Intinti Gruhalakshmi: స్వార్థం కోసం కన్నతల్లిని కూడా లెక్కచేయని అభి.. పుట్టినరోజున కోడల్ని బాధపెట్టిన తులసి!

Published : Jun 03, 2022, 01:37 PM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మంచి ప్రేక్షక ధారణ కూడా పొందింది. ఇక ఈ రోజు జూన్ 3 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
17
Intinti Gruhalakshmi: స్వార్థం కోసం కన్నతల్లిని కూడా లెక్కచేయని అభి.. పుట్టినరోజున కోడల్ని బాధపెట్టిన తులసి!

ఎపిసోడ్ ప్రారంభంలోనే.. తులసి (Tulasi) ని పుట్టినరోజు వేడుకకు ఆహ్వానించినందుకు గాయత్రి సీరియస్ అవుతుంది. లాస్య కూడా దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా తులసిపై మరింత ఆడి పోసుకుంటుంది. గాయత్రి, లాస్య (Lasya) ఎదురుగా ఉన్న అభి ముందర తులసి గురించి నానారకాలుగా నెగెటివ్ గా ఆలోచిస్తారు.
 

27

అక్కడే వారి మాటలను వింటున్న తులసి (Tulasi) చాలా బాధపడుతుంది. కనీసం తన కొడుకు కూడా తన తల్లి అలాంటిది కాదు అని చెప్పలేక పోతున్నాడు అని కుమిలిపోతుంది. ఇక గాయత్రి (Gayatri) అభితో మనకు కోట్ల ఆస్తి వచ్చిందని తులసి కి తెలియకుండా ఉండాలి అని అంటుంది.
 

37

లాస్య (Lasya) కూడా ఆస్తి విషయంలో తులసిని నమ్మ కూడదు అని అంటుంది. ఎలాగైనా తనకు తెలియకుండా జాగ్రత్త పడాలి అని అంటుంది. పైగా గాయత్రి కూడా తులసి గురించి చాలా దారుణంగా ఆలోచిస్తుంది. కానీ పక్కనే ఉన్న అభి (Abhi) మాత్రం తన స్వార్ధం గురించి ఆలోచిస్తూ తన తల్లిని అలా అంటున్నారు అని కూడా పట్టించుకోకుండా వాళ్లకు సపోర్ట్ గా ఉంటాడు.
 

47

ఇక తులసి (Tulasi) అంకిత దగ్గరికి వెళ్లి తాము వెళ్తున్నాము అని అంటుంది. కానీ అంకిత అప్పుడే ఎందుకు అని మాట్లాడుతుండగా.. కనీసం తినకుండా వెళ్ళడం కరెక్ట్ కాదు అని అనడంతో.. అభి ఉద్దేశించి ఇవన్నీ చూస్తే కడుపునిండినట్లు గా ఉంది అని అంటుంది. దాంతో అభి (Abhi) కి ఏమాత్రం అర్థం కాకుండా అనిపిస్తుంది.
 

57

జరిగే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇష్టం లేకున్నా కూడా అంకితను (Ankitha) తన ఇంటి గడప తోక్కొద్దు అని అనడంతో అంకిత తట్టుకోలేక బాగా ఏడుస్తుంది. అనసూయ దంపతులు తులసి ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా బాధ పడతారు. మరుసటిరోజు తులసి (Tulasi) ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అని గట్టిగా అడుగుతుంది అనసూయ.
 

67

కానీ పరంధామయ్య అర్థం చేసుకొని ఇష్టంగా చూసుకునే అంకితను (Ankitha) అలా అనడానికి ఏదో కారణం ఉంది అని అనటంతో తులసి నిజాలు చెప్పేస్తుంది. దాంతో పరందామయ్య దంపతులు చాలా బాధ పడతారు. తులసి (Tulasi) ఒంటరిగా కూర్చొని జరిగిన విషయాలను తలచుకుంటూ ఉంటుంది.
 

77

అంకిత తులసికి ఫోన్ చేస్తూ ఉంటుంది. కాని తులసి ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. అయినా కూడా అంకిత ఫోన్ చేస్తూనే ఉంటుంది. దివ్య (Divya) వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయటంతో.. అంకిత బాగా ఎమోషనల్ గా మాట్లాడుతుంది. అంకిత (Ankitha) మాటలు విని తులసి తట్టుకోలేక పోతుంది.

click me!

Recommended Stories