తాను చనిపోయినట్టు రూమర్‌.. షాకింగ్‌ విషయం బయటపెట్టిన టీవీ నటుడు జాకీ.. షోలోనే భార్య కన్నీళ్లు

Published : Jun 06, 2023, 03:57 PM ISTUpdated : Jun 06, 2023, 06:40 PM IST

టీవీ నటుడు జాకీ హీరోగా, ఇప్పుడు సీరియల్‌ నటుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. తన భార్య, నటి హరితని ప్రేమ వివాహం చేసుకున్న ఆయన సీరియల్స్ తో బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవల ఆయనకు సంబంధించిన ఓ వార్త సంచలనంగా మారింది. 

PREV
15
తాను చనిపోయినట్టు రూమర్‌.. షాకింగ్‌ విషయం బయటపెట్టిన టీవీ నటుడు జాకీ.. షోలోనే భార్య కన్నీళ్లు

టీవీ నటుడు జాకీ, తన భార్య హరితలు.. సాయికిరణ్‌, అర్చన అనంత్‌లతో కలిసి `సుమ అడ్డా`కి వచ్చారు. ఇందులో తమదైన పంచ్‌లతో నవ్వులు పూయించారు. వారి కామెంట్లు, సుమ పంచ్‌లు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. షోని నవ్వుల మయంగా మార్చింది. తాజాగా విడుదలైన ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. 
 

25

ఇందులో చివర్లో ఓ షాకింగ్‌ విషయం బయటపెట్టారు జాకీ. నవ్వులతో సాగే షోని ఒక్కసారిగా ఎమోషనల్‌గా మార్చాడు. ఊహించని విషయాన్ని ఆయన సుమ ముందు వెల్లడించారు. ఆరేడు నెలల క్రితం తనకు సంబంధించిన ఓ రూమర్‌ హల్‌చల్‌ చేసిందట. తాను చనిపోయినట్టు వార్తలొచ్చాయని చెబుతూ అందరిని షాక్‌కి గురిచేశాడు జాకీ. 
 

35

ఆయన చెబుతూ, `ఆరేడు నెలల క్రితం జాకీని కాలుస్తున్నారు. జాకీ చచ్చిపోయాడు` అని చెప్పాడు జాకీ. దీనికి ఆయన భార్య హరిత షోలోనే కన్నీళ్లు పెట్టుకుంది. మరోవైపు ఈ వార్త విని సుమ సైతం షాక్‌ అయ్యింది. మరోవైపు సాయికిరణ్‌ అర్చనలు సైతం నోరెళ్లబెట్టారు. సాఫీగా సాగుతున్న షోలో ఇలాంటి కఠోరమైన, జీర్ణించుకోలేని విషయాలు జాకీ చెప్పడంతో షో మొత్తం ఒక్కసారిగా గుంబనంగా మారిపోయింది. ఇది ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది. 
 

45

ఇక సరదా పాయింట్‌ కి వస్తే, ప్రారంభంలో జాకీ, హరిత ఎంట్రీ ఇచ్చారు. అదిరిపోయే సాంగ్‌కి డాన్సు చేస్తూ అలరించారు. అనంతరం మీ ఆయన మీద కోపం వస్తే ఏం చేస్తారని హరితని సుమ అడగ్గా, బుగ్గలు కొరుకేసుకుంటుందని జాకీ చెప్పాడు. మీరు కొరకనిస్తారా ఏంటి? అని హరిత అనగా, కొరికితే మీకు లాగా అయిపోయేవి అని సుమని ఉద్దేశించి చెప్పడం హైలైట్‌గా నిలిచింది. మరోవైపు హరితని జాకీ అలా చూస్తుంటే, ఎందుకలా దీనంగా చూస్తున్నారు ఆమెని అనగా, నాకేమైనా సమస్య వస్తే ఆమెనే చూస్తానని, ఎందుకంటే ఆమె కంటే పెద్ద సమస్య ఉండదు కాబట్టి అని చెప్పడంలో నవ్వులు పూయించింది.
 

55

అనంతరం సాయికిరణ్‌, అర్చన వచ్చారు. మీకు మీ ఆయన మీద కోపం వస్తే ఏం చేస్తారని అర్చనని సుమ అడగ్గా, నీళ్లు తాగుతానండి అని చెప్పింది. దీనికి సుమ రియాక్ట్ అవుతూ, కొంతమంది అయితే నీళ్లల్లో ఇంకేమైనా కలుపుకుని తాగుతారంటూ చెప్పడం కామెడీని పండించింది. సాయికిరణ్‌ లెక్కల గేమ్‌లో తప్పడంతో ఆయన వేసిన పంచ్‌ మరింతగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ప్రోమో ట్రెండ్‌ అవుతుంది. ఈ నెల 10న ఈటీవీలో ఈ షో ప్రసారం కానుంది. ఈ నటులంతా ఒకప్పుడు సినిమాలు చేసి, ఇప్పుడు సీరియల్స్ కే పరిమితమయ్యారు.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories