
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..చిన్మయి హాల్లో కూర్చుని దేవి ప్రవర్తన ఎందుకు అల ఉందో, నాతో కూడా ఏమీ చెప్పడం లేదు చెల్లి సమస్య నేను తీర్చాలి. చెల్లిని ఓదార్చాలి అప్పుడే తను చదువు మీద శ్రద్ధ పెడుతుంది అని ఆలోచించుకుంటూ ఉంటుంది.చిన్మయి నీ చూసిన మాధవ్, చిన్మయి ఈ మధ్య బాధగా ఉంటుంది.ఏవో ఆలోచలలో ఉంటున్నట్టున్నది ఈమధ్య రాధ విషయం ఆలోచించుకుంటూ చిన్మయి గురించి ఆ పట్టించుకోవడమే మర్చిపోయాను అనుకొని చిన్మయి దగ్గరికి వెళ్లి ఏమైందమ్మా ఎందుకు అలాగున్నావు అని అడుగుతాడు మాధవ్.
అప్పుడు చిన్మయి, ఏం లేదు నాన్న నేను బానే ఉన్నాను అని అనగా, నిజం చెప్పమ్మా ఎందుకలా ఉన్నావు అని మాధవ్ అంటాడు.నిజంగా ఏమీ లేదు నాన్న. నేను నిన్ను ఒక విషయం అడగవచ్చా నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది చిన్మయి.నేను నిన్ను ప్రేమించకపోవడం ఏంటమ్మా నువ్వు నా ప్రాణం అని మాధవ్ అంటాడు. దానికి చిన్మయి, అలాగైతే ఆఫీసర్ సార్ నన్ను, దేవిని చూసుకున్నట్టు నువ్వు ఎందుకు నాన్న నన్ను ఎప్పుడు చూసుకోవు. ఆఫీసర్ సార్ మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు.
కానీ నువ్వు మా దగ్గర కూడా ఎందుకు రావడం లేదు అని అనగా, అలా కాదమ్మా ఈ మధ్యన ఒక చిన్న పని ఉండి నిన్ను పట్టించుకోవడం లేదు అంతేగాని నీ మీద ప్రేమ లేదని కాదు అని అంటాడు మాధవ్.అప్పుడు చిన్నయి లేదు నీకు నామీద ప్రేమ లేదు నాకు తెలుసు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మాధవ్ చిన్మయి మాటలకు బాధపడుతూ ఉంటాడు. అప్పుడు రాధ అక్కడికి వచ్చి,విన్నావా నీ కూతురు ఏమంటుందో ఇప్పటికైనా అర్థమైందా నువ్వు తనకి ఎంత ప్రేమనిస్తున్నావో. ఒక మనిషిగా నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు కనీసం ఒక తండ్రిగా అయినా తనని అర్థం చేసుకొని చిన్మయికి ప్రేమను ఇవ్వు అప్పటికైనా తను సంతోషపడుతుంది అని చెప్తుంది.
ఆ తర్వాత సీన్లో భాగ్యమ్మ మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండగా రుక్మిణి అక్కడికి వస్తుంది. ఏమైందమ్మా అంత బాధగా ఉన్నావు అని భాగ్యమ్మ అడగగా, ఏమీ లేదమ్మా దేవమ్మ ఎలాగున్నది ఇంకా అలాగే ఉందా అని అడుగుతుంది రుక్మిణి. అవునమ్మా ఏం మాట్లాడినా తిరిగి మాట్లాడడం లేదు ఎవరిని పట్టించుకోవడం లేదు తను బాధలో తను ఉంటుంది అని భాగ్యమ్మ అనగా, దేవి అలాగుంటే చిన్మయేమో లోకం తెలియని దానిలా ఉంటుంది. నేను ఇంటి నుంచి వెళ్ళిపోక ముందే చిన్మయికి అంతా నేర్పించి, నేను లేకుండా తను ఎలా బతకాలి తన పనులు తను ఎలా చేసుకోవాలి అని నేర్పిద్దాం అనుకుంటే అది రాత్రి నా దగ్గరికి వచ్చి కష్టమంటే ఏంటి అని అడుగుతుంది అని రుక్మిణి అనగా కష్టమంటే నువ్వు అని చెప్పాలి కదా అని భాగ్యమ్మ అంటుంది.
ఇప్పుడు నా గురించి చెప్పడం కాదమ్మా చిన్న వయసులో తనకి కష్టం గురించి తెలియకూడదు, కష్టపడితే వచ్చే సుఖం గురించి తెలియాలి అలా తెలియాలంటే తనకి నేను నేర్పించాలి పొలానికి తీసుకువెళ్లి దీని గురించి చెప్పాలి అని రుక్మిణి అంటుంది. అప్పుడు భాగ్యమ్మ అయితే నేను కూడా అక్కడికి వస్తాను పొలాన్ని చూడగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అంటుంది. ఆ తర్వాత సీన్లో,రామ్మూర్తి జానకమ్మకు సేవలు చేస్తూ ఉంటారు. అప్పుడు జానకమ్మ మనసులో, నాకు ఒంట్లో బాలేదని తెలిస్తేనే మీరు ఇలా సేవలు చేస్తున్నారు దీనికి కారణం మాధవ్ అని తెలిస్తే ఏమైపోతారో అని అనుకుంటుంది.
అదే సమయంలో రుక్మిణి పిల్లలు ఇద్దరిని తీసుకొని అక్కడికి వచ్చి మేము పోలానికి వెళ్లాలనుకుంటున్నాము పిల్లలకు కూడా ఇల్లు కదిలినట్టు ఉంటుంది కదా అని అనగా, సరే అమ్మ అని రామ్మూర్తి అంటాడు. అమ్మకి గంటకోసారి మందులు ఇవ్వాలి జాగ్రత్త అక్కడ పెట్టాను అని చెప్పి రుక్మిణి పిల్లని తీసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు రామ్మూర్తి జానకమ్మ తో, మనం ఎంత అదృష్టవంతురాలము జానకమ్మ. రాధ మన జీవితంలోకి వచ్చి మనకి ఎంతో సహాయం చేసింది ఒకవైపు వంట చేస్తూ ,ఇంకోవైపు పిల్లల్ని చూసుకుంటూ, మరోవైపు నిన్ను చూసుకుంటూ, ఇప్పుడు పిల్లల్ని బయట కూడా తీసుకెళ్తుంది అని ఆనందపడతాడు.
ఆ తర్వాత సీన్లో ఆదిత్య కారులో వెళ్తూ ఆఫీస్ పని గురించి ఎవరితోనో మాట్లాడుకుంటూ, ఆ పొలాల్లో వర్షాలు ఎక్కువ పడుతున్నాయి త్వరగా పని ముగించుకుంటే అవుతుంది మళ్ళీ లేట్ చేస్తూ అయిపోతే ప్రాబ్లం అవుతుంది నేను అక్కడికి వెళ్తున్నాను అని అంటాడు. ఆ తర్వాత సీన్లో రుక్మిణి, భాగ్యమ్మ, పిల్లలిద్దరూ పొలానికి వస్తారు.అక్కడ పొలాన్ని చూసిన అందరూ ఎంతో ఆనందపడతారు. అప్పుడు రుక్మిణి చిన్మయితో, కష్టమంటే ఏంటి అని అడిగావు కదా ఇదే కష్టము అని అంటుంది.ఇది కష్టమేంటమ్మా అని చిన్మయి అడగగా, ఇదే అమ్మ అసలైన కష్టం విత్తనాలు నాటి, దానికి నీళ్లు జల్లి, దున్ని చాలా కష్టపడితే గాని ఇంత పంట రాదు. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ కష్టపడేవాడు రైతే తన వల్లే ప్రపంచమంతా హాయిగా తిని పడుకుంటున్నారు అని అంటుంది రుక్మిణి.అప్పుడు చిన్మయి, అదేంటమ్మా గుంట తీసి విత్తనాలు వేస్తే పంట వచ్చేస్తుంది కదా అని అనగా
ఇది ఇంట్లో మొక్కలు నాటినంతా తేలిక కాదమ్మా గరీబోళ్ళు నాగలితో దున్నుతారు డబ్బున్నోళ్ళు ట్రాక్టర్ తో దున్నుతారు అని అనగా దేవి ఉత్సాహంతో, తాతయ్య అప్పుడు ట్రాక్టర్ తో దీన్ని దున్నేవారు అలాగేనా మరి మనం ఇప్పుడు ఏం చేద్దాము ట్రాక్టర్ లేదు కదా అని అనగా, పక్కనే ఉన్న నాగలిని చూపిస్తుంది రుక్మిణి.ఇప్పుడు దాంతో ఎలా దున్నుతాం అమ్మ అని చిన్మయి అడగగా, రుక్మిణి ఆ నాగలి దగ్గరికి వెళ్లి దాన్ని పట్టుకొని గతంలో తను ఆ పొలాల్ని ఎలా దున్నేదో ఆ విషయాలు గుర్తుతెచ్చుకుంటూ ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!