ఇంత సింపుల్ గా ఉన్న ప్రియాంక చోప్రా చీర.. అంత కాస్టా...? ప్రత్యేకత ఏంటో తెలుసా..?

Published : Mar 23, 2024, 12:05 PM IST

ఈమధ్యే ఇండియా పర్యటనకు వచ్చింది ప్రియాంక చోప్రా.. తన భర్త నిక్ తో పాటు.. కుటుంబం అంతా కలిసి అయోధ్య శ్రీరాముని దర్శనం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం అయోధ్యలో ప్రియాంక కట్టుకున్ని చీర కాస్ట్ వైరల్ అవుతోంది. 

PREV
17
ఇంత సింపుల్ గా ఉన్న ప్రియాంక చోప్రా చీర.. అంత కాస్టా...? ప్రత్యేకత ఏంటో తెలుసా..?

హాలీవుడ్ కే పరిమితం అయ్యింది గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా..  సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కెరీర్ ను స్టార్ట్ చేసి.. బాలీవుడ్ లో స్టార్ గా ఎదిగి... హాలీవుడ్ కు జంప్ అయ్యింది బ్యూటీ. తన కంటే 10 ఏళ్ళు చిన్నవాడైన హాలీవుడ్ పాప్ సింగర్ కమ్ హీరో నిక్ జానస్ ను పెళ్లాడి.. హాలీవుడ్ లో సెట్ అయ్యింది ప్రియాంక. 

27
Priyanka Chopra

అంతే కాదు  అక్కడే లాస్ ఎంజల్స్ లో  100 కోట్లతో ఇల్లు కట్టుకుని హ్యాపీగా  ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. పెళ్ళి పిల్లల తరువాత కూడా నటనను వదలిపెట్టలేదు ప్రియాంక. హాలీవుడ్ లో నటిస్తూనే ఉంది. బోల్డ్ సీన్స్ చేయడానిని కూడా ఏమాత్రం వెనకాడటంలేదు బ్యూటీ. 

37
Priyanka chopra Ayodhya visit

ఇక అప్పుడప్పుడు ఇండియాను విజిట్ చేస్తుంటుంది ప్రియాంక చోప్రా. ఫ్యామిలీతో పాటు ఇండియాకు వచ్చి.. కొన్ని రోజులు స్పెండ్ చేయడం ఆమెకు అలవాటు. ఈక్రమంలో తాజాగా ఇండియాకు వచ్చిన ఆమె.. కొన్ని కార్యక్రమాలల్లో పాల్గొనడంతో పాటు.. అయోధ్య రామమందిరాన్ని కూడా దర్శించుకున్నారు. 
 

47
Priyanka chopra Ayodhya visit

భర్త నిక్ తో కలిసి సాంప్రదాయ దుస్తుల్లో కనిపించింది ప్రియాంక చోప్రా. భర్త, కూతురుతో పాటు.. తన కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్య రాముని దర్శనం చేసుకుంది. అయితే ప్రస్తుతం ఆమె అయోధ్య దర్శనం సమయంలో కట్టుకున్న చీర వైరల్ టాపిక్ అయ్యింది. ఇంతకీ ఆ చీరలో ప్రత్యకత ఏంటంటే.. ఆ చీర కాస్ట్. 

57

చాలా సింపుల్ గా ఉన్న ఏల్లో కలర్ శారీ.. ప్లెయిన్ గా చూడ్డానికి స్పెషల్ గా ఏమీ అనిపించలేదు. కాని కాస్ట్ తెలిస్తే మాత్రంషాక్ అయ్యేలా ఉంది ఇంతకీ ఆ చీర కాస్ట్  ఎంతో తెలుసా.. అక్షరాలా.. 63 వేల 800 రూపాయలు  అని సమాచారం. పూర్తిగా ఆర్గానిక్ మెటీరియల్ తో ఈ చీరను తయారు చేశారని అందువల్లే ఈ చీర ఖరీదు చాలా ఎక్కువని సమాచారం అందుతోంది. 

67

ఈ చీర కోసం వాడిన రంగులు, ఫ్యాబ్రిక్ కూడా ఆర్గానిక్ కావడం గమనార్హం. ప్రియాంక చోప్రా హిందూ సాంప్రదాయం పాటిస్తూ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.ప్రియాంక చోప్రా ధరించిన చీరను పది రోజుల పాటు కష్టపడి తయారు చేశారని సమాచారం అందుతోంది. 

77
Priyanka Chopra Jonas at Ayodhya temple

ప్రియాంక చోప్రా హిందూ సాంప్రదాయం పాటిస్తూ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రియాంక చోప్రాతో పాటు ఆమె భర్త, కూతురు సైతం బాలరాముడిని దర్శించుకోవడం విశేషం.

Read more Photos on
click me!

Recommended Stories