Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్ మామ కోసం జైలు ఎదుట కోడలు... చిన్నారి మాటలకు గుండె తరుక్కుపోతుంది.!

Published : Dec 23, 2023, 06:52 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth)  పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ షోతో టీవీ ఆడియెన్స్ కు ఎంతగానో దగ్గరయ్యారు. రైతుబిడ్డగా చాలా పాపులారిటీని సొంతం చేసుకుంది. పాపులర్ షోతో సెలబ్రెటీగా మారాడు. 

PREV
16
Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్ మామ కోసం జైలు ఎదుట కోడలు... చిన్నారి మాటలకు గుండె తరుక్కుపోతుంది.!

Bigg  Boss Telugu 7 గ్రాండ్ ఫినాలే సెలబ్రేషన్స్ లో భాగంగా అన్నపూర్ణ స్టూడియో వద్ద ఫ్యాన్స్ కాస్తా హంగామా చేసిన విషయం తెలిసిందే. కంటెస్టెంట్ల కార్ల అద్దాలు, ఆర్టీసీ బస్సుల అద్దాలను అభిమానులు పగలగొట్టారనే వార్త వైరల్ గా మారింది. దాంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేశారు. 14 రోజుల రిమాండ్ కోసం చంచల్ గూడ జైల్ కు తరలించారు.

26

ఎట్టకేళకు నిన్ననే నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. మొత్తానికి కండీషన్స్ తో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో పల్లవి ప్రశాంత్ బయటికి రానున్నారు. ఈరోజు రాత్రి విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో అతని కోసం అభిమానులు జైలు ముందు ఎదురుచూస్తున్నారు. 

36

ఈ క్రమంలో హృదయం చలించే ఘటన ఒకటి జరిగింది. పల్లవి ప్రశాంత్ కోసం నాలుగేళ్ల చిన్నారని జైలు బయట వేచి ఉండటం అందరి దృష్టిని మళ్లించింది. తన మామ కోసం వేచి ఉన్నానని, బయటికి రాగానే రెండు చాక్లెట్స్ ఇస్తానని చెప్పింది. తన మామ కోసమే ఇక్కడికి వచ్చానని చిన్నారి చెప్పడం గుండెలను కదిలిస్తోంది.

46

పైగా ఆ చిన్నారి జ్వరం కూడా వచ్చిందని, అయినా వాళ్ల అమ్మ, అమ్మమ్మతో  కలిసి జైలు వరకు వచ్చింది. మామను చూడాలని వెక్కివెక్కి ఏడ్చిందంట. ప్రస్తుతం ఈ చిన్నారి మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. పల్లవి ప్రశాంత్ రాగానే ఆ చిన్నారని ఆనందం చూడాలంటున్నారు కుటుంబీకులు. 

56

ఇక పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తనను బయటికి తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులతో పాటు పల్లవిప్రశాంత్ మద్దతుదారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బెయిల్ మంజూరైంది. 

66

మరోవైపు పల్లవి ప్రశాంత్ కు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్లు కూడా మద్దతునిస్తున్నారు. తను అమాయకుడని చెప్పే ప్రయత్నం చేశారు. శివాజీ, యావర్, శోభాశెట్టి, అశ్విని అందరూ ప్రశాంత్ ను అరెస్ట్ చేయడంపై స్పందించారు. 

Read more Photos on
click me!

Recommended Stories