మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, న్యూ ఇయర్ కోసం ఫారెన్ లో మన స్టార్స్, ఎక్కడికెళ్లారంటే..?

Published : Dec 31, 2023, 07:45 AM IST

2024 కొత్త ఏడాది కోటి ఆశలతో స్వాగతం పలకడానికి అంతా ఎదరుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఈ వేడుకలు ఉత్సవాలు ప్రారంభం కాబోతుండగా.. మన తెలుగు తారలు కొంత మంది న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడం కోసం విదేశాలకు క్యూ కట్టారు. ఇంతకీ ఎవరెవరు ఎక్కడికెళ్తారంటే..?  

PREV
17
మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, న్యూ ఇయర్ కోసం ఫారెన్ లో మన  స్టార్స్,  ఎక్కడికెళ్లారంటే..?

కొత్త ఏడాది కోసం ఎదరు చూస్తున్న సామాన్య ప్రజలు వారి స్థాయికి తగ్గట్టు ఎంజాయ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక స్టార్ సెలబ్రిటీలు మాత్రం న్యూఇయర్ కు వెల్కం చెప్పడానికి విదేశాలకు చెక్కేశారు.ఇప్పటికే తమన తెలుగు తారలు చాలామంది ఫారెన్ ప్లైట్ ఎక్కడం దిగడం కూడా అయిపోయింది. ఇంతకీ ఎవరెవరు ఎక్కడకి వెళ్ళారో తెలుసా..? 

27

పక్క ఊరికి పని మీద వెళ్ళి వచ్చినట్టుగా ఫారెన్ వెళ్ళి వస్తుంటాడు మహేష్ బాబు. అటువంటిది న్యూ ఇయర్ అంటే ఎలా ఉండాలి. అందుకే ఇప్పటికే తన  కొత్త ఏడాది పండుగను దుబాయ్ లో సెలబ్రేట్ చేసుకోవడంకోసం వెళ్ళిపోయాడు. ఎలాగు  గుంటూరు కారం షూటింగ్‌ అయిపోయింది. అందుకే.. ఈ ఇయర్‌ ఎండ్‌ను బాగా సెలబ్రేట్‌ చేసుకోవాలని అనుకున్నాట. ఇక దుబయ్ లో పనిలో పనిగా ఓ యాడ్ షూటింగ్ కూడా ప్లాన్ చేశాడట మహేష్ బాబు. 

37

కొత్త ఏడాదికి స్వాగతం పలకడం కోసం అందరికంటే ముందే బయలుదేరాడు  ఎన్టీఆర్‌. న్యూ ఇయర్ కోసం ఆయన ఫ్యామిలీతో  ఇప్పటికే జపాన్‌ వెళ్లిపోయాడు. అక్కడ తారక్‌కు జపనీయులు అందించిన ఆహ్వానం వీడియోలు సోషల్‌ మీడియాలో ఇప్పటికే వైరల్‌ అయ్యాయి కూడా. మొత్తం కుటుంబంతో జపాన్‌లో నాలుగైదు రోజులు ముందు నుంచే ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాడు తారక్. 

47

ఇక న్యూ ఇయర్ వేడుకల కోసం కాస్త ముందుగా వెళ్లినవారిలో అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. ఆయన ఇప్పటికే భార్య ఇద్దరు పిల్లలతో దూబాయ్ లో లాండ్ అయ్యాడు. అంతే కాదు నాలుగైదు రోజుల ముందు నుంచే.. వారు అక్కడ ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ను అప్ లోడ్ చేస్తున్నారు. ఇక న్యూ ఇయర్ కోసం అక్కడ గ్రాండ్ గా ప్లాన్ చేశాడట ఐకాన్ స్టార్. 

57

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ న్యూ ఇయర్ వేడుకలపైనే క్లారిటీ లేదు. ఆయన ఎక్కడ సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అన్నది తెలియడం లేదు. ఫ్యామిలీతో రామ్ చరణ్ ఇంకా ముంబయ్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది. కొంతమంది మాత్రం లేదు ఆయన హైదరాబాద్ వచ్చాడు. గేమ్ చేంజర్ షూటింగ్ లో ఉ న్నాడు అంటున్నారు. మరి చరణ్ న్యూ ఇయర్ ఇండియాలోనే చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. 

67

ఇక టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను ఫారెన్ లోనే చేసుకున్నాడు. ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్ లో ఫ్యామిలీ స్టార్ మూవీ చేస్తున్నాడు విజయ్. ఈమూవీ షూటింగ్ కోసం చాలా రోజులుగా వారు అమెరికాలోనే ఉన్నారు. దాంతో తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా అక్కడే ప్లాన్ చేశారట. ఇక న్యూయార్క్ లో..న్యూ ఇయర్ కు వెల్కం చెప్పబోతున్నాడు రౌడీ హీరో. 

77
vishal

ఇక హీరో  విశాల్‌ అయితే ఇప్పటికే న్యూయార్క్‌లో ఉన్నాడు. ప్రతీ ఏడాది లాగానే ఈసారి కూడా ఇయర్ఎండ్ కోసం ఫ్యామిలీతో కలిసి అమెరికా వెళ్ళాడు. అంతే కాదు.. అక్కడ రీసెంట్ గా ఓ ఫ్రాంక్ వీడియో చేసి  సందడి చేశాడు కూడా. ఇక హీరోలు.. హీరోయిన్లు.. బాలీవుడ్ స్టార్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతా నూతన ఏడాదిని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఇప్పటి విదేశాలకు చెక్కేశారు. 
 
 

Read more Photos on
click me!

Recommended Stories