నరేష్-పవిత్ర లోకేష్‌ వివాదంలో పవన్‌ కళ్యాణ్‌పై ట్రోలింగ్‌.. ఆ స్పీచ్‌ని షేర్‌ చేస్తూ దారుణంగా కామెంట్లు

Published : Jul 04, 2022, 08:26 PM ISTUpdated : Jul 04, 2022, 08:28 PM IST

నటుడు వీకే నరేష్‌ భార్యల వ్యవహారం ఇప్పుడు ఇటు తెలుగునాట, అటు కన్నడలో హాట్‌ టాపిక్‌ అవుతుంది. వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ ట్రోల్‌కి గురి కావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

PREV
17
నరేష్-పవిత్ర లోకేష్‌ వివాదంలో  పవన్‌ కళ్యాణ్‌పై ట్రోలింగ్‌.. ఆ స్పీచ్‌ని షేర్‌ చేస్తూ దారుణంగా కామెంట్లు

నటుడు వీకే నరేష్‌ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. ముగ్గురు భార్యలు విడిపోయారు. మూడో భార్య రమ్య రఘుపతితో ఇంకా విడాకుల విషయం ఇంకా ఫైనల్‌ కాలేదు. మరోవైపు ప్రస్తుతం నరేష్‌ నటి పవిత్రతో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతుంది. 
 

27

నరేష్‌-పవిత్రలు ఇటీవల మ్యారేజ్‌ చేసుకున్నారని, త్వరలో మ్యారేజ్‌ చేసుకోబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. దీంతో విషయం తెలుసుకుని బయటకు వచ్చింది నరేష్‌ మూడో భార్య రమ్య రఘుపతి. ఆయన తల్లి విజయ నిర్మలకు మాటిచ్చానని, నరేష్‌ని వదిలే ప్రసక్తే లేదని తెలిపింది. పవిత్ర తమ లైఫ్‌లోకి వచ్చి నరేష్‌కి తనకు మధ్య చిచ్చు పెట్టిందని, తమని విడిపోయేలా చేసిందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. బెంగుళూరులో ఓ హోటల్‌లో ఏకంగా పవిత్రపై రమ్య రఘుపతి చెప్పుతో కొట్టేందుకు సిద్ధమయ్యింది. 
 

37

మరోవైపు ఈ విషయంలో నరేష్ వ్యవహరించిన తీరు పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ముగ్గురికి హ్యాండిచ్చి ఇప్పుడు మరో నటితో పెళ్లికి సిద్ధపడటం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన పవిత్రతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగడం హాట్‌ టాపిక్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ని ఈ వివాదంలోకి లాగడం సంచలనంగా మారింది. పవన్‌తో ముడిపెడుతూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. 
 

47

పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల నాని హీరోగా నటించిన `అంటే సుందరానికి` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి గెస్ట్ గా హాజరయ్యారు.`అంటే సుందరానికి` సినిమాలో నరేష్‌ కీలక పాత్ర పోషించారు. దీంతో సినిమాలో నటించిన నటీనటుల గురించి కూడా పవన్‌ మాట్లాడారు. అందులో భాగంగా నరేష్‌ ప్రస్తావన వచ్చింది.  ఈ సందర్భంగా నరేష్‌పై పవన్‌ ప్రశంసలు కురిపించారు. 

57

నరేష్‌ అంటే తనకు చాలా గౌరవమని తెలిపారు పవన్‌. ఆయనది గొప్ప వ్యక్తిత్వమని, తాను సినిమాల్లోకి రాకముందు నుంచి నరేష్‌ తెలుసని, చెన్నైలో పక్క పక్కనే ఉండేవాళ్లమని చెప్పారు. ఆయన వ్యక్తిత్వం చాలా బలమైనదని, నరేష్‌ నటన బాగుంటుందని ప్రశంసలు కురిపించారు. ఆకాశానికి ఎత్తేశారు. నరేష్‌పై పవన్‌ ఈ స్థాయిలో ప్రశంసలు కురిపించడం మెగా ఫ్యాన్స్ ని షాక్‌కి గురి చేసింది.

67

ఎందుకుంటే గత `మా` ఎన్నికల సమయంలో నరేష్‌ మెగా ఫ్యామిలీ వర్గం(ప్రకాష్‌ రాజ్‌)కి వ్యతిరేకంగా మాట్లాడారు. వ్యతిరేకంగా క్యాంపెయిన్‌ చేపట్టారు. బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. పవన్‌పైన కూడా నరేష్‌ పలు విమర్శలు చేశారు. దీంతో ఆ సమయంలో నరేష్‌కి, మెగా ఫ్యామిలీ మధ్య వార్‌లాగా సాగింది. కానీ `అంటే సుందరానికి` ఈవెంట్‌లో మాత్రం వాటిని పక్కన పెట్టి పవన్‌ ప్రశంసలు కురిపించడం హాట్‌ టాపిక్‌ అయ్యింది. 
 

77

ఇప్పుడు నరేష్‌ పెళ్లిళ్ల వివాదం దుమారం రేపుతున్న నేపథ్యంలో పవన్‌ స్పీచ్‌ని బయటకు తీసి ట్రోల్స్ చేస్తున్నారు ట్రోలర్స్. పవన్‌ కూడా ఇప్పటికే ఇద్దరికి విడాకులిచ్చిన నేపథ్యంలో ఆ విషయాన్ని ముడిపెడుతూ ఆడుకుంటున్నారు. ఇద్దరికి ఇద్దరు బాగా సెట్‌ అయ్యారని కొందరు, ఇలాంటి వ్యక్తిగా మీరు పొగిడేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒక రేంజ్‌లో ఆడుకుంటున్నారు. దీంతో ఇప్పుడిది మరింత హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories