నిత్యా మీనన్ క్యూట్ లుక్స్.. అందంగా నవ్వుతూ మెస్మరైజ్ చేస్తున్న కన్నడ బ్యూటీ!

First Published | Feb 2, 2023, 5:25 PM IST

టాలెంటెడ్ హీరోయిన్ నీత్యా మీనన్ (Nithya Menen) క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తున్న కన్నడ బ్యూటీ ఇంట్రెస్టింగ్ పోస్టులతో ఆకట్టుకుంటోంది. 
 

ఎలాంటి పాత్రలోనైనా జీవించగల నటి నిత్యా మీనన్. బాలనటిగానే ప్రేక్షకులను అలరిస్తున్నఈ బ్యూటీ సౌత్ లోని అన్ని భాషా చిత్రాల్లో నటిస్తూ బిజీ అవుతోంది. విభిన్న పాత్రలను పోషిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. 
 

ఇటీవల నిత్యామీనన్ నటించిన చిత్రాలకు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. గతేడాది విడుదలైన పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ చిత్రంతో నిత్యా అద్భుత నటనను కనబర్చింది. చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 
 


ఆ తర్వాత తమిళంలో వచ్చిన ‘తిరుచిత్రంబలం’ కూడా అదిరిపోయే రెస్పాన్స్ ను  దక్కించుకుంది. ధనుష్, నిత్యామీనన్ మధ్య కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయ్యారు. సినిమాకూ మంచి స్పందన లభించింది. చిత్రంలోని సాంగ్స్ హిట్ లిస్టులో చేరాయి.
 

ఇక ఇటీవల నిత్యా రెగ్యులర్ గా సోషల్ మీడియాలో తన అభిమానులను అలరిస్తూనే ఉంది. బ్యాక్ టు బ్యాక్ పోస్టులతో ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా క్యూట్ ఫొటోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు నిత్యా మీనన్.
 

ఎల్లో కలర్ వింటర్ వేర్స్ లో నిత్యా బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. క్యూట్ లుక్స్ తో పాటు.. మంద హాసంతో అభిమానులను కట్టిపడేసింది. మత్తు కళ్లతో కుర్ర గుండెల్లో గంటలు మోగించింది. లేస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. 

ప్రస్తుతం నిత్యా మీనన్ మలయాళంలో రూపుదిద్దుకుంటున్న ‘ఆరం తిరుకల్పన’లో నటిస్తోంది. దీనితోపాటు  ‘కుమారి శ్రీమతి’ అనే వెబ్ సిరీస్ లోనూ నటిస్తున్నారు. ఇక గతేడాది  ‘తెలుగు ఇండియన్ ఐడల్’తో ఓటీటీ ఆడియెన్స్ ను కూడా అలరించింది. ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ నూ అందిస్తున్నారు. 
 

Latest Videos

click me!