ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా విడుదలైన సాంగ్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ చిత్రం సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హారర్ కామెడీ జోనర్ లో రూపొందుతోంది. ఈ మూవీలో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లు.
25
వైరల్ అవుతున్న సాంగ్
సంక్రాంతికి రిలీజ్ కావడంతో ది రాజా సాబ్ మూవీ ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇటీవల తొలి సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. రీసెంట్ గా సెకండ్ సాంగ్ విడుదలైంది. సహానా సహానా అంటూ సాగే ఈ పాట ట్యూన్ బాగా ఆకట్టుకుంటోంది. నిధి అగర్వాల్ ని ఈ సాంగ్ లో గ్లామరస్ గా చూపించారు. తమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ బాగా వైరల్ అయింది. కానీ ఒక విషయంలో అభిమానులకు, ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు.
35
ప్రభాస్ పై ట్రోలింగ్
ఈ సాంగ్ లో ప్రభాస్ లుక్స్, డ్యాన్స్ విషయంలో అభిమానులు డిసప్పాయింట్ అవుతున్నారు. ప్రభాస్ లుక్స్, కాస్ట్యూమ్స్ అంతగా ఆకట్టుకోవడం లేదు అని అంటున్నారు. ముఖ్యంగా క్లోజప్ షాట్స్ లో ప్రభాస్ లుక్స్ పై ట్రోలింగ్ జరుగుతోంది.
అదే విధంగా ప్రభాస్ డ్యాన్స్ లో గ్రేస్ కనిపించడం లేదని అంటున్నారు. వర్షం, డార్లింగ్, ఛత్రపతి లాంటి సినిమాల్లో పాటలని బయటకి తీసి కంపారిజన్స్ మొదలు పెట్టేశారు. యాంటీ ఫాన్స్ లో ఈ ట్రోలింగ్ ఎక్కువగా ఉంది. అయితే ప్రభాస్ అభిమానులు మాత్రం సమర్ధిస్తున్నారు.
55
ప్రభాస్ కి మోకాలి సమస్య
ప్రభాస్ కొంతకాలంగా మోకాలి సమస్యలతో బాధపడుతున్నారు.ట్రీట్మెంట్ జరిగినట్లు కూడా వార్తలు వచ్చాయి. అలాంటప్పుడు స్పీడ్ గా డ్యాన్స్ చేయడం పాజిబుల్ కాదు అనేది అభిమానుల వాదన. మొత్తంగా రాజా సాబ్ సాంగ్ పై మాత్రం ట్రోలింగ్ తప్పడం లేదు. ఇది హారర్ కామెడీ చిత్రం కాబట్టి ప్రభాస్ లుక్ ని ముందు నుంచి డిఫెరెంట్ గా ప్రజెంట్ చేస్తున్నారు.