Intinti Gruhalakshmi: సామ్రాట్ మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? రిపోర్టర్ ప్రశ్నకు తులసి సీరియస్!

First Published Sep 26, 2022, 11:24 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు సెప్టెంబర్ 26వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే...తులసీ తయారై కిందకి వస్తుంది. అప్పటికే సామ్రాట్ రెడీ అయి ఉంటాడు. హనీ వచ్చి నేను కూడా తులసి ఆంటీ పక్కనే కూర్చుంటాను అని అంటుంది. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్, వద్దమ్మా నువ్వు మాతో కూర్చొని అనగా నా వారసురాలే కదా బాబాయ్ పర్లేదు అన్నీ నేర్చుకుంటుంది అని సామ్రాట్ తనతో పాటు తీసుకెళ్తాడు. మరోవైపు లాస్య, నందులు వీళ్లేంటి ఇంకా రాలేదు అని అనుకుంటారు.ఇంతలో వాళ్ళ ముగ్గురు వచ్చేసరికి లాస్య, చూసావా కుటుంబం  అంతా కలిసి ఎంత బాగా వస్తున్నారో.మొగుడు, పెళ్ళాం, కూతురు లాగా అని నందుని రెచ్చగొడుతుంది. అప్పుడు ముగ్గురు వెళ్లి అక్కడ కూర్చుంటారు. అప్పుడు సామ్రాట్, పిలిచిన వెంటనే వచ్చినందుకు రిపోర్టర్స్ అందరికీ ధన్యవాదాలు అని అనగా రిపోర్టర్స్ అందరూ మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సార్. 

 అవి మేము ముందు అడగాలనుకుంటున్నాము అని అనగా లాస్య,ముందు సామ్రాట్ గారిని మాట్లాడనివ్వండి. తర్వాత మీ ప్రశ్నలకు జవాబులు చెప్తారు అని అనగా వాళ్ళు ముందు మేము అడిగిన ప్రశ్నలు జవాబులు చెప్తేనే ఉంటాము.లేకపోతే మేము వెళ్ళిపోతాము అని బయలుదేరుతుండగా సామ్రాట్ కూర్చోబెట్టి అడగండి మీ ప్రశ్నలు ఏంటి అని అంటాడు.అప్పుడు వాళ్ళు,మొన్న భూమి పూజ రోజు మీరిద్దరి మధ్య గొడవ జరిగినందువల్ల ఈ ప్రాజెక్టు వద్దనుకున్నారు కదా, మళ్లీ వెళ్లి తులసి గారి కాళ్ళ మీద పడ్డారా ఒప్పుకునే వరకు వదలలేదా అని అనగా తులసి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు తులసి వాళ్ళతో, మీరు అడిగే పద్ధతి బాలేదు ఆ భాష మార్చుకోండి కాళ్లు పట్టుకోవడం ఏంటి అని అంటుంది. అప్పుడు సామ్రాట్ తులసిని ఆపుతాడు.

అప్పుడు వాళ్ళు, మీకు,తులసి గారికి మధ్య ఏవైనా సంబంధం ఉన్నదా, మీ వ్యాపార భాగస్వామ్యం జీవిత భాగస్వామ్యం అవ్వనున్నదా అని అడుగుతారు. అప్పుడు ఇంకొకలు, అయినా మీరు ఎప్పుడూ మీ భార్య గురించి ప్రస్తావన తేలేదు ఎందుకు? అసలు మీ భార్య ఎవరు మీరు వదిలేసారా? బయట చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అందరి దగ్గరా,మీరిద్దరు ఒకటి అవుతారు అన్న ఆధారాలు ఉన్నాయి. త్వరలోనే మీ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా అని అనగా సామ్రాట్ మౌనంగా ఉండిపోయాడు.మీ మౌనానికి జవాబు మేమే అర్థం చేసుకుని న్యూస్ లో వేసుకుంటాము,మీకేం అభ్యంతరం లేదు కదా అని వాళ్ళు అంటారు. నాకు అభ్యంతరం ఉన్నది అని తులసి వాళ్ల మాటను  మధ్యలో ఆపి, అసలు మీరు ఏం ఇలాంటి ప్రశ్నలు ఎలా అడగగలుగుతున్నారు.

నేను ఒక ఆడదాన్ని ఏ తోడు లేని ఆడదాన్ని, జీవితంలో ఎదగడానికి అని ఎన్నో కష్టాలు ఎదుర్కొని నా సగ జీవితం వంట గదిలోనే గడిపేసాను. అలాంటప్పుడు సామ్రాట్ గారు నాకు తోడుగా వచ్చినాక అవకాశం ఇచ్చారు అవకాశాన్ని నేను వాడుకున్నాను.జీవితంలో ఎదగాలి అని అందరికీ నేను ఆదర్శంగా కావాలి అని అనుకున్నాను. అలాంటప్పుడు ఇలాంటి నిందలని మోయక తప్పదు ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం నాకు సామ్రాట్ గారికి మధ్య ఏమీ లేదు.ఎవరికి నచ్చిన నచ్చకపోయినా, అవునన్నా కాదన్నా ఆ భాగస్వామ్యం తెగిపోదు, ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. ఎవరు ఏమనుకున్నా భయపడి వెనక్కి తగ్గేదే లేదు ఎవరు రయలనుకున్నది వాళ్ళు రాసుకోండి అని అనగా అందరూ తులసి మాటలకు ఫిదా అయి చప్పట్లు కొడుతూ ఉంటారు. అప్పుడు తులసి, ఇందాక మీరు ఎవరో సామ్రాట్ గారి భార్య గురించి అన్నారు.

అది వాళ్ళ వ్యక్తిగతం అయినా అలాంటి మాటలు అడగాలనీ,పక్క వాళ్ళ జీవితంలోకి తొంగి చూడాలని మీకు ఎందుకు అనిపిస్తుంది అని అడగగా ఆ మాట అన్న వ్యక్తి, సారీ సామ్రాట్ గారు నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఇలా జరగదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఎంతో ఆనందపడతారు. ఇంటికి వచ్చిన తర్వాత దివ్య, వాళ్ళ అమ్మని హద్దుకొని, అమ్మ నేను చాలా గర్వంగా ఉన్నానమ్మా నువ్వు ఈ రోజు చాలా బాగా మాట్లాడావు అని అంటుంది.అప్పుడు అభి అక్కడికి వచ్చి, ఇలా జరిగింది కాబట్టి సరిపోయింది ఒకవేళ నువ్వు మాట్లాడలేకపోయి ఉంటే ఒక్కొక్కళ్ళు ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు రాసుకునేవారు ఇదంతా అవసరమా అని అనగా అనసూయ,నా కోడలు తప్పు చేయదు ఆ విషయం నాకు తెలుసు అని అంటుంది. 

అప్పుడు అభి,తప్పు చేయకపోవడం ఒకటే కాదు తప్పుగా మాట్లాడేందుకు మన అవకాశం కూడా ఇవ్వకూడదు అని అనగా ప్రేమ్, ఇంట్లో నలుగురు అభిప్రాయాలు ఒకలా ఉండవు అలాంటిది అందరూ అభిప్రాయాలు ఒకలా ఉంటాయని ఎందుకు అనుకుంటాము అలా ఎదుటివారి గురించి చూసుకుంటూ పోతే మనం ఎప్పుడు జీవితంలో నెగ్గలేము అని అంటాడు. అప్పుడు అభి, అయినా ఆయన ఎందుకు ఆ విషయంలో మౌనంగా ఉండి పోయారు. ఏమీ మాట్లాడలేదు అంటే వాళ్ళు జరిగే చెప్పినవన్నీ నిజమనే కదా అర్థం వాళ్ళ నచ్చింది వాళ్ళు రాసుకుంటారు అని అనగా, ఆయన ఎందుకు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు నాకు అర్థం కావట్లేదు అని తులసి అంటుంది. ప్రశ్నకు జవాబు కూడా ఇవ్వలేని మనిషి పోటుగాడు లాగా వెళ్లి ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు అని అభి అనగా, నాకు తెలిసినంతవరకు ఆయన సమస్యకు భయపడి పారిపోయే మనిషి కాదు. ఆయన మౌనం వెనకాల ఏదో చెప్పుకోలేని కారణం ఉండే ఉంటుంది అని అనగా అనసూయ, ఎవరికి చెప్పినా చెప్పకపోయా నీకు చెప్పాలి కదమ్మా.

నువ్వు ధైర్యం చేసి మాట్లాడావు కాబట్టి సరిపోయింది అని అనగా అభి,లేకపోతే ఇంకొకసారి పేపర్లోకి ఎక్కేది అని అంటాడు. అప్పుడు తులసి, భాగస్వామ్యంలో ఒకసారి ఆయన వల్ల తప్పు జరగొచ్చు, ఒకసారి నావల్ల తప్పు జరగొచ్చు అయినా ఇద్దరికి ఇద్దరు సపోర్ట్ గా ఉండి నిలబడాలి. ఈ లోగా ఆయన గురించి తప్పుగా ఆలోచించడం నాకు నచ్చలేదు. మన చిన్న తప్పును కూడా భూతద్దంలో చూపించే సమాజంలో బతుకుతున్నాము. అలాంటి సమాజాన్ని చూసి మనం భయపడితే అడుగు ముందుకు వేయలేము.
 

 ఈ విషయం నేను అనుభవం మీద తెలుసుకున్నాను అని అనగా ప్రేమ్, ఈరోజు నేను ఫిక్స్ అయిపోయానమ్మా ఇంక నీ గెలుపుని ఎవరు అడ్డుకోలేరు అని అంటారు. ఆ తర్వాత సీన్లో హనీ పడుకొని ఉండగా సామ్రాట్ అక్కడికి వెళ్లి మనసులో, నిప్పులాంటి నిజాన్ని నా గుండెల్లో దాచుకొని సమాజం ముందు నీకు నాన్నల నిలబడ్డాను. ఒక రకంగా ఇది నిన్ను మోసం చేయడమే అవుతుంది. నీ ఆనందం కోసమే ఇలా చేస్తున్నానమ్మా! ఈ నాన్న కానీ నాన్నను క్షమించు అమ్మ. నన్ను కాదు అని నా చెల్లి తన జీవితాన్ని వదులుకున్నది. ఇప్పుడు తన ప్రేమను నేను నీలో చూసుకుంటున్నాను అని బాధపడుతూ ఉంటాడు సామ్రాట్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!