షకుల నుంచి ఇటు బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్స్ నే సొంతం చేసుకుంటోంది. ఇక ఈ సినిమాపై సెలబ్రెటీలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా యాంకర్ స్రవంతి Sravanthi Chokkarapu ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. ఈ సినిమా చూసిన బిగ్ బాస్ బ్యూటీ ఓ కీలకమైన వీడియోను పంచుకుంటూ తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకుంది.
‘ఇంత మొండోడివి ఏంటి వైఎస్ జగన్ అన్నా.. మీరూ కూడా యాత్ర2 మూవీ చూసి జగన్ అన్న మొండితనాన్ని, ధైర్యాన్ని, గెలుపుని ఎక్స్ పీరియెన్స్ చేయండి’.. అంటూ ప్రేక్షకులకు సూచించింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇక స్రవంతి గతంలోనే సినిమాల నటిగా స్రవంతి తన కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత యాంకర్ గా ప్రయాణం ప్రారంభించింది. బుల్లితెరపై ఆకట్టుకుంటోంది.
బిగ్ బాగ్ తెలుగు నాన్ స్టాప్ Bigg Boss telugu Non Stopతోనూ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో తన స్టన్నింగ్ ఫొటోలనూ షేర్ చేస్తూ హాట్ టాపిక్ గ్గా మారుతుంటుంది.