Trivikram: ఎన్టీఆర్‌ విషయంలో తప్పు ఒప్పుకున్న త్రివిక్రమ్‌.. అరవింద సమేతలో బ్లండర్‌ ఇదే

Published : Oct 26, 2026, 07:02 PM IST

Trivikram: త్రివిక్రమ్‌.. తాను రూపొందించిన `అరవింద సమేత` సినిమా విషయంలో జరిగిన మిస్టేక్‌ని వెల్లడించారు. ఎన్టీఆర్‌పై ఆ పాటని పెట్టడం తప్పే ఆయన ఒప్పుకున్నారు.

PREV
14
అరవింద సమేతలో మిస్టేక్

త్రివిక్రమ్‌.. ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో `అరవింద సమేత వీర రాఘవ` అనే చిత్రం రూపొందింది. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఈ చిత్రం విడుదలైంది. ఎన్టీఆర్‌ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఈషా రెబ్బా, నాగబాబు, ఈశ్వరీరావు, రావు రమేష్‌, నవీన్‌ చంద్ర, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. ఫ్యాక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించుకుంది. కాకపోతే ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదనే టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాలో ఒక బ్లండర్‌ చోటు చేసుకుంది. తాజాగా ఆ విషయాన్ని ఒప్పుకున్నాడు త్రివిక్రమ్‌. జరిగిన తప్పు నిజమే అని వెల్లడించారు.

24
ఆదర్శ కుటుంబంతో రాబోతున్న త్రివిక్రమ్‌

త్రివిక్రమ్‌ ప్రస్తుతం `ఆదర్శ కుటుంబం` మూవీని రూపొందించారు. వెంకటేష్‌ హీరోగా రూపొందిన చిత్రమిది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 30న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా త్రివిక్రమ్‌.. జగపతిబాబు హోస్ట్ గా చేస్తున్న `జయమ్ము నిశ్చయమ్మురా` అనే టాక్‌ షోలో పాల్గొన్నారు. ఇందులో `అరవింద సమేత` మూవీకి సంబంధించిన చర్చ జరిగింది. ఇందులో ఎన్టీఆర్‌ విషయంలో జరిగిన తప్పుని త్రివిక్రమ్‌ వెల్లడించారు. తప్పుని ఒప్పుకున్నారు.

34
ఎన్టీఆర్‌ పై పాట తప్పే

సినిమాలో ఎన్టీఆర్‌ కి నాన్నగా చేసిన నాగబాబు పాత్ర చనిపోతుంది. అనంతరం భర్త పోయిన బాధలో వాళ్ల అమ్మ ఉంటుంది. చాలా బాధపడుతుంది. ఇళ్లు మొత్తం నిర్మానుష్యంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితిలో పెనిమిటి సాంగ్‌ వస్తుంది. పాట బాగుంది. కానీ ఆ పాట ఎన్టీఆర్‌పై ఉంది. ఎన్టీఆర్‌ పాడుతున్నట్టుగా ఉంది. పెనిమిటి సాంగ్‌ భార్యపై ఉండాలి, అంటే వాళ్ల అమ్మ పాత్రపై ఉండాలి, కానీ ఎన్టీఆర్‌పై ఆ పాటని చిత్రీకరించారు. ఎన్టీఆర్‌ పాడుతున్నట్టుగా పెట్టారు. దీనిపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఇన్నాళ్లకి త్రివిక్రమ్‌ స్పందించారు. ఆ పాట విషయంలో తప్పు జరిగిందని తెలిపారు.

44
అరవింద సమేతలో మిస్టేక్‌ జరిగింది నిజమే

జగపతిబాబు మాట్లాడుతూ, `అరవింద సమేతలో పెనిమిటి సాంగ్‌ భార్యకి పెట్టి ఉండాల్సింది అని అనగా, ఆ అవును సార్‌, అది మిస్టేక్‌ జరిగింది. ఇంకా బాగా చేసి ఉండాల్సింది. సరిగా చేయలేకపోయాను. కానీ తారక్‌ ట్రాన్స్ ఫార్మర్‌ కదా, పవర్‌ హౌజ్‌ అని నవ్వుతూ కవర్‌ చేశారు త్రివిక్రమ్‌. మొత్తంగా ఆ సినిమా విషయంలో, ఎన్టీఆర్‌ విషయంలో జరిగిన తప్పుని ఒప్పుకున్నారు త్రివిక్రమ్‌. ఆ తప్పుని కూడా హుందాగా ఒప్పుకోవడం మాటల మాంత్రికుడి గొప్పతనం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories