పవన్ కళ్యాణ్ కోసం కొన్న ఓ సినిమా రీమేక్ హక్కుల ధరపై త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్హేలర్ కోసం రెండున్నర కోట్లు ఖర్చు చేశారట. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా కాలం తర్వాత ఓజీ లాంటి బిగ్ హిట్ పడింది. దీనితో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కమిటై పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు ఒక్కటే. అదే ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ అవుతుందని నిర్మాతలు క్లారిటీ ఇచ్చేశారు. ఇది మినహా పవన్ కళ్యాణ్ ఏ ఇతర చిత్రానికి అధికారికంగా కమిట్ కాలేదు.
25
అభిమానుల ఆకలి తీర్చిన గబ్బర్ సింగ్
పవన్ కళ్యాణ్ గతంలో వరుస పరాజయాల్లో ఉన్నప్పుడు అభిమానులని ఉక్కిరి బిక్కిరి చేసే సంతోషంలో ముంచేసిన చిత్రం గబ్బర్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. పదేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న పవన్ అభిమానుల ఆకలి తీర్చిన చిత్రం ఇది.
35
త్రివిక్రమ్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్
ఈ మూవీ గురించి డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. గబ్బర్ సింగ్ చిత్రానికి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అని ప్రశ్నించగా.. హరీష్ శంకర్ సమాధానం ఇచ్చారు. గబ్బర్ సింగ్ మూవీకి త్రివిక్రమ్ గారి నుంచి మంచి కాంప్లిమెంట్ వచ్చింది. ఆయనతో కలిసి మేమంతా సినిమా చూశాం. మూవీ చూసిన తర్వాత త్రివిక్రమ్ గారు మాట్లాడుతూ.. దబాంగ్ చిత్రంలో హీరో తల్లి వాడే ఆస్తమా ఇన్హేలర్ తప్ప ఇంకేమీ మీరు కథలో తీసుకోలేదు. మొత్తం మార్చేశారు.
కేవలం ఇన్హేలర్ కోసం ఎందుకయ్యా రీమేక్ రైట్స్ రెండున్నర కోట్లు పెట్టి కొన్నారు అని త్రివిక్రమ్ అన్నారు. అది తనకు బెస్ట్ కాంప్లిమెంట్ అనిపించింది అని హరీష్ శంకర్ తెలిపారు.
55
మూడు రోజులు కళ్యాణ్ గారు కనిపించలేదు
గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యాక పవన్ కళ్యాణ్ గారు మూడు రోజుల పాటు మాకు కనిపించలేదు. అసలు ఈయనకి సినిమా హిట్ అయింది అనే విషయం తెలుసా లేదా అని ఎదురుచూస్తున్నాం. మూడు రోజుల తర్వాత వెళ్లి ఆయన్ని కలిశాం. గబ్బర్ సింగ్ రిలీజైన రోజు ఉదయాన్నే ప్రొద్దుటూరు నుంచి మా ఫైనాన్షియర్ శోభన్ అనే వ్యక్తి ఫోన్ చేశారు. డైరెక్టర్ గారు బ్లాక్ బస్టర్ కొట్టేశాం అని ఫోన్ లో గట్టిగా అరిచాడు. ఆ మాటతో నా బ్రెయిన్ లో హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయింది అని హరీష్ గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.