వెకేషన్‌లో జాన్వీ అన్‌లిమిటెడ్ ఎంజాయ్‌.. డిఫరెంట్‌ లుక్స్ లో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న స్టార్‌ కిడ్‌..

Published : Jul 04, 2022, 05:43 PM IST

జాన్వీ కపూర్ బోల్డ్ బ్యూటీగా బాలీవుడ్‌లో పాపులారిటీని సొంతం చేసుకుంది. తెలుగులో సినిమాలు చేయకపోయినా, కేవలం ఆమె హాట్‌ ఫోటోలతో, టాలీవుడ్‌ ఎంట్రీ అనే రూమర్స్ తోనే ఇక్కడ పాపులారిటీ కావడం విశేషం.   

PREV
17
వెకేషన్‌లో జాన్వీ అన్‌లిమిటెడ్ ఎంజాయ్‌.. డిఫరెంట్‌ లుక్స్ లో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న స్టార్‌ కిడ్‌..

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్‌(Janhvi Kapoor) గ్లామర్‌ ఫోటోలతో రెచ్చిపోతుంది. ప్రతి వారంలో ఒకటి రెండు సార్లు ఫోటో షూట్‌ పిక్స్ పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. సోషల్‌ మీడియా ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటుంది. నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది. కానీ చాలా వరకు హాట్‌ ఫోటోలతో మెప్పించే ఈ భామ వెకేషన్‌ పిక్స్ కూడా పంచుకుంటోంది. 

27

జాన్వీ కపూర్ తాజాగా వెకేషన్‌లో (Janhvi Kapoor Vacation) ఎంజాయ్‌ చేస్తుంది. తన ఫ్రెండ్స్ తో కలిసి అన్‌లిమిటెడ్‌గా ఆనందిస్తుంది జాన్వీ. తాజాగా ఆమె నెదర్లాండ్‌లో వెకేషన్‌ని గడుపుతుంది. నెదర్లాండ్‌ క్యాపిటల్‌ సిటీ అమ్ట్సర్‌ డమ్‌లో సరదాగా గడుపుతుంది. వెకేషన్‌ మూడ్‌లో ఫుల్‌ బిజీగా ఉంది. ఈ సందర్భంగా అక్కడ దిగిన అందమైన లొకేషన్‌ ఫోటోలను, తన పిక్స్ ని షేర్‌ చేసింది జాన్వీ. 
 

37

ఇందులో ఫ్రెండ్స్ తో కలిసి బ్రంచ్‌ చేస్తున్న సమయంలో దిగిన పిక్స్ ని, టేబుల్ వద్ద కూర్చొని హాట్‌ పోజులిస్తున్న పిక్స్ ని షేర్‌ చేసింది. మరోవైపు ఓ గ్యాలరీ వద్ద కొంటెగా పోజులిచ్చింది. ఇంకో చోట డిఫరెంట్‌ హెయిర్‌ స్టయిల్‌లో క్యూట్‌ పోజులిచ్చింది. ఇలా విభిన్న డ్రెస్సులో, భిన్నమైన స్టిల్స్ తో ఆకట్టుకుంటుంది జాన్వీ. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 
 

47

ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు సంబంధించిన ప్రతి విషయం పంచుకుంటుంది జాన్వీ కపూర్‌. తను ఏం చేసినా అది అభిమానులతో షేర్‌ చేసుకోవాల్సిందే అనేట్టుగా ఆమె తన అప్‌డేట్స్ ని ఇస్తుంటుంది. అలా ఫ్యాన్స్‌ కి నిత్యం టచ్‌లో ఉంటుంది. వారిని అందమైన ఫోటోలతో అలరిస్తుంది. అందుకే ఈ బ్యూటీకి సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్‌. 
 

57

అయితే తెలుగులోనూ జాన్వీకి మంచి ఫాలోయింగ్‌ ఉండటం విశేషం. తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ స్టార్‌ హీరోయిన్ల రేంజ్‌ ఫాలోయింగ్‌. లక్షలాది మంది అభిమానులు ఆమెని ఫాలో అవుతుంటారు. కారణం ఆమె పంచుకునే గ్లామర్‌ ఫోటోలే అని చెప్పొచ్చు. బోల్డ్ పిక్స్ ని అంతే బోల్డ్ గా పంచుకుంటూ వారిని అలరిస్తుంది. అభిమానులుగా చేసుకుంటుంది. 
 

67

దీనికితోడు జాన్వీ.. అతిలోకసుందరి శ్రీదేవి తనయ కావడం కూడా ఈ స్థాయి ఫాలోయింగ్‌కి ఓ కారణం చెప్పొచ్చు. మరోవైపు ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలనేది మరో కారణంగా చెప్పాలి. గత రెండేళ్లుగా జాన్వీ తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుందని, ఆ సినిమాలో, ఈ సినిమాలో అంటూ రూమర్స్ వైరల్‌ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఏదీ ఫైనల్‌ కాలేదు కానీ, ఆమె చేయబోతుందనే వార్తలే తెలుగు ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఆమెకి ఫాలోవర్స్ గా మార్చేశాయి. 

77

ప్రస్తుతం సినిమాల పరంగానూ జాన్వీ బిజీగా ఉంది. అందులో భాగంగా `గుడ్‌ లక్‌ జెర్రీ`, `మిలి`, `మిస్టర్‌ అండ్‌ మిస్టర్‌ మహి`, `బవాల్‌` చిత్రాల్లో నటిస్తుంది జాన్వీ కపూర్‌. ఆమె నటిస్తున్న చిత్రాల్లో `బవాల్‌` ఒక్కటే భారీ సినిమా కావడం గమనార్హం. ఇదిలా ఉంటే తెలుగులోకి ఆమె `ఎన్టీఆర్‌30` చిత్రంలో నటించబోతున్నట్టు సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories