సీనియర్ హీరోయిన్ త్రిషపై ట్రోలింగ్.. మధ్యలో అది అవసరమా అంటూ.. ఆడేసుకుంటున్న నెటిజన్లు!

Published : Jan 09, 2023, 11:30 AM IST

సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష క్రిష్ణన్ (Trisha Krishnan) ప్రస్తుతం ట్రోలింగ్ కు గురవుతున్నారు. రీసెంట్ గా తను చేసిన సంచలన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.   

PREV
16
సీనియర్ హీరోయిన్ త్రిషపై ట్రోలింగ్.. మధ్యలో అది అవసరమా అంటూ.. ఆడేసుకుంటున్న నెటిజన్లు!

‘పొన్నియిన్ సెల్వన్ 1’తో సీనియర్ హీరోయిన్ త్రిష క్రిష్ణన్ కేరీర్  ఊపందుకుంది. ఈ చిత్రంలో కుందవైగా అలరించిన ఈ ముద్దుగుమ్మ అదే జోష్ తో మరిన్ని చిత్రాలతో ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతుతోంది. ఈ క్రమంలో ఆమె లైనప్ కూడా షాకింగ్ గా ఉంది.
 

26

గతేడాది డిసెంబర్ 30న త్రిష నటించిన తమిళం చిత్రం ‘రాంగి’ థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో మొన్నటి వరకు ఇంటర్నెట్ లో తెగ సందడి చేసింది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీసింది.
 

36

మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం? అని ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు త్రిష బదులిచ్చిస్తూ... ‘నాకు సౌత్ ఇండియన్ హోమ్ ఫుడ్ అంటే ఇష్టం. అందులో బ్రహ్మణుల ఇంటి భోజనాన్ని బాగా ఇష్టపడుతానని’ సమాధానం ఇచ్చింది. అయితే ఇందులో నచ్చిన ఫుడ్ చెప్పితే బాగుండేది కదా? అందులో కులాన్ని నొక్కి చెప్పడం ఎందుకు అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 

46

ఇష్టాయిష్టాలను తెలియజేయడంలో కులాన్ని తీసుకురావడం అనవసరమంటూ మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం తనకు అనిపించింది చెప్పింది. దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం ఏమాత్రం సరికాదంటూ అభిప్రాయపడుతున్నారు. సెలబ్రైటీ అయినంత మాత్రానా ప్రతిదానికి విమర్శలు గుప్పించడం సబబు కాదంటున్నారు త్రిష ఫ్యాన్స్. 
 

56

ఇక తమిళ బ్యూటీ త్రిష తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో సుపరిచితం. కొన్నేండ్ల పాటు టాలీవుడ్ ను ఊపూపేసింది ‘కుందవై’. రీసెంట్ గానే 20 ఏండ్ల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్న త్రిష ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలెట్టింది. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. 

66

ప్రస్తుతం సతురంగ వేట్టై పార్ట్ 2, రామ్ పార్ట్ 1, పొన్నియిన్ సెల్వన్ 2, ది రోడ్ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అలాగే ఇళయదళపతి విజయ్ 67వ చిత్రం, అజిత్ కుమార్ 62వ చిత్రంలో నటించబోతుందని తెలుస్తోంది. ఇక రీసెంట్ గా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సరసనా నటించాలని ఉందనడం ఆసక్తికరంగా మారింది. మున్ముందు నటించే ఛాన్స్ ఉందటూ అభిప్రాయపడుతున్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories