జబర్దస్త్ లెజెండరీ కామెడీ షో అనడంలో సందేహం లేదు. జబర్దస్త్ సక్సెస్ నేపథ్యంలో ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా తెరపైకి తెచ్చారు. ఈ రెండు షోలు బుల్లితెరపై చరిత్ర సృష్టించాయి. అనసూయ, రష్మీ, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, రామ్ ప్రసాద్, చమ్మక్ చంద్ర... ఇంకా ఎందరో స్టార్స్ గా ఎదిగారు. కనీస గుర్తింపు లేని వాళ్లకు ఈ షో స్టార్ హోదా తెచ్చిపెట్టింది.