#Trisha: బుద్దిలేదా నాపైన పడి ఏడుస్తున్నారు... ఇదేమైనా జాతీయ సమస్య అంటూ.. మండిపడిన త్రిష, కారణం ఎంటీ..?

Published : Dec 01, 2023, 10:44 AM IST

అసలు మీకు బుద్ది ఉందా..? ఇలాంటి పనులు ఎలా చేయగలుగుతున్నారు. అడ్డమైన రాతలు రాస్తే ఊరుకోవాలా..? నావయస్సుతో మీకేంటి పని.. దాని వల్ల మన ఆర్ధిక వ్యవస్త ఏమైనా ఇబ్బందులుపడుతుందా.. అంటూ విరుచుకుపడింది త్రిష. ఇంతకీ చెన్నై చందమామకు అంత కోపం ఎందుకు వచ్చింది. 

PREV
16
#Trisha: బుద్దిలేదా నాపైన పడి ఏడుస్తున్నారు... ఇదేమైనా జాతీయ సమస్య అంటూ.. మండిపడిన త్రిష, కారణం ఎంటీ..?
Trisha

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని..మరీ ముఖ్యంగా తమిళ,తెలుగు సినీ పరిశ్రమను ఒక ఊపు ఊపేసింది చెన్నై చిన్నది త్రిష. యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ సీనియర్ హీరోల వరకూ అందరి సరసన నటించి మెప్పించింది బ్యూటీ. హీరోయిన్ గా ఫెయిడ్ అవుటు అయితే.. ఇక క్యారెక్టర్ రోల్స్ చేయడమే కాని మరసారి హీరోయిన్ గాసెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సంచలన సృఫ్టించింది బ్యూటీ.
 

26

మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ సినిమాతో అందరిని ఆకట్టుకుంది బ్యూటీ. ఆసినిమాలో త్రిషను చూసిన అభిమనులే కాదు..మేకర్స్ కూడా ఫిదా అయ్యారు. దాంతో వరుసగా అవకాశాలు ఆమె ఓడిలో వాలిపోయాయి.  వెంటనే దళపతి విజయ్ సరసన లియో సినిమాలో నటించేసింది చిన్నది. ఇక 20 ఏళ్ల తరువాత ఈజోడి మళ్లీ కలిసింది. ఈసినిమాకూడా సూపర్ హిట్ అవ్వడంతో త్రిషను వరుస అవకాశాలు చుట్టు ముట్టేశాయి. 

36
actress trisha krishnan to get married soon with malayalam producer reports nsn

ఇక ప్రస్తుతం బాలయ్య , బాబీ సినిమాలో కూడా త్రిష నటిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా త్రిష వయస్సు 40 దాటినా.. ఇంకా హీరోయిన్ గా అవకాశాలు రావడంపై సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ఇక మరికొంత మంది మాత్రం త్రిషను ట్రోల్ చేస్తున్నారు. చాలా కాలం ఆ ట్రోల్స్ విన్న త్రిష స్పందించలేదు. కాని రీసెంట్ గా ఆ కామెంట్స్ కు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు త్రిష.  

46

 దేశంలో మరో సమస్య లేనట్టు, మరో వార్తే లేనట్టు  నా వయసు గురించి చర్చ పెడుతున్నారు..  ఇప్పుడు నా వయసు జాతీయ సమస్యగా మారింది. నాకు 40 ఏళ్లు రావడంతో దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలయ్యింది. వీళ్లు రాసే రాతలు, వీడియోలు అలాగే ఉన్నాయి మరి. వేరే సమస్య లేనట్టు చివరకు నా వయసు గురించి చెత్త రాతలు రాయడమేమిటి? మీకు సిగ్గనిపించడం లేదా?' అని సోషల్‌ మీడియాపై మండిపడింది. 

56

తన వయసు గురించి ఈ మధ్యన సామాజిక మాధ్యమాలలో కొందరు చేసిన వ్యాఖ్యలకు త్రిష ఘాటుగా స్పందించారు. 'బుద్ధిలేనివాళ్లు చేసే పిచ్చిపనులు ఇవి. ఇలాంటి చెత్త రాతలను మొదట్లో పట్టించుకోకూడదనే అనుకున్నాను. కానీ ఆ చెత్త రాతలు ఆగేలాలేవు. అందుకే రియాక్టవ్వాల్సి వచ్చింది అని క్లారిటీ కూడా ఇచ్చారు త్రిష. 

66

ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో 40 ఏళ్లు దాటిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. నేనే ఫస్ట్ హీరయిన్ కాదు.. ఇప్పటికీ నాకు అవకాశాలు రావడం కొందరికి నచ్చడంలేదు. నాపై ఈర్షగా  ఉన్నారు అందుకే పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు. నేను నటిని.. ఆఖరిశ్వాస ఉన్నంతవరకు నటిస్తూనే ఉంటాను. నటనకు వయసుకు సంబంధం ఏమిటి? ఆ మాత్రం తెలివి లేకపోతే ఎలా అంటూ ఎమోషనల్ అయ్యారు త్రిష.

Read more Photos on
click me!

Recommended Stories