స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, పట్టు చీర ధరించి త్రిష సూపర్‌ క్యూట్‌.. అందంలో కుర్ర హీరోయిన్లకే జెలసీ పుట్టిస్తుందిగా

Published : May 03, 2023, 02:54 PM ISTUpdated : May 03, 2023, 03:53 PM IST

త్రిష టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రారంభంలో ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడే మరింత యంగ్ గా, అందంగా మారడం విశేషం.  దీంతో కుర్ర భామ జెలసీ పుట్టిస్తుందీ సీనియర్‌ బ్యూటీ.  

PREV
17
స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, పట్టు చీర ధరించి త్రిష సూపర్‌ క్యూట్‌.. అందంలో కుర్ర హీరోయిన్లకే జెలసీ పుట్టిస్తుందిగా

`పొన్నియిన్‌ సెల్వన్‌ 2` చిత్రం కోసం చాలా రోజుల తర్వాత బయటకొచ్చింది త్రిష. ఆమె వరుసగా సందడి చేస్తుంది. ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్ ని అలరిస్తుంది. సోషల్ మీడియాలో హాల్‌ చల్‌ చేస్తుంది. 
 

27

ప్రస్తుతం ఈ బ్యూటీ `పొన్నియిన్‌ సెల్వన్‌ 2` ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఈ సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వస్తోన్న నేపథ్యంలో త్రిష కూడా మరింత ప్రమోషన్స్ జోరు పెంచింది. తనకు చాలాకాలం తర్వాత మంచి ప్రాజెక్ట్ కావడంతో చురుకుగ్గా పాల్గొంటుంది త్రిష. సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. 
 

37

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ చీరలో మెరిసింది. పింక్‌ కలర్‌ పట్టు చీరలో ఆమె హోయలు పోయింది. సిగ్గులొలికిస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌, సిల్క్ చీరలో ఆమె అందం మరింత క్యూట్‌గా తయారయ్యింది. మరింత యంగ్‌గా కనిపిస్తుంది త్రిష. ఓ రకంగా కుర్ర హీరోయిన్లకి జెలసీ పుట్టిస్తుందని చెప్పొచ్చు. 
 

47

త్రిష తెలుగులోకి `నీ మనసు నాకు తెలుసు` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. కానీ పెద్దగా పేరురాలేదు. త్రిషని పెద్దగా గుర్తించలేదు. ప్రభాస్‌తో కలిసి నటించిన `వర్షం` చిత్రంతో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యింది. తెలుగింటి అమ్మాయిలానే ఉండటంతో అక్కున చేర్చుకున్నారు. దీంతో కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ గా మారింది త్రిష. 
 

57

అయితే ఈ బ్యూటీ తెలుగులో చాలా సెలక్టీవ్‌గానే సినిమాలు చేసింది. సిద్ధార్థ్‌తో `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`, మహేష్‌తో`అతడు`, `సైనికుడు`, నితిన్‌తో `అల్లరి బుల్లోడు`, ప్రభాస్‌తో `పౌర్ణమి`, `బుజ్జిగాడు`, చిరంజీతో `స్టాలిన్‌`, వెంకటేష్‌తో `ఆడవారి మాటలకు అర్థాలు వేరులే`, `నమో వెంకటేశా`, `బాడీ గార్డ్`, రవితేజతో `కృష్ణ`,  నాగార్జునతో `కింగ్‌`, గోపీచంద్‌తో `శంఖం`, పవన్‌తో `తీన్‌ మార్‌`, ఎన్టీఆర్‌తో `దమ్ము`, బాలయ్యతో `లయన్‌` చిత్రాలు చేసింది. ఇప్పుడు మళ్లీ `పొన్నియిన్‌ సెల్వన్‌`తో తెలుగు ఆడియెన్స్ ని పలకరించింది. 
 

67

త్రిష.. `వర్షం` సినిమా టైమ్‌లో ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. ఏమాత్రం బరువు పెరగలేదు. పైగా అందం, క్యూట్‌నెస్‌ పెరిగింది. ఇప్పుడిప్పుడే వస్తున్న కుర్ర హీరోయిన్లకి మించిన అందంతో ఆకట్టుకుంటుంది. ఓ రకంగా ఇతర హీరోయిన్లకి జలసీ పుట్టిస్తుందీ అందాల భామ.
 

77

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయ్యింది. ఆమె చేతిలో మలయాళంలో `రామ్‌`, విజయ్‌ `లియో`, `సథురంగ వెట్టై 2`, `ది రోడ్‌`వంటి సినిమాలున్నాయి. ఇప్పుడు మరోసారి తన జోరు చూపించబోతుందీ సీనియర్‌ భామ.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories