మంచీ చెడు వదిలేసి సహజీవనంలో మునిగి తేలుతున్న బిగ్ బాస్ ప్రియాంక... ఇదేం తెగింపు బాబోయ్!

First Published Jun 21, 2024, 7:27 AM IST

బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ తీరుకు ఆమె ఫ్యాన్స్ కూడా అవాక్కు అవుతున్నారు. మంచీ చెడు వదిలేసి సహజీవనాన్ని ఆస్వాదిస్తోంది. పెళ్లి మాట ఎత్తడం లేదు. ప్రియాంక జైన్ తీరుపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆమె తగ్గడం లేదు. 

Bigg Boss fame Priyanka jain

సీరియల్ నటిగా ప్రియాంక జైన్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమే. మౌనరాగం, జానకి కలగనలేదు వంటి సీరియల్స్ లో ఆమె లీడ్ హీరోయిన్ రోల్స్ చేసింది. గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 7లో ప్రియాంక జైన్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ రియాలిటీ షో ప్రియాంక జైన్ కి మరింత పాపులారిటీ తెచ్చిపెట్టింది. 

Bigg Boss fame Priyanka jain

మొత్తం 19 మంది కంటెస్టెంట్ చేయగా ప్రియాంక జైన్ సత్తా చాటింది. ఆమె ఫైనల్ కి వెళ్లారు. బిగ్ బాస్ తెలుగు 7లో ఫైనల్ కి వెళ్లిన ఒకే ఒక లేడీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ కావడం విశేషం. హౌస్లో ఆమె తన జుట్టుకు కూడా త్యాగం చేసింది. భుజాల పై వరకు కట్టింరించుకుంది. 

Bigg Boss fame Priyanka jain

హోమ్లీ ఇమేజ్ కలిగిన ప్రియాంక జైన్ బిగ్ బాస్ షో వేదికగా తనలోని కొత్త యాంగిల్ పరిచయం చేసింది. ప్రియాంక కోసం ప్రియుడు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. సాధారణంగా ఫ్యామిలీ వీక్ లో కుటుంబ సభ్యులు తమ వారి కోసం హౌస్లో అడుగుపెడతారు. ప్రియాంక మాత్రం ప్రియుడిని పిలిపించుకుంది. కెమెరాల ముందే వీరి రొమాన్స్ పీక్స్ అని చెప్పాలి. 

Bigg Boss fame Priyanka jain

సీరియల్ నటుడు శివ కుమార్ ని చాలా కాలంగా ప్రేమిస్తున్నట్లు ప్రియాంక జైన్ బిగ్ బాస్ షోలో వెల్లడించింది. హౌస్లో ఉన్నంత సేపు శివ కుమార్ ప్రియురాలు ప్రియాంక జైన్ ని ముద్దుల్లో ముంచెత్తాడు. టైట్ హగ్స్ తో ఉక్కిరిబిక్కిరి చేశాడు. హౌస్లోనే పెళ్లి చేసుకుందామని ప్రియాంక జైన్ కోరింది. నువ్వు బయటకు వచ్చిన వెంటనే చేసుకుందాం అని శివ కుమార్ అన్నాడు. 

Bigg Boss fame Priyanka jain

బిగ్ బాస్ షో ముగిసి ఆరు నెలలు అవుతుంది. ఇంతవరకు ప్రియాంక జైన్-శివ కుమార్ పెళ్లి చేసుకోలేదు. ఈక్రమంలో విమర్శలు తలెత్తాయి. పెళ్లి అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందులోనూ ప్రియాంక గ్రాండ్ గా చేసుకోవాలి అంటుంది. అందుకే ఆలస్యం అని శివ కుమార్ ఓ సందర్భంలో వెల్లడించాడు. 
 

Bigg Boss fame Priyanka jain

ప్రస్తుతానికి పెళ్లి సంగతి పక్కన పెట్టేశారు. ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. వీరి రొమాంటిక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య ఇండియాలో సహజీవనం కల్చర్ బాగా ఎక్కువైంది. కలిసి ఉన్నంత కాలం ఉండి వద్దు అనుకుంటే హ్యాపీగా విడిపోవచ్చు. ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు ఉండవు. 

Bigg Boss fame Priyanka jain

ఇక ప్రియాంక జైన్ ఎలాంటి కొత్త సీరియల్ ప్రకటించలేదు. ఆమె సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ నడుపుతుంది. శివ కుమార్ ఇటీవల ఓ కొత్త సీరియల్ లో అవకాశం దక్కించుకున్నాడు. 

Latest Videos

click me!