చిరంజీవి తనయ సుస్మితపై ట్రోల్స్.. కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా తీసేయాలంటూ రచ్చ.. మెగాడాటర్‌పై ఇవి ఊహించలేం!

Published : Mar 23, 2024, 12:26 PM ISTUpdated : Mar 23, 2024, 12:28 PM IST

ఇటీవల చిరంజీవి ప్రతి సినిమాకి ఆయన కూతురు సుస్మితనే కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేస్తుంది. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఆమె ట్రోలర్స్ బారిన పడింది. 

PREV
17
చిరంజీవి తనయ సుస్మితపై ట్రోల్స్.. కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా తీసేయాలంటూ రచ్చ.. మెగాడాటర్‌పై ఇవి ఊహించలేం!

మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కూతురు సుస్మితా.. ప్రస్తుతం తండ్రికి కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వ్యవహిస్తున్నారు. ఇటీవల ప్రతి చిరంజీవి మూవీకి ఆమెనే కాస్ట్యూమ్స్ చేస్తుంది. మెగాస్టార్‌ని యంగ్‌గా చూపించడంలో ఆమె వంతు ప్రయత్నం చేస్తుంది. అందుకోసం శ్రమిస్తుంది. 

Survey:వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

27

తన కూతురు సుస్మిత వర్క్ పట్ల చిరంజీవి కూడా చాలా సార్లు ప్రశంసలు కురిపించారు. తనని బాగా చూపించేందుకు కష్టపడుతుందని తెలిపారు. రాను రాను మరింతగా యంగ్‌గా చూపిస్తుందని తెలిపారు. తన కూతురు పనితీరుపట్ల ఆయన మురిసిపోయాడు. కానీ అభిమానుల్లో మాత్రం విభిన్నమైన అభిప్రాయం ఉంది. తాజాగా దాన్ని బయటపెట్టారు. 
 

37

చిరంజీవి లుక్స్ బాగా ఉండటం లేదంటున్నారు. కారణం సుస్మితనే అంటున్నారు. అన్ని సినిమాలకు రెగ్యూలర్‌గా చూపిస్తుందని అంటున్నారు. నెపోటిజం ఉంటే ఇలానే ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు. చిరంజీవి లుక్స్ లో మార్పు ఉండటం లేదని, బాగా ఉండటం లేదంటున్నారు. ట్రోలర్స్‌ రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు. 
 

47

సుస్మిత కొణిదెల తాజాగా సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. సినిమా గురించి, కాస్ట్యూమ్స్ విభాగం గురించి ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా నెటిజన్లు రియాక్ట్ అవుతూ రచ్చ చేస్తున్నారు. ట్రోల్స్ చేస్తున్నారు. చిరంజీవికి స్టయిలీష్‌ చేయోద్దని కామెంట్లు చేస్తున్నారు. ఆమెని మార్చాలని అంటున్నారు. చిరంజీవికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్‌ అంటున్నారు. 
 

57

మరోవైపు అక్కడ(తమిళం)లో రజనీ కూతుళ్లు, ఇక్కడ చిరంజీవి కూతుళ్లు, వారికి దూరంగా ఉండాలంటున్నారు. దీంతో ఇది పెద్ద రచ్చ అవుతుంది. రజనీకాంత్‌కి కూతుళ్లతో పనిచేసిన ఏ సినిమా ఆడలేదు. ఆయనకు చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇక్కడ చిరంజీవి విషయంలోనూ అదే జరుగుతుందంటున్నారు నెటిజన్లు.
 

67

ఇక సుస్మితని నిర్మాతని చేయాలనుకుంటున్నాడు చిరంజీవి. ఆ మధ్య స్క్రిప్ట్ డిస్కషన్‌ కూడా జరిగింది. కళ్యాణ్‌ కృష్ణతో సినిమా అనుకున్నారు. కానీ అది ఆదిలోనే ఆగిపోయింది. మళ్లీ ఆ ప్రయత్నాలు సాగుతున్నాయట. మరి ఇది ఎప్పుడు వర్కౌట్‌ అవుతుందో చూడాలి. కానీ ఒకవేళ సినిమా తీస్తే, అది ఫ్లాప్‌ అయితే కారణం ఆమెనే అంటారేమో. 

77

చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ మూవీలో త్రిష హీరోయిన్‌. మర ఐదుగురుభామలు ఇందులో చిరుకి చెల్లెళ్లుగా కనిపించబోతున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories