అదిరిపోయే శారీలో త్రిష గ్లామర్ మెరుపులు.. సీనియర్ నటి మత్తు చూపులకు మైకమే!

First Published | Feb 2, 2023, 6:15 PM IST

సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan) సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతోంది. చీరకట్టు అందాలతో అభిమానులతో పాటు నెటిజన్లను కట్డిపడేస్తోంది. త్రిష లేటెస్ట్ ఫొటోస్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

తమిళ బ్యూటీ, సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ప్రస్తుతం కేరీర్ లో మరింత జోరు కనబరుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలను అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తున్నారు. 
 

వరుస సినిమాలను ప్రకటించడంతో పాటు నెట్టింట గ్లామర్ మెరుపులతోనూ మెస్మరైజ్ చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది.  ట్రెడిషనల్ లుక్ లో మెరుస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 


తాజాగా గోల్డ్ కలర్ పట్టు శారీలో త్రిష ఆకట్టుకుంటున్నారు. మత్తు చూపులు, మైమరిపించే పోజులతో మతులు పోగొడుతోంది. చిరునవ్వుతో ఫొటోలకు పోజులిచ్చి కుర్ర గుండెల్లో గంటలు మోగించింది. వయస్సు పెరుగుతున్నా మరింతగా మైమరిపిస్తోంది.
 

తమిళ చిత్ర పరిశ్రమలో సీనియర్ నటిగా త్రిష ప్రస్తుతం హవా కొనసాగిస్తున్నారు. గతేడాది తమిళ బాహుబలిగా విడుదలైన ‘పొన్నియిన్ సెల్వన్ 1’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ‘కుందవై’పాత్రలో ఆకట్టుకుంది. 

కొన్నాళ్లు కేరీర్ లో సైలెంట్ అయిన ఈ బ్యూటీ.. మళ్లీ స్పీడ్ పెంచుతుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మున్ముందు మరిన్ని సినిమాలతో అలరించేందుకు సిద్ధం అవుతోంది. 
 

ఇక ప్రస్తుతం తమిళ దర్శకుడు లోకేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న Thalapathy67లో  హీరోయిన్ గా కన్ఫమ్ అయ్యింది. ప్రస్తుతం షూటింగ్ లో పాల్గొంది. మరోవైపు ‘పొన్నియిన్ సెల్వన్ 2’లోనూ నటిస్తోంది. వీటితో పాటు మరో చిత్రంలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. 

Latest Videos

click me!